Market Crash: స్విగ్గీ, జొమాటోలకు భారీ షాక్.. రూ.1.41 లక్షల కోట్ల లాస్.. అసలు ఏం జరిగిందంటే?

భారతదేశంలో 10 నిమిషాల డెలివరీ ట్రెండ్‌తో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జొమాటో, స్విగ్గీ సంస్థలకు స్టాక్ మార్కెట్‌(Market Crash)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Swiggy and Zomato incur massive losses of Rs 1.41 lakh crore

  • క్విక్ కామర్స్‌లో భారీ పతనం.
  • దిగ్గజాల ఎంట్రీతో తీవ్ర పోటీ.
  • డార్క్ స్టోర్ల శరవేగ విస్తరణ.

Market Crash: భారతదేశంలో 10 నిమిషాల డెలివరీ ట్రెండ్‌తో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జొమాటో, స్విగ్గీ సంస్థలకు స్టాక్ మార్కెట్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశీయ క్విక్-కామర్స్ రంగంలోకి గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, వాల్‌మార్ట్ (ఫ్లిప్‌కార్ట్), రిలయన్స్ భారీ ఎత్తున ప్రవేశిస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. పోటీ తీవ్రం కానుందనే భయాల మధ్య గురువారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ రెండు కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఏకంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.41 లక్షల కోట్లు) క్షీణించింది(Market Crash). ఇందులో జొమాటో (బ్లింకిట్) షేర్లు అక్టోబర్ గరిష్ఠాల నుండి 28 శాతం, స్విగ్గీ (ఇన్‌స్టామార్ట్) షేర్లు సెప్టెంబర్ గరిష్ఠాల నుండి 47 శాతం మేర పతనమయ్యాయి.

రంగంలోకి దిగ్గజాలు: శరవేగంగా డార్క్ స్టోర్ల విస్తరణ:

దేశంలో వేగంగా విస్తరిస్తున్న 11 బిలియన్ డాలర్ల రాపిడ్-కామర్స్ మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి దిగ్గజ సంస్థలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

* అమెజాన్ నౌ: తన అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ సేవలను 15 నగరాల నుండి ఏకంగా 300 నగరాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం క్లౌడ్, ఏఐ మౌలిక సదుపాయాలపై మరో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.

* ఫ్లిప్‌కార్ట్ మినిట్స్: ఇప్పటికే 130 నగరాల్లో 1,000 డార్క్ స్టోర్లతో దూసుకుపోతున్న ఈ సంస్థ, రాబోయే నెలల్లో 180కి పైగా నగరాల్లో 1,500 స్టోర్లను తెరవాలని ప్లాన్ చేస్తోంది.

* రిలయన్స్ జియోమార్ట్: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ తనకున్న 3,100కు పైగా ఫిజికల్ స్టోర్ల నెట్‌వర్క్‌ను వాడుకుంటూ 1,200 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరిస్తోంది.

ప్రస్తుతానికి బ్లింకిట్ 2,243 డార్క్ స్టోర్లతో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 1,143 స్టోర్లతో రేసులో ముందంజలో ఉన్నాయి.

జెప్టో ఐపీఓపై ప్రభావం.. మార్కెట్ విశ్లేషణ:

ఈ తీవ్రమైన ధరల యుద్ధం కారణంగా వచ్చే నెలలో జరగాల్సిన క్విక్ కామర్స్ స్టార్టప్ ‘జెప్టో’ ఐపీఓ (IPO) ఉత్సాహం కూడా కాస్త తగ్గింది. అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో జెప్టో షేర్లు ఫిబ్రవరి నుండి 32 శాతానికి పైగా పడిపోయాయి. ఆర్థికంగా చూస్తే.. ప్రస్తుతం బ్లింకిట్ మాత్రమే EBITDA-స్థాయి లాభాన్ని ఆర్జిస్తుండగా, స్విగ్గీ క్విక్ కామర్స్ విభాగం ఏడాదికి $460 మిలియన్లు, జెప్టో $600 మిలియన్లకు పైగా నష్టాల్లో నడుస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు భారీ తగ్గింపులు ఇస్తుండటంతో స్వల్పకాలిక లాభాలు తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ఈ క్విక్ కామర్స్ ట్రెండ్ కేవలం మెట్రోలకే పరిమితం కాకుండా టైర్-2, టైర్-3 నగరాలకు కూడా వేగంగా విస్తరించడం ఈ రంగానికి కలిసొచ్చే సానుకూల అంశం.