Tata Tiago Facelift : కొత్త లుక్‌తో వస్తోన్న టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్.. డిజైన్ అదుర్స్, మే 28న మార్కెట్‌లోకి..!

Tata Tiago Facelift : టాటా మోటార్స్ త్వరలో భారత మార్కెట్లో కొత్త కారును లాంచ్ చేయబోతోంది. ఈ కొత్త అప్‌డేటెడ్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ను మే 28, 2026న భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. పూర్తి వివరాలివే..

Tata Tiago Facelift ( Image Credit : AI )

  • టాటా మోటార్స్ నుంచి కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్
  • ఈ నెల 28న భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం
  • ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ వంటి ఫీచర్లపై భారీ అంచనాలు

Tata Tiago Facelift : టాటా లవర్స్ కోసం అద్భుతమైన కారు రాబోతుంది. దేశీయ ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటార్స్ అతి త్వరలో భారత మార్కెట్లో టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కొత్త కారును లాంచ్ చేయనుంది.

నివేదికల ప్రకారం.. ఈ కంపెనీ కొత్తగా అప్‌డేట్ చేసిన హ్యాచ్‌బ్యాక్, టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ను మే 28, 2026న ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి వాగన్ఆర్‌తో గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ఫీచర్ల పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫేస్‌లిఫ్ట్ డిజైన్, ఫీచర్లు :
కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ డిజైన్ విషయానికి వస్తే.. కంపెనీ కారు ఎక్స్ ట్రనల్ డిజైన్ మరింత మోడ్రాన్ ఫీచర్లతో అందించనుంది. కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ హెడ్‌ల్యాంప్‌లు, అప్‌డేటెడ్ టెయిల్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ బ్యాక్ బంపర్‌లు ఉండవచ్చు. అంతేకాదు.. కారు మరింత ప్రీమియంగా స్పోర్టీగా కనిపించవచ్చు.

Read Also : Xiaomi 17 Max : 200MP ట్రిపుల్ కెమెరా, భారీ 8000mAh బ్యాటరీతో షావోమీ 17 మ్యాక్స్.. ధర జస్ట్ ఎంతంటే?

కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ఫీచర్ల విషయానికి వస్తే.. అనేక ముఖ్యమైన ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. అందులో కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, అప్‌డేటెడ్ సెంటర్ కన్సోల్, కొత్త అప్‌హోల్స్టరీ, మెరుగైన క్యాబిన్ ఫినిష్ ఉండవచ్చు. ప్రస్తుత టాటా టియాగోతో పోలిస్తే.. ఈ టియాగోలో కింది విధంగా అనేక మోడ్రాన్ ఫీచర్లు ఉన్నాయి.

  • ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు
  • ఎల్ఈడీ డీఆర్ఎల్స్
  • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • 15-అంగుళాల అల్లాయ్ వీల్స్
  • పవర్ అడ్జెస్ట్ ORVM
  • 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే
  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
  • కూలింగ్ గ్లోవ్ బాక్స్

ఈ ఫీచర్లతో పాటు మరికొన్ని ఫీచర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయని అంచనా. అంతేకాదు.. కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్‌లో ఈ కింది ఫీచర్లు ఉంటాయి.

  • EBDతో ABS సిస్టమ్
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)
  • హిల్ హోల్డ్ కంట్రోల్
  • TPMS
  • రియర్ డిఫాగర్
  • రివర్స్ కెమెరా

టియాగో ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ :
కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌లో గత మోడల్ మాదిరిగానే అదే ఇంజన్ ఆప్షన్లు ఉంటాయని భావిస్తున్నారు. ఎలాంటి మార్పులు ఉండవని అంచనా. 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్, CNG ఆప్షన్ ఉన్నాయి. ఈ రెండు ఆప్షన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ AMTతో వస్తాయి.