Samsung Galaxy M35 5G
Samsung Galaxy M35 5G : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. అమెజాన్‌లో ప్రత్యేకించి శాంసంగ్ పాపులర్ ఫోన్ గెలాక్సీ M35 5G భారీ తగ్గింపుతో అందిస్తోంది. పంచ్-హోల్ స్క్రీన్, బిగ్ బ్యాటరీతో ప్రీమియం పర్ఫార్మెన్స్ అందిస్తోంది. ఈ శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫోన్‌పై అమెజాన్‌లో ఏకంగా 43శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ సమ్మర్ సేల్ డీల్ ఎలా పొందాలంటే?
శాంసంగ్ గెలాక్సీ M35 5G ప్రాసెసర్ :
శాంసంగ్ గెలాక్సీ M35 5G ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌తో సపోర్టు ఇస్తుంది. రోజువారీ కార్యకలాపాలకు, భారీ అప్లికేషన్‌లకు ఎలాంటి సమస్య లేకుండా సపోర్టు ఇస్తుంది. 2.4GHz వరకు ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో సాధారణ యూజర్లకు సరిపోతుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో మల్టీ టాస్కింగ్ అందిస్తుంది. హైబ్రిడ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ ఎక్స్‌టెన్షన్ స్పేస్ 1TB వరకు అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే, బ్యాటరీ :
శాంసంగ్ గెలాక్సీ M35 5Gలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్ కూడా ఉంది. సిల్కీ-స్మూత్ స్వైపింగ్, స్క్రోలింగ్ ఉన్నాయి. 1000 నిట్స్ స్క్రీన్ ద్వారా పనిచేస్తుంది. అయితే, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ మరింత ప్రొటెక్షన్ అందిస్తుంది. 6000mAh బ్యాటరీతో ఒకటి లేదా రెండు రోజులు ఛార్జింగ్ వస్తుంది. ఛార్జింగ్ గరిష్టంగా 25W వద్ద ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ M35 5G కెమెరా :
50MP ప్రైమరీ సెన్సార్, OIS, 8MP, 2MP లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. డే టైమ్, తక్కువ-కాంతిలో కూడా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. 30fps వద్ద 4K వరకు వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. సోషల్ మీడియాకు క్వాలిటీ కంటెంట్‌ను అందిస్తుంది. 13MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
శాంసంగ్ 5G ఫోన్ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ M35 5G సేల్ ధర రూ. 24,499 నుంచి రూ.13,999కు లభిస్తుంది. 43శాతం తగ్గింపు పొందవచ్చు. రూ.15వేల కన్నా తక్కువ ధరలో పొందవచ్చు.
Read Also : Realme Narzo 70 Turbo 5G : అమెజాన్‌లో రియల్‌మి 5G ఫోన్‌పై అద్భుతమైన డీల్.. తక్కువ ధరకే ఎలా కొనాలంటే?
బ్యాంక్ ఆఫర్లు :
క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐతో రూ. 889 వరకు వడ్డీ సేవ్ చేయొచ్చు. అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసే కస్టమర్లు అమెజాన్ పే బ్యాలెన్స్‌లో రూ. 419 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫోన్ ప్రాసెసర్, అమోల్డ్ డిస్‌ప్లే, సరసమైన ప్యాకేజీలో భారీ బ్యాటరీతో వస్తుంది. నీటి నిరోధకతను కలిగి ఉండదు. హెడ్‌ఫోన్ జాక్ లేదు.