Samsung Mini LED TV : ఇంట్లోనే థియేటర్ ఫీల్! శాంసంగ్ కొత్త AI మినీ LED టీవీలు వచ్చేశాయి.. ధర మాత్రం నమ్మలేరు!
Samsung Mini LED TV : శాంసంగ్, ఏఐ ప్రాసెసర్లు, స్మార్ట్ ఫీచర్లతో కొత్త మినీ ఎల్ఈడీ టీవీ రేంజ్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ టీవీలలో స్మార్ట్‌థింగ్స్, వన్ యూఐ టైజెన్ ప్లాట్‌ఫామ్ ఉన్నాయి. స్మార్ట్ హోమ్ కంట్రోలింగ్ కంటెంట్ యాక్సెస్ ఈజీ అవుతుంది. ఈ కంపెనీ 7 ఏళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది.
- Sreehari A
- Published on- May 10, 2026 / 02:55 PM IST
Samsung Mini LED TV ( Image Credit : AI )
- శాంసంగ్ నుంచి సరికొత్త ఏఐ మినీ ఎల్ఈడీ టీవీ లాంచ్
- భారత మార్కెట్లో ఈ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ. 42,990
- ఈ టీవీల్లో 43 అంగుళాల నుంచి 100 అంగుళాల మోడళ్లు
Samsung Mini LED TV : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? శాంసంగ్ ఇండియా కొత్త ఏఐ-ఆధారిత మినీ ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త రేంజ్ మోడల్ టీవీ విజువల్స్, మెరుగైన కలర్ ఆప్షన్లు, స్మార్ట్ ఏఐ ఫీచర్లను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ సిరీస్ ధర రూ. 42,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 43 అంగుళాల (Samsung Mini LED TV) నుంచి 100 అంగుళాల వరకు మోడళ్లు ఉన్నాయి. ఈసారి శాంసంగ్ ప్రీమియం డిజైన్, అడ్వాన్స్ హోం, ఎంటర్‌టైన్మెంట్ ఎక్స్‌పీరియన్స్ పైనే ఫోకస్ పెట్టింది.
ధర ఎంతంటే? :
ఈ కొత్త సిరీస్‌లో శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీకి సపోర్టు ఇచ్చింది. యూజర్ల డేటాను లింక్ చేసే ఐఓటి డివైజ్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ టీవీలు స్మార్ట్‌థింగ్స్, వన్ యూఐ టైజెన్ ప్లాట్‌ఫామ్‌తో వస్తాయి. స్మార్ట్ హోమ్ కంట్రోలింగ్ కంటెంట్ యాక్సెస్ ఈజీ అవుతుంది.
కంపెనీ 7 ఏళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది. శాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా 14 భాషలలో 150కి పైగా ఫ్రీ ఛానెళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త టీవీ రేంజ్ ఫ్లిప్‌కార్ట్, (Samsung.com), ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా క్యాష్‌బ్యాక్ డౌన్ పేమెంట్ లేని ఈఎంఐ వంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
డిస్‌ప్లే, డిజైన్ :
కొత్త మినీ ఎల్ఈడీ టీవీ సిరీస్‌లో విమానాల్లో వాడే మెటల్‌స్ట్రీమ్ డిజైన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఈ టీవీ సింగిల్ మెటల్ బాడీని అత్యంత సన్నని బెజెల్స్ అందిస్తుంది. ఎడ్జ్-టు-ఎడ్జ్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
మినీ ఎల్ఈడీ టెక్నాలజీ చిన్న ఎల్ఈడీలను ఉపయోగిస్తుంది. మెరుగైన లైటింగ్ కంట్రోలింగ్ అందిస్తుంది. దాంతో పాటు ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్, కలర్ బూస్టర్ మినీ ఎల్ఈడీ హెచ్‌డీఆర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నేచురల్ కలర్లను డిస్‌ప్లే చేస్తుంది. ఈ టీవీ 90 శాతానికి పైగా వైడ్ కలర్ గామట్ కవరేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఏఐ ఫీచర్లు, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ :
ఈ స్మార్ట్‌టీవీలలో NQ4 ఏఐ జెన్2 ప్రాసెసర్ ఉంది. 20-లేయర్ న్యూరల్ నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్‌పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ రియల్ టైమ్ ఫొటో సౌండ్ ఆప్టిమైజ్ చేస్తుంది. టీవీ కంటెంట్ ఆధారంగా బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ క్లారిటీ ఆటోమాటిక్ అడ్జెస్ట్ చేస్తుంది.
ఏఐ సౌండ్ కంట్రోలర్ ఫీచర్ యూజర్ అవసరాలకు అనుగుణంగా ఆడియో ఎక్స్ పీరియన్స్ మారుస్తుంది. గేమింగ్, క్రీడా ప్రియుల కోసం మోషన్ ఎక్సెలరేటర్ 144Hz ఫీచర్ ఫాస్ట్ మూవెంట్స్ కూడా చాలా స్మూత్ గా కనిపిస్తాయి.
