Tata EV BaaS Scheme : మిడిల్ క్లాస్ కోసం టాటా చీపెస్ట్ EVలు.. 530 కి.మీ రేంజ్, మోడ్రన్ ఫీచర్లు.. ధర కేవలం రూ.4.60 లక్షలే!
Tata EV BaaS Scheme : టాటా మోటార్స్ మొత్తం ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ BaaS పథకంలో చేర్చింది. టియాగో ఈవీ నుంచి హారియర్ ఈవీ వరకు ఇప్పుడు తక్కువ ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- September 29, 2026 / 07:54 PM IST
Tata EV BaaS Scheme
- టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ BaaS స్కీమ్
- టియాగో EV నుంచి హారియర్ EV వరకు తక్కువ ధరకే
- టియాగో ఈవీ కేవలం రూ. 4.69 లక్షల నుంచి ప్రారంభం
- హారియర్ ఈవీపై రూ.7.30 లక్షల వరకు ఆదా
Tata EV BaaS Scheme : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇప్పుడు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్‌ను మొత్తం ఎలక్ట్రిక్ కార్ల రేంజ్‌కు విస్తరించింది. గతంలో ఈ ఫీచర్ కేవలం టియాగో ఈవీ, పంచ్ ఈవీలలో మాత్రమే అందుబాటులో ఉండేది.
కానీ,ఇప్పుడు నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, సియెర్రా ఈవీ, హారియర్ ఈవీలలో కూడా చేర్చింది. ఈ స్కీమ్ కింద కారు, బ్యాటరీ కోసం (Tata EV BaaS Scheme) వేర్వేరు అకౌంట్లను అందిస్తోంది. తద్వారా ప్రారంభ కొనుగోలు ఖర్చు భారీగా తగ్గుతుంది. టియాగో ఈవీ ధర ఇప్పుడు కేవలం రూ.4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
అలాగే, టాటా పంచ్ రూ.6.59 లక్షలు, నెక్సాన్ రూ.8.99 లక్షలు, కర్వ్ రూ.10.99 లక్షలు, సియెర్రా రూ.11.99 లక్షలు, హారియర్ రూ.14.49 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ ఛార్జీలు ప్రతి కిలోమీటరుకు విడిగా వసూలు చేస్తుంది.
ఈ స్కీమ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను సరసమైన ధరలకే అందిస్తోంది. వినియోగదారులు మొత్తం వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. టాటా ఈవీ కార్ల వివిధ మోడళ్ల ధరలు, దేనికి ఎంత బ్యాటరీ రెంట్ చెల్లించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా టియాగో ఈవీ :
BaaS కింద 19kWh బ్యాటరీతో టియాగో ఈవీ బేస్ వెర్షన్ ధర రూ.4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సాధారణ ధర రూ.6.99 లక్షలు కాగా సుమారుగా రూ.2.30 లక్షల ఆదా అవుతుంది. రోజుకు 44 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
బ్యాటరీ రెంట్ ఖర్చు కిలోమీటరుకు రూ.2.6గా ఉంది. సుమారుగా 220 నుంచి 250 కిలోమీటర్లు రేంజ్ అందిస్తుంది. స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కావడంతో రోజువారీ నగర ప్రయాణాలకు అత్యంత సరసమైన కారుగా చెప్పొచ్చు.
పంచ్ ఈవీ :
30kWh బ్యాటరీతో ఎంట్రీ-లెవల్ మోడల్ ఇప్పుడు రూ.6.59 లక్షలకు లభిస్తుంది. గతంలో ధర రూ.9.79 లక్షలు కాగా ఇప్పుడు రూ.3.20 లక్షలకు లభిస్తుంది. రోజుకు 60 కిలోమీటర్ల మైలేజీ, బ్యాటరీ వినియోగ ఖర్చులు కిలోమీటరుకు రూ.2.6గా ఉన్నాయి. సుమారు 300 నుంచి 350 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ స్టైలింగ్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అందిస్తుంది. సేఫ్టీ ఫీచర్లతో ఫ్యామిలీ కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్.
టాటా నెక్సాన్ ఈవీ :
45kWh బ్యాటరీతో నెక్సాన్ ఈవీ వెర్షన్ BaaSలో రూ.8.99 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. సాధారణ ధర రూ.14.34 లక్షల నుంచి రూ.5.35 లక్షల ఆదా అవుతుంది. బ్యాటరీ రెంట్ కిలోమీటరుకు రూ.4.4 చెల్లించాలి. 450 నుంచి 489 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుంది భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ SUVలలో ఈ మోడల్ ఒకటి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా బాగుంది.
టాటా కర్వ్ :
55kWh బ్యాటరీతో కర్వ్ ఈవీ బేస్ మోడల్ ధర రూ.17.19 లక్షల నుంచి తగ్గి ఇప్పుడు రూ.10.99 లక్షలకు లభిస్తుంది. బ్యాటరీ ఖర్చు కిలోమీటరుకు రూ.5గా ఛార్జ్ అవుతుంది. సుమారు 500 నుంచి 502 కిలోమీటర్లు రేంజ్ అందిస్తుంది. కూపే SUV డిజైన్, మోడ్రాన్ ఫీచర్లతో స్టైలిష్ లుక్ కోరుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
టాటా సియెర్రా ఈవీ :
63kWh బ్యాటరీతో ఎంట్రీ-లెవల్ సియెర్రా ఈవీ ధర రూ.11.99 లక్షల నుంచి లభిస్తుంది. అయితే, అసలు ధర రూ.18.79 లక్షల నుంచి రూ.6.80 లక్షలు తగ్గింది. బ్యాటరీ రెంట్ కిలోమీటరుకు రూ.5.5 చెల్లించాలి. సుమారుగా 530 నుంచి 535 కిలోమీటర్లు రేంజ్ అందిస్తుంది. ఈ కొత్త SUV వైడ్ స్పేస్, ఫీచర్లు, మెరుగైన ఫాస్ట్ ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
టాటా హారియర్ ఈవీ
65kWh బ్యాటరీతో హారియర్ ఈవీ బేస్ మోడల్ ఇప్పుడు రూ.14.49 లక్షలకు అందుబాటులో ఉంది. గతంలో ఈ కారు ధర రూ.21.79 లక్షలు కాగా గరిష్టంగా రూ.7.30 లక్షల ఆదా అవుతుంది. ఈ బ్యాటరీ కిలోమీటరుకు రూ.5.9 ఛార్జ్ అవుతుంది. సుమారుగా 530 నుంచి 538 కిలోమీటర్లు రేంజ్ అందిస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUVగా, వైడ్ స్పేస్, పవర్, లగ్జరీ ఫీచర్లతో బిగ్ ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
