Tata Nano Electric
Tata Nano Electric : కొత్త కారు కోసం చూస్తున్నారా? మిడిల్ క్లాసు డ్రీమ్ కారు టాటా నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది. దేశవ్యాప్తంగా టాటా నానో కారుకు ఫుల్ క్రేజ్ ఉండేది.
ధనిక, మధ్యతరగతి వారు ఎంతో ఇష్టపడతారు. గతంలో కంపెనీ నానో కారు ఉత్పత్తిని నిలిపివేసింది. మరోసారి టాటా నానోను ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతార్‌లో తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎలక్ట్రిక్ అవతార్‌లో ఈ నానో కారు రేంజ్ కూడా మరింత ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. కారు ధర కూడా సామాన్యుల బడ్జెట్‌లో ఉండొచ్చు.
ఎలక్ట్రిక్ నానో లాంచ్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేనప్పటికీ, పలు నివేదికలతో పాటు టాటా నానో ఎలక్ట్రిక్ కారు రాకపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి..
టాటా నానో ఎలక్ట్రిక్ ఫీచర్లు (అంచనా) :
టాటా నానో ఎలక్ట్రిక్ కారులో అనేక అడ్వాన్స్ ఫీచర్లు చేర్చవచ్చు. మోడ్రాన్ ఫీచర్ల కారణంగా ఈ మోడల్‌ను చాలా మంది వినియోగదారులు ఇష్టపడతారు. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఇందులో చేర్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్టు అందిస్తుంది.
కారులో 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంది. బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీతో వస్తుంది. వాహనంలో సేఫ్టీ ఫీచర్లను యాడ్ చేయొచ్చు.
ABS, స్టీరింగ్, పవర్ విండోస్, యాంటీ-రోల్ బార్ వంటివి ఉన్నాయి. రిమోట్ యాక్టివిటీ, డెమో మోడ్ కూడా చేర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మల్టీ-డేటా డిస్‌ప్లేను అందించే అవకాశం కూడా ఉంది.
రేంజ్, ధర ఎంత ఉండొచ్చు :
టాటా నానో ఎలక్ట్రిక్ కారు రేంజ్ కూడా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు. పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదని భావిస్తున్నారు. ఈ మోడల్ ధర విషయానికి వస్తే.. ఈ కారు ధర రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
Note : టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ నానో లాంచ్ గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. టాటా కంపెనీ ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పుకార్ల ఆధారంగా మాత్రమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.