Split AC Offers : కొత్త AC కొంటున్నారా? రూ. 35,000 లోపు 5 బెస్ట్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీలు.. ఏది కొంటారో మీదే ఛాయిస్!
Split AC Offers : కొత్త ఏసీ కొనాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి. రూ. 35వేల లోపు ధరలో 5 బెస్ట్ 1. 5 టన్ స్ప్లిట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది కొంటారో మీ ఇష్టం..
- Sreehari A
- Published On : March 28, 2026 / 04:56 PM IST
Split AC Offers
- సమ్మర్‌లో కొత్త ఏసీ కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్
- రూ. 35వేల లోపు ధరలో 5 బెస్ట్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీలు
- మిడ్ రేంజ్ సైజు గదులకు ఫిట్, 60శాతం వరకు పవర్ ఆదా
Split AC Offers : అసలే సమ్మర్.. ఎండలు పెరుగుతున్నాయి. ఉక్కపోత కూడా మొదలైంది. కాసేపు ఏసీ, కూలర్ లేకుండా ఉండలేని పరిస్థితి. సమ్మర్ ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొత్త ఏసీ, కూలర్లు కొనేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. సమ్మర్ సీజన్ కావడంతో ఏసీల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎండలతో పాటు మార్కెట్లో ఎయిర్ కండిషనర్ల ధరలు కూడా పెరుగుతాయి.
ఏసీల ధరలు తక్కువగ ఉన్నప్పుడే కొనేసుకోవడం బెటర్. రూ. 3500 బడ్జెట్ లోపు ధరలో మీ గదులకు సరిపోయే అద్భుతమైన స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వేసవి కాలంలో ఖరీదైన ఏసీల కన్నా తక్కువ ఖర్చుతో మంచి ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు. మిడ్ రేంజ్ రూంలకు చక్కగా సరిపోయే 1.5 టన్నుల కెపాసిటీతో రూ. 35వేల లోపు ధరలో 5 బెస్ట్ స్ప్లిట్ ఏసీలను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఏసీని కొనేసుకోండి.
వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ (రూ. 31,490) :
వోల్టాస్ స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీతో 1.5 టన్నుల సామర్థ్యంతో వస్తుంది. ఈ ఏసీ 4-ఇన్-1 అడ్జెస్ట్ కూలింగ్ సిస్టమ్‌ను అందిస్తుంది. యాంటీ-డస్ట్ ఫిల్టర్, లో సౌండ్ లెవల్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది. అదనంగా, ఈ ఏసీకి 5 ఏళ్ల ఫుల్ వారంటీ కూడా ఉంది.
డైకిన్ 1.5 టన్ 3 స్టార్ (రూ. 32,490) :
డైకిన్ ఏసీ 1.5-టన్నుల సామర్థ్యాన్ని అందిస్తుంది. 110 నుంచి 160 చదరపు అడుగుల వరకు మిడ్ రేంజ్, భారీ సైజు గదులకు బాగుంటుంది. ఇన్వర్టర్ టెక్నాలజీతో 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ అందిస్తుంది. ఇందులో కాపర్ కండెన్సర్ కూడా ఉంది. అలాగే, 5.0 kW,17100, Btu/hr కూలింగ్ సామర్థ్యం, 230V పవర్ సప్లయ్ అందిస్తుంది.
క్యారియర్ 2026 మోడల్ 1.5 టన్ (రూ. 33,990) :
క్యారియర్ లేటెస్ట్ మోడల్‌లో ఆటో ఎయిర్ స్వింగ్ మోడ్, డస్ట్ ఫిల్టర్ ఉన్నాయి. అదనంగా, 2 రకాల బ్యాటరీలతో వర్టికల్ స్వింగ్ కూడా ఉంది. ఈ యూనిట్ 1.5 టన్నుల సామర్థ్యంతో పాటు 3-స్టార్ BEE రేటింగ్‌ను కూడా ఉంది. ఏఐ ఇన్వర్టర్ టెక్నాలజీతో 4800W కూలింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
గోద్రెజ్ 1.5 టన్ 3 స్టార్, 5-ఇన్-1 (రూ. 29,490) :
గోద్రెజ్ స్ప్లిట్ ఏసీ 1.5 టన్నుల సామర్థ్యంతో వస్తుంది. 180 చదరపు అడుగుల వరకు గదులకు సరైనది. 5050 వాట్ల కూలింగ్ సామర్థ్యం, 230-వోల్ట్ పవర్ సప్లయ్ కూడా ఉన్నాయి. అంతేకాదు.. వార్షిక విద్యుత్ వినియోగం 1003.51 యూనిట్లు, 5-ఇన్-1 కన్వర్టిబుల్ టెక్నాలజీతో వస్తుంది.
హైయర్ 2025 మోడల్ 1.5 టన్ 3 స్టార్ (రూ. 33,990) :
హైయర్ స్ప్లిట్ ఏసీ 1.5 టన్నుల సామర్థ్యంతో ట్రిపుల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వస్తుంది. గది వాతావరణానికి తగినట్టుగా టెంపరేచర్ అడ్జెస్ట్ చేసే వేరియబుల్-స్పీడ్ ఆపరేషన్ ఉంది. 7-ఇన్-1 ఇంటెల్లీ-కన్వర్టిబుల్ మోడ్‌తో వస్తుంది. పవర్ వినియోగాన్ని 60శాతం వరకు ఆదా చేస్తుంది. ఈ యూనిట్ మిడ్ రేంజ్ సైజు గదులకు బాగా సరిపోతుంది.
