SBI ATM Rules: SBI ఖాతాదారులకు బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఉచిత ATM లావాదేవీలు బంద్.. పరిమితి దాటితే ఫీజుల మోత!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ATM Rules) తమ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.

sbi atm transaction limit service charges changes from october 1st 2026

SBI ATM Rules: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ATM Rules) తమ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే అక్టోబర్ 1, 2026 నుంచి కొన్ని ప్రత్యేక ఖాతాలకు సంబంధించిన ఏటీఎం, ఏడీడబ్ల్యూఎం ఉచిత లావాదేవీల పరిమితుల్లో ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా శాలరీ ప్యాకేజ్, బీఎస్‌బీడీ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించే సమయంలో ఈ కొత్త నిబంధనలను తప్పక గమనించాల్సి ఉంటుంది.

Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు.. VRK డైట్‌తో లా విద్యార్థికి ప్రాణాంతకం.. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్!

శాలరీ ఖాతాదారులకు పరిమితి సగం కుదింపు:

కొత్త నిబంధనల ప్రకారం, శాలరీ ప్యాకేజ్ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎం/ఏడీడబ్ల్యూఎంల వద్ద నెలకు పొందే ఉచిత లావాదేవీల పరిమితిని 10 నుంచి 5కు తగ్గించారు. ఈ 5 ఉచిత లావాదేవీల్లో నగదు ఉపసంహరణలతో పాటు బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలు కూడా కలిసి ఉంటాయి. పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.23 + జీఎస్టీ, ఆర్థికేతర లావాదేవీకి రూ.11 + జీఎస్టీ చొప్పున ఛార్జీలు వసూలు చేయనున్నారు.

బీఎస్‌బీడీ ఖాతాల్లో పరిమితి దాటితే రూ.15 ఛార్జీ:

మరొకవైపు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు నెలకు లభించే 4 ఉచిత నగదు ఉపసంహరణల నిబంధన యథాతథంగా కొనసాగనుంది. అయితే, ఈ 4 ఉచిత విత్‌డ్రాయల్స్ పూర్తయిన తర్వాత చేసే ప్రతి అదనపు ఉపసంహరణపై రూ.15 తో పాటు జీఎస్టీ ఛార్జీ వర్తిస్తుంది. బ్యాంక్ బ్రాంచ్, ఏటీఎం లేదా ఇతర మార్గాల ద్వారా చేసే విత్‌డ్రాయల్స్ అన్నీ ఈ 4 ఉచిత పరిమితి కిందకే వస్తాయి కాబట్టి ఖాతాదారులు తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.