Tata EV Car Discounts : కొత్త ఎలక్ట్రిక్ కారు కావాలా? ఈ జూలైలో టాటా EV కార్లపై భారీ క్యాష్ డిస్కౌంట్లు.. రూ. 3.35 లక్షల వరకు సేవింగ్స్

Tata Motors Discounts July 2026 : కొత్త టాటా ఈవీ కార్లు కొనేవారికి గుడ్ న్యూస్.. ఈ జూలైలో టాటా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, పంచ్ ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో మోడల్ వారీగా టాటా కార్లు అతి చౌకైన ధరకే లభిస్తున్నాయి.

Tata Motors Discount Offers July 2026

  • జూలై 2026లో టాటా మోటార్స్ ఈవీ కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు
  • టాటా కర్వ్ ఈవీ, పంచ్ ఈవీ కార్లపై రూ. 3.5 లక్షల వరకు ఆదా
  • టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో చూడండి

Tata Motors Discounts July 2026 : టాటా లవర్స్ పండగ చేస్కోండి.. జూలై 2026లో ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోపై టాటా మోటార్స్ ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ (అవుట్‌గోయింగ్), టియాగో ఈవీ (అవుట్‌గోయింగ్) వంటి ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్లపై రూ. 3.35 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.

ఈ ఆఫర్లలో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ అదనపు సపోర్టు ఉంటాయి. కచ్చితమైన (Tata EV Car Discounts) మొత్తం మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. భారత మార్కెట్లో టాటా కారు ఈవీ డిస్కౌంట్లు, ఢిల్లీలో టాటా కారు ఈవీ డిస్కౌంట్ల కోసం చూస్తుంటే డీలర్‌షిప్, సిటీ, అర్హతను బట్టి ఫైనల్ డిస్కౌంట్ ధర మారవచ్చు. మీ నగరంలో టాటా ఈవీ కార్లపై ఎంతవరకు డిస్కౌంట్ ఉందో ఓసారి చెక్ చేసుకోండి.

టాటా కర్వ్ ఈవీ డిస్కౌంట్ ఆఫర్ :
ఈ నెలలో టాటా కర్వ్ ఈవీ కొనుగోలుదారులు భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ నుంచి అత్యధిక బెనిఫిట్స్ పొందవచ్చు. ఎక్స్ వేరియంట్ మినహా మొత్తం రూ. 3.35 లక్షల విలువైన బెనిఫిట్స్ పొందవచ్చు. టాటా క్రియేటివ్ వేరియంట్ రూ. 2.85 లక్షల వరకు ఆఫర్ అందిస్తుండగా, ఎక్స్ వేరియంట్ రూ. 65వేల విలువైన బెనిఫిట్స్ అందిస్తుంది.

టాటా హారియర్ ఈవీ డిస్కౌంట్ ఆఫర్ :
టాటా హారియర్ ఈవీ డిస్కౌంట్ ఆఫర్ కింద అన్ని వేరియంట్లపై రూ. 2.75 లక్షల వరకు మొత్తం బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్యాకేజీలో ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ అదనపు డీలర్ సపోర్ట్ వంటి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అతిపెద్ద ఆఫర్లలో ఇదొకటి.

టాటా పంచ్ ఈవీ డిస్కౌంట్ ఆఫర్ :
ప్రస్తుత టాటా పంచ్ ఈవీ డిస్కౌంట్ ఆఫర్లు వేరియంట్‌ బట్టి పొందవచ్చు. అన్ని లాంగ్ రేంజ్ వేరియంట్లు రూ. 1.45 లక్షల వరకు, మిడ్ రేంజ్ వేరియంట్లు (స్మార్ట్ మినహా) రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. స్మార్ట్ ప్లస్ వేరియంట్లు రూ. 95వేల వరకు విలువైన ఆఫర్లతో లభిస్తున్నాయి.

Read Also : Amazon Prime Day Sale : ఏంది భయ్యా డిస్కౌంట్లు.. అమెజాన్‌లో అతి చౌకైన ధరకే ఐఫోన్ 17 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S26 ఫోన్లు..!

టాటా నెక్సాన్ ఈవీ డిస్కౌంట్ ఆఫర్ :
ఈ ఆఫర్ టాటా నెక్సాన్ ఈవీ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 50వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. కర్వ్ ఈవీ, హారియర్ ఈవీలపై ఆఫర్ల కన్నా తక్కువే అయినా టాటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యూజర్లకు అద్భుతంగా ఉంటుంది.

టాటా టియాగో ఈవీ డిస్కౌంట్ ఆఫర్ :
ప్రస్తుత టియాగో ఈవీ రేంజ్ కూడా ఈ నెలలో భారీ ఆఫర్లతో లభిస్తోంది. ఎల్ఆర్ ఎక్స్‌టీ వేరియంట్‌పై రూ. 1.45 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఎల్ఆర్ ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్లు రూ. 1.25 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తున్నాయి. మరోవైపు, ఎంఆర్ వేరియంట్లపై రూ. 65వేల వరకు డిస్కౌంట్లు పొందవచ్చు.

ఈవీలు కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్? :
ఢిల్లీ ఈవీ పాలసీ అమల్లోకి రావడంతో మోడల్ వారీగా టాటా ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లను కొనేందుకు ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. జూలై 2026 నాటికి టాటా మోటార్స్ డిస్కౌంట్ ఆఫర్లు రూ. 3.35 లక్షల వరకు లభించనున్నాయి. టాటా కర్వ్ ఈవీ, ప్రీమియం ఈవీ సెగ్మెంట్లలో టాటా హారియర్ ఈవీ డిస్కౌంట్ ఆఫర్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.

అదే సమయంలో 2026 టాటా పంచ్ ఈవీ ఆఫర్లు, టియాగో ఈవీపై ప్రోత్సాహకాలు, టాటా ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ మోడళ్లతో మరింత ఆకర్షణీయంగా లభించనున్నాయి. ఫైనల్ ఆఫర్ అనేది మీ ప్రాంతం, డీలర్‌షిప్ స్టాక్, అర్హతను బట్టి మారుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు మీ సమీపంలోని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి.