×
Ad

Tata Punch EV Facelift : టాటా లవర్స్ గెట్ రెడీ.. కొత్త టాటా పంచ్ EV వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 593 కి.మీ రేంజ్, ఫుల్ డిటెయిల్స్

Tata Punch EV Facelift : ఫిబ్రవరి 20, 2026న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చేస్తోంది. సింగిల్ ఛార్జ్‌పై 593.6 కి.మీ దూసుకెళ్లగలదు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

  • Published On : February 15, 2026 / 04:17 PM IST

Tata Punch EV Facelift

  • ఫిబ్రవరి 20, 2026న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్
  • టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ ప్రాసెస్ సక్సెస్
  • టాటా అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో వీడియో
  • ఈవీ సింగిల్ ఛార్జ్‌పై 593.6 కిలోమీటర్లు రేంజ్

Tata Punch EV Facelift : మీరు టాటా పంచ్ EV కొనాలని ప్లాన్ చేస్తున్నారా? టాటా లవర్స్ కోసం సరికొత్త కారు వచ్చేస్తోంది. ప్రముఖ భారతీయ కార్ల తయారీదారు టాటా మోటార్స్ అద్భుతమైన కారును తీసుకొస్తోంది. టాటా ఇప్పటికే వివిధ కేటగిరీలో అనేక మోడల్ కార్లను భారత మార్కెట్లోకి దించింది.

అలాగే టాటా ఈవీ సెగ్మంట్‌లో కూడా అనేక కార్లను లాంచ్ చేస్తోంది. టాటా ఇప్పుడు కొత్త ఈవీ కారును లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విషయానికి వస్తే భారత మార్కెట్లో ఫిబ్రవరి 20న లాంచ్ కానుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లుక్ :
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ అనేక కీలక మార్పులతో లాంచ్ కానుంది. కంపెనీ డిజైన్‌లో కూడా భారీగా మార్పులు చేయవచ్చు. ఈవీ ఫ్రంట్ సైడ్ క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, కనెక్టింగ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కొత్త అల్లాయ్ వీల్స్‌తో సహా స్వల్పంగా రీడిజైన్ చేయొచ్చు. ఫ్రంట్, బ్యాక్ సైడ్ బంపర్‌లు కూడా రీడిజైన్ చేసి ఉంటాయి. ఈ ఈవీకి మోడ్రాన్, ప్రీమియం డిజైన్ ఉంటుందని అంచనా.

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ ప్రాసెస్ కు సంబంధించి టాటా అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో వీడియోను షేర్ చేసింది. దీని ప్రకారం.. ఈ టాటా పంచ్ ఈవీ సింగిల్ ఛార్జ్‌పై 593.6 కిలోమీటర్ల వరకు విస్తరించనుంది.

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రేంజ్ ఎంతంటే? :
ఈ వీడియోలో ఆటోమోటివ్ జర్నలిస్ట్ పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను జైపూర్ నుంచి ఉదయపూర్ వరకు దాదాపు 400 కిలోమీటర్ల దూరం నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ జర్నీ ఫుల్ ఛార్జ్ చేశాకే మొదలైంది. బిజైన్‌నగర్ వద్ద మధ్యలో దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కూడా కారు ఇప్పటికీ 67 శాతం బ్యాటరీ మిగిలే ఉందని అన్నారు.

Read Also : Samsung Galaxy S26 : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ వచ్చేస్తోంది.. ఈసారి 3 ఫోన్లు.. లాంచ్ డేట్, ధరపై భారీ అంచనాలు!

ఉదయపూర్ చేరుకున్నాక ఓడోమీటర్ దాదాపు 400 కిలోమీటర్లు చూపిస్తుంది, 34 శాతం బ్యాటరీ మిగిలే ఉంది. పంచ్ ఈవీ చివరకు గుజరాత్‌లోని హిమత్‌నగర్ వద్ద ఛార్జ్ అయిపోయింది. మొత్తం దూరం 593.6 కిలోమీటర్లు, సింగిల్ ఛార్జ్‌తో దూసుకుపోయింది.

టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు :

కొత్త టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ గతంలో మాదిరిగానే ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది. కంపెనీ ఈసారి మోడల్‌తో మరిన్ని ఫీచర్లను అందించాలని భావిస్తోంది. కొత్త UIతో భారీ 12.3-అంగుళాల, ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉండవచ్చు.

Tata Punch EV Facelift

గ్రాఫిక్స్‌తో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్, సబ్‌ వూఫర్‌తో ప్రీమియం హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ కూడా ఉండవచ్చు. సేఫ్టీ ఫీచర్ల పరంగా కొత్త ఈవీ లెవల్-2 అడాస్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాతో వస్తుంది.

వాయిస్-ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, కనెక్ట్ కార్ టెక్, ఆర్కేడ్.ఈవీ సూట్ వంటి ప్రస్తుత ఫీచర్లు అలాగే ఉంటాయి. ఈ కేటగిరీలో అత్యంత ఫీచర్-రిచ్ ఈవీలలో ఇదొకటి.

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ బ్యాటరీ :
ప్రస్తుత టాటా పంచ్ ఈవీ 25kWh, 35kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. రాబోయే కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 35kWh బ్యాటరీని 40.5kWhకి అప్‌గ్రేడ్ చేయవచ్చు. అయితే, పూర్తి వివరాలు లాంచ్ తర్వాత మాత్రమే వెల్లడి కానున్నాయి.

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధర ( అంచనా) :
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధర లాంచ్ తర్వాత వెల్లడి కానుంది. ప్రస్తుతానికి టాటా పంచ్ ఈవీ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల మధ్య ఉంటుందని అంచనా. నివేదికల ప్రకారం.. టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధర మార్కెట్లో కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.