Smart Saving Tips : మీ సిగరెట్ డబ్బులను SIPలో పెడితే లక్షల్లో సంపాదన.. ఈ లెక్కలు చూస్తే లైఫ్‌లో మళ్లీ స్మోకింగ్ చేయరు!

Smart Saving Tips : మీరు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు? సిగరెట్ల కోసం చేసే డబ్బును SIPలో పదేళ్ల పాటు పెట్టుబడిగా పెడితే ఎన్ని లక్షల డబ్బు సంపాదించుకోవచ్చో తెలుసా? పూర్తి వివరాలివే

Smart Saving Tips ( Image Credit to Original Source )

  • సిగరెట్ అలవాటుతో అనారోగ్యం, ఆర్థిక సంక్షోభం
  • రోజూ సిగరెట్ తాగేవారు చేసే ఖర్చుతో లక్షలు సంపాదించుకోవచ్చు
  • సిగరెట్ల డబ్బును SIPలో పెట్టుబడి పెడితే పదేళ్లలో ఎంత కూడబెడతారంటే?

Smart Saving Tips : మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా? స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఎక్కువ ఖర్చు ఉంటుంది. కొందరు అదేపనిగా స్మోకింగ్ చేస్తుంటారు. ఇలా జీవిత కాలం స్మోకింగ్ చేస్తు ఉంటే ఆరోగ్యం చెడిపోవడమే కాదు.. మీ ఆర్థిక పరిస్థితి కూడా చిన్నాభిన్నమైపోతుంది.

చాలామంది ఈ చిన్న ఖర్చు అలవాట్లను పెద్దగా పట్టించుకోరు. అందులో సిగరెట్ మానడమే అసలు పెద్ద సమస్య. ఈ వ్యసనం ఆరోగ్యానికి హానికరమే కాదు.. చెదపురుగుల మాదిరిగా వ్యక్తి ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తుంది.

రోజూ తాగే సిగరెట్ ఊపిరితిత్తులనే కాకుండా మీ ఖజానాను కూడా దహించివేస్తుంది. మీరు స్మోకింగ్ కోసం ఖర్చు చేసే ఈ డబ్బును తెలివిగా సేవింగ్ చేయడం నేర్చుకోవాలి. సిగరెట్లపై ఖర్చు చేసే డబ్బును ఆపి సరైన చోట పెట్టుబడిగా పెడితే మాత్రం భారీ మొత్తంలో డబ్బులు కూడబెట్టుకోవచ్చు. రాబోయే 10 ఏళ్ల SIPలో పెట్టుబడి పెడితే చక్రవడ్డీ వల్ల మీరు ఏకంగా రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు కూడబెట్టవచ్చు.

గత రెండు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే.. సిగరెట్ల ధరలు భారీగా పెరిగాయి. 2005లో కేవలం రూ. 59 ఉన్న సిగరెట్ల ప్యాకెట్ ధర 2026 నాటికి రూ. 480కి చేరింది. ఈ ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకుంటే.. గత 21 ఏళ్లలో ధరలు 713 శాతం పెరిగాయి. 2010లో రూ. 96కి చేరగా 2015లో రూ. 200, 2020లో రూ. 300 దాటింది. సిగరెట్ల ధరలు 7 రెట్లకు పైగా అంటే.. 185 శాతం రేటుతో పెరిగాయి.

ప్రతి నెలా వేల రూపాయలు ఆవిరి :
ప్రస్తుత రోజుల్లో మీరు కొనే సిగరెట్ ప్రీమియం బ్రాండ్‌ ఏదైనా సరే రోజుకు 10 సిగరెట్లు తాగడం వల్ల మీ జేబుపై నేరుగా ప్రభావం పడుతుంది. మీకు సిగరెట్లు తాగేందుకు నెలకు సుమారు రూ. 7వేలు నుంచి రూ. 8,000 ఖర్చవుతుంది. సంవత్సరానికి రూ. 80,000 నుంచి రూ.90,000 మధ్య ఉంటుంది.

Read Also : RBI New Rules : ఆర్బీఐ కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్.. ఆన్‌లైన్ మోసాలకు బ్యాంకులదే పూర్తి బాధ్యత..

చాలా సందర్భాలలో సగటు జీతం పొందే వ్యక్తి ఆదాయంలో 35 శాతం వరకు ఉంటుంది. అక్షరాలా పొగ రూపంలో ఆవిరైపోతుంది అనమాట. భారత్‌లో సుమారు 13 కోట్ల మంది స్మోకింగ్ చేసేవారు ఉన్నారు.

స్మోకింగ్ మానేసి ఆ డబ్బుతో సంపాదన :
ఈ స్మోకింగ్ వల్ల కలిగే నష్టాన్ని ఆర్థికపరంగా అంచనా వేస్తే.. ఎవరైనా తమ సిగరెట్ వ్యసనాన్ని మానుకుని ప్రతి ఏడాదిలో ఖర్చు చేసే ఆ మొత్తం డబ్బును నిఫ్టీ SIPలో పెట్టుబడి పెట్టడం చేస్తుండాలి.

తద్వారా స్టాక్ మార్కెట్ సగటు వార్షిక రాబడి 12శాతంగా రాబోయే 10 ఏళ్లు ఆ తర్వాత కూడా ఇలానే పెట్టుబడి పెడుతూ పోతే కాంపౌండింగ్ పవర్ కారణంగా మీ ఫండ్ వాల్యూ రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలకు చేరవచ్చు.

15 ఏళ్లకు లెక్కిస్తే.. రూ. 35 లక్షల రూ. 40 లక్షలకు చేరుకుంటుంది. 20 ఏళ్లలో 60 లక్షల నుంచి రూ. 70 లక్షలకు చేరుతుంది. అంటే.. ఇక్కడ మీకు ఉన్న ఈ చిన్న వ్యసనాన్ని పెట్టుబడిగా మార్చుకుంటే భారీ మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చు.

పరోక్షంగా డబ్బు ఆదా :
సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్, ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యల వంటి తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. నెలకు రూ. 500తో సాధారణ వైద్య ఖర్చు కూడా ఈ వ్యసనం కారణంగా సంవత్సరానికి రూ. 6,000 అవుతుంది.

ఒక వ్యక్తి 40 ఏళ్ల పాటు ఈ వ్యసనానికి బానిసగా మారితే కేవలం మెడికల్ బిల్లులకే రూ. 2,40,000 ఖర్చు చేసి ఉంటారు. తీవ్రమైన అనారోగ్యాలకు చికిత్సకు అయ్యే ఖర్చు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అవసరమైతే ఆస్తులు అమ్మినా ఆరోగ్యాన్ని తిరిగితెచ్చుకోలేరు.

అందుకే చేతిలో డబ్బుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. స్మోకింగ్ వంటి ప్రమాదకరమైన అలవాట్ల కోసం డబ్బు ఖర్చు చేయకూడదు. ఆరోగ్యం పోతుంది. డబ్బు కూడా పోతుంది. అదే డబ్బును ఇల్లు కొనడం లేదా కారు, ఏదైనా ఇన్వెస్ట్ చేసేందుకు వాడొచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బుతో అనారోగ్యాన్ని కొంటారా? లేదా మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారా అనేది మీరే నిర్ణయించుకోవాలి.