Sundar Pichai : కంపెనీలో చేసే పని కన్నా ఉద్యోగులే ఎక్కువ.. కోత తప్పదంటున్న గూగుల్ బాస్..!

ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ నుంచి చాలావరకు టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.

Sundar Pichai : ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం భయంతో అనేక పెద్ద టెక్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ నుంచి చాలావరకు టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఉద్యోగాల్లో కోత విధిస్తోంది. గూగుల్‌లో పనిచేసే చాలా మంది ఉద్యోగుల పనితీరుపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్యనిర్వాహక సమావేశం నిర్వహించి.. ఉద్యోగులు సమర్థవంతంగా పని చేయాలని, వారి ఉత్పత్తులను మెరుగుపర్చేందుకు కస్టమర్‌లకు ఎలా సహాయపడాలనే దానిపై మరింత దృష్టిపెట్టాలని పిచాయ్ హెచ్చరిక జారీ చేశారు. గూగుల్‌లో ఉత్పాదకత తగ్గిపోయిందని, కంపెనీలో చేయాల్సి పనికన్నా ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని పిచాయ్ అభిప్రాయపడ్డారు. పనికి మించిన ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Sundar Pichai says Google has too many employees but too few work, issues warning

గూగుల్‌లో ఉండాల్సిన దానికంటే చాలా మంది ఉద్యోగులు ఉన్నారని సీఈఓ భావిస్తున్నారు. ప్రస్తుతం పనిచేసే ఉద్యోగుల్లో చాలా మంది సమర్థవంతంగా పనిపై దృష్టి కేంద్రీకరించడం లేదని సీఈఓ భావిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం.. పిచాయ్ ఉద్యోగులను ‘మిషన్-ఫోకస్డ్’ ఉత్పత్తులపై ఎక్కువ దృష్టిసారించాలని కోరారు. అయితే చాలామంది ఉద్యోగులు చేయాల్సిన పనిమానేసి పరధ్యానంగా ఉంటున్నారని, తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత రెండింటిపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. 2022 రెండవ త్రైమాసికం ఆదాయాలు రాబడి పరంగా చూస్తే.. అంచనాల కంటే బలహీనంగా ఉందని ఇటీవలే గూగుల్ నివేదించింది.

మొదటి త్రైమాసికంలో కూడా ఉంది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం 13 శాతం తక్కువ వృద్ధిని నమోదు చేసిందని నివేదిక తెలిపింది. ఈ క్రమంలోనే కంపెనీలోని పనిచేసే ఉద్యోగుల అవసరాలను సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రాబోయే మూడు నెలలకు కొత్త ప్రాధాన్యత కలిగిన సిబ్బంది కోసం ప్రయత్నాలు చేపట్టింది. సామర్థ్యం ఉత్పాదకత, నైపుణ్యాలు లేకపోవడం, ఖర్చును ఆదా చేయడం వంటి కారణాలతో గూగుల్ త్వరలో కొంతమంది ఉద్యోగులను తొలగించనుంది. అంతేకాదు.. కంపెనీ నియామక ప్రక్రియను కూడా తాత్కాలికంగా నిలిపివేయనుంది. మిగిలిన ఏడాదిలో నియామకాలపై నిర్ణయాన్ని తీసుకోనుంది.

Read Also : Google Street View : గూగుల్‌ మ్యాప్స్‌ స్ట్రీట్‌ వ్యూపై ఎన్నో అనుమాలు..భద్రతపై ఆందోళన

ట్రెండింగ్ వార్తలు