×
Ad

Sukanya Samriddhi Yojana : మీకు ఆడపిల్ల పుట్టిందా? నెలకు ఈ పథకంలో రూ.1000 పెట్టుబడి పెట్టండి.. పెళ్లి నాటికి లక్షల్లో డబ్బు చేతికి!

Sukanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన పథకం మీరు పోస్టాఫీసు లేదా ఏదైనా బ్యాంకులో కేవలం రూ. 250తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీ కుమార్తె భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే సేవింగ్ చేయడం మొదలుపెట్టండి. పెళ్లి నాటికి లక్షల్లో డబ్బు మీ చేతికి వస్తుంది.

Sukanya Samriddhi Yojana

  • సుకన్య సమృద్ధి యోజన (SSY)లో అకౌంట్ ఓపెన్ చేయండి
  • 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం పథకం
  • ఉన్నతచదువులకు పెళ్లి అవసరాలకు డబ్బులు చేతికి వస్తాయి
  • కుమార్తె పేరుతో నెలకు రూ. 1000 లేదా రూ. 250తో పెట్టుబడి పెట్టండి

Sukanya Samriddhi Yojana : పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే, మీ పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టండి. వారి చదువులతో పాటు భవిష్యత్తులో వివాహానికి అవసరమైన ఖర్చులకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ప్రతి పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారికి ఎలాంటి ఆర్థికంగా లోటు ఉండకూడదని భావిస్తుంటారు.

అందులో ప్రధానంగా పిల్లల ఉన్నత విద్య, వివాహం వంటి జీవితంలో వారికి డబ్బు పరంగా ఎలాంటి సమస్య రాకూడదని కోరుకుంటారు. భారత్ లో అయితే చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆడపిల్లల విద్య, వివాహం వంటి అవసరాలకు ముందుగానే సేవింగ్స్ చేయడం చేస్తుంటారు. ఇలాంటి వారికోసమే

కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా తమ కుమార్తె పేరుతో చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈ పథకంలో మంచి వడ్డీతో పాటు భారీ మొత్తంలో రాబడిని కూడబెట్టుకోవచ్చు. భవిష్యత్తులో పిల్లల ఉన్నతచదువులకు లేదా పెళ్లి వంటి అవసరాలకు ఈ డబ్బులు చేతికి వస్తాయి.

ఈ పథకం ప్రభుత్వ మద్దతుతో నడిచే పథకం కావునా ఎలాంటి రిస్క్ ఉండదు. సురక్షితమైన పెట్టుబడి కోసం చూసేవారు ఎవరైనా తమ కుమార్తెల భవిష్యత్తు కోసం ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకీ ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎంత మొత్తంలో రాబడి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సుకన్య సమృద్ధి యోజన ఏంటి? :

సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం అనేది 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సేవింగ్ స్కీమ్ ద్వారా తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమెకు 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆమె పేరుతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పిల్లల విద్యతో పాటు వివాహ ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.

ఈ పథకం కింద అమ్మాయికి 21 ఏళ్లు వయస్సు వచ్చినప్పుడు మెచ్యూరిటీ చెందే అకౌంటులో క్రమం తప్పకుండా డిపాజిట్లు చేయవచ్చు. అందించే వడ్డీ రేటు సాధారణంగా ప్రామాణిక బ్యాంకు స్థిర డిపాజిట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ పథకంలో పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పథకంపై రాబడికి ఎలాంటి పన్ను ఉండదు.

వడ్డీ రేటు, రాబడి :
ప్రస్తుతం, ఈ పథకం కింద వార్షిక వడ్డీ రేటు 8.2శాతంగా అందిస్తుంది. ఈ రేటును ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షించి నిర్ణయిస్తుంది. అయినప్పటికీ కాలక్రమేణా స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు.. తల్లిదండ్రులు నెలకు రూ. 1,000 (సంవత్సరానికి రూ. 12వేలు) జమ చేస్తే.. 15 ఏళ్లలో మొత్తం పెట్టుబడి రూ. 1,80,000 అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. సంపాదించిన అంచనా వడ్డీ రూ. 3,74,206 అవుతుంది. ఫలితంగా అకౌంట్ 21 ఏళ్లు పూర్తి కాగానే దాదాపు రూ. 5,54,206 మెచ్యూరిటీ మొత్తం వస్తుంది.

Read Also : PM-Kisan : పీఎం కిసాన్‌పై ఉత్కంఠ.. రూ. 22వ విడతకు ముందే లక్షలాది రైతుల పేర్లు తొలగింపు.. మీ పేరు తీసేయడానికి 5 కారణాలివే..!

అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? :

ఏదైనా పోస్టాఫీసు లేదా అధీకృత బ్యాంకు శాఖలో కనీసం రూ. 250 డిపాజిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అవసరమైన డాక్యుమెంట్లలో ఆడపిల్ల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రులు లేదా గార్డియన్ల ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్, ఓటరు ఐడీ, పాన్ కార్లు) ఉన్నాయి. ఒక ఫ్యామిలీ గరిష్టంగా ఇద్దరు కుమార్తెలకు అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఆడపిల్ల పేరు మీద మాత్రమే ఉండాలి. తల్లిదండ్రులు ఆమె తరపున అకౌంంట్ ఆపరేట్ చేస్తారు అంతే.

డిపాజిట్ వ్యవధి, మెచ్యూరిటీ :
అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 15 ఏళ్లు మాత్రమే డిపాజిట్లు అవసరం. అయితే, అమ్మాయికి 21 ఏళ్లు నిండినప్పుడు అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది. 15 ఏళ్ల డిపాజిట్ వ్యవధి తర్వాత కూడా మెచ్యూరిటీ వరకు సేకరించిన మొత్తంపై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత సంబంధిత సహాయక పత్రాల సమర్పణకు లోబడి విద్య లేదా వివాహ ఖర్చుల కోసం మొత్తం బ్యాలెన్స్‌లో 50శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

అర్హత, పన్ను ప్రయోజనాలివే :
ఈ పథకం కింద తల్లిదండ్రులు లేదా గార్డియన్లకు ఆదాయం ఎంత అనేది అవసరం లేకుండా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. దీర్ఘకాలిక సేవింగ్ కోసం చూసే మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం అద్భుతంగా ఉంటుంది. ఈ పథకంలో కనీసం వార్షిక డిపాజిట్ రూ. 250 చేయాల్సి ఉంటుంది. లేదంటే పెనాల్టీ పడుతుంది.

గరిష్ట వార్షిక కాంట్రిబ్యూషన్ రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అంటే ఇది (EEE) కేటగిరీ కిందకు వస్తుంది.. అంటే పెట్టుబడి పెట్టిన మొత్తం, సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ ఆదాయం అన్నీ పన్ను రహితంగా ఉంటాయి. 10 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

Discliamer : ఈ పెట్టుబడి సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడిదారులు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ప్రభుత్వ మద్దతు పథకం అయినప్పటికీ, నిబంధనలు, షరతులు కాలానుగుణంగా మారవచ్చు. అధీకృత బ్యాంకు లేదా పోస్టాఫీసు అధికారులను సంప్రదించండి.