హౌసింగ్ రంగానికి భారీగా రాయితీలు!

త్వరలోనే రియల్టీ రంగానికి భారీగా రాయితీలు ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హింట్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సెక్టార్ ఎదుర్కొంటున్న ఇస్యూస్ ని పరిష్కరించే ప్రయత్నంలో కేంద్రం, ఆర్బీఐ ఉన్నట్లు మంగళవారం నిర్మలా సీతారామన్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తిగా పరిష్కరించబడలేదని ఆమె తెలిపారు. 

అనేక రంగాలపై రియల్ ఎస్టేట్ స్పిల్‌ఓవర్(చంపేసే)ప్రభావాన్ని చూపుతుందని, అందువల్ల దాని సమస్యలను పరిష్కరించడం వల్ల ప్రధాన సరఫరాదారులైన సిమెంట్, స్టీల్ వంటి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె అన్నారు. రియాల్టీ రంగానికి సహాయం చేయడానికి అవసరమైన చోట ప్రస్తుతమున్ననిబంధనలను ఎంత ఉత్తమంగా మార్చగలమో చూడటానికి ప్రభుత్వం ఆర్బీఐతో కలిసి పనిచేస్తోందని సీతారామన్ తెలిపారు. మార్కెట్,వినియోగం డిమాండ్ పునరుద్దరణకు ఆగస్టు నుంచి ప్రభుత్వం వివిధ రకాల నిర్ణయాలు తీసుకుందని ఆమె తెలిపారు.

విధాన నిర్ణయాల ద్వారా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి గృహ కొనుగోలుదారులు ప్రభుత్వం వైపు చూస్తున్నారని ఆర్థిక మంత్రి చెప్పారు. దేశంలో నిలిచిపోయిన సరసమైన, మధ్య-ఆదాయ గృహ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ అందించడానికి రూ .20,000 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు సీతారామన్ సెప్టెంబర్‌ లో ప్రకటించన విషయం తెలిసిందే.