ఎక్కడైనా ఇంటి కోసం ప్లాన్ చేస్తున్నారా? కట్టిన ఇళ్లు అయినా పర్వాలేదా? అయితే మీకో గుడ్ న్యూస్. కేవలం ఒక డాలర్ (యూరో) కే ఇళ్లు సొంతం చేసుకోవచ్చు. భారత కరెన్సీలో అయితే రూ.70 వరకు విలువ ఉంటుంది. అదేంటీ.. లక్షలు పోస్తే కానీ ఇళ్లు రాని ఈ రోజుల్లో ఒక డాలర్ కే ఇళ్లు ఎలా వస్తాయిని కొట్టిపారేకయండి. మీరు విన్నది నిజమే.. ఆ నగరంలో కేవలం ఒక యూరోకు మాత్రమే ఇళ్లు ఆఫర్ చేస్తున్నారు. ఇటలీలోని పశ్చిమ అంచున ఉన్న దక్షిణాన తీరప్రాంత నగరం టరాంటో ఒకటి.. ఈ నగరంలో నివసించే జనాభా రోజురోజుకీ క్షీణించిపోతోంది. దీంతో ఒక డాలర్ కు గృహాలను ఆఫర్ చేస్తూ ఇటలీలోని నగరాల్లో మొదటి నగరంగా నిలిచింది.
ఇక్కడివారంతా వేరే ప్రాంతానికి వలస వెళ్లిపోతున్నారు. అందుకే జనాభాను పెంచే ప్రయత్నంలో భాగంగా ఒక యూరోకే ఇక్కడి కట్టిన ఇళ్లను ఆఫర్ చేస్తున్నారు. ఇల్వా అని పిలువబడే భారీగా కలుషితమైన ఉక్కు కర్మాగారానికి ఈ నగరం నిలయంగా మారినట్టు ఓ నివేదిక వెల్లడించింది. చారిత్రాత్మక కేంద్రంలో జనాభా 19వ శతాబ్దంలో సుమారు 40వేల జనాభా నుంచి 3వేల జనాభాకు పడిపోయింది. అందుకే ఈ పాత సిటీలో 25 వేల మంది కొత్త నివాసితులతో సిటీని చైతన్యం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు అక్కడి కౌన్సిలర్ ఫ్రాన్సిస్కా విగ్గియానో తెలిపారు
నగరం పాత భాగమంతా దాని స్వంత ద్వీపంలో ఉంది. ఇరువైపులా రెండు వంతెనల ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానమైనది. కీలకమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి 90 మిలియన్ల యూరోల నగదు మంజూరు చేయడం జరిగింది. నగరం ప్రారంభంలో 3 భవనాలు ఉన్నాయి. వీటిలో 15 హౌసింగ్ యూనిట్లు ఉన్నాయి.
ఒక్కొక్క భవనం ధర ఒక యూరోతో అమ్మకానికి ఉన్నాయి. తొలి దశలో ఈ గృహాలు సక్సస్ అయితే.. మరిన్ని నిర్ణీత సమయంలో అమ్మకానికి పెట్టనున్నారు. ఈ ద్వీపంలో సుమారు 1,300 గృహాలు ఉన్నాయి. విగ్గియానో ప్రకారం.. న్యూయార్క్, మిలన్ రోమ్ వంటి ప్రాంతాల నుంచి ఈ సిటీలోని భవనాలను కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి.