Jio Subscribers : తెలుగు రాష్ట్రాల్లో జియో జోరు.. కొత్తగా 1.56 లక్షలకు పైగా యూజర్లు..!

Reliance Jio Subscribers : టెలికాం సబ్‌స్ర్కైబర్ల గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియోలో 2024ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కలిపి మొత్తంగా 1.56 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు కొత్తగా చేరారు.

Jio Subscribers : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో (Reliance Jio) తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో యూజర్లతో దూసుకుపోతోంది. జియో రోజురోజుకీ సరికొత్త యూజర్లతో టెలికం సర్వీసుల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. మొబైల్ యూజర్లను ఆకట్టకునేందుకు జియో ఎప్పటికప్పుడూ అద్భుతమైన ఆఫర్లు, డేటా ప్లాన్లను ప్రవేశపెడుతోంది.

Read Also : Jio Prepaid Plan Offers : జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్లు.. అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్లు మీకోసం.. ఏ ప్లాన్ బెటర్ అంటే?

ఇతర టెలికం నెట్‌వర్క్ సర్వీసులతో పోలిస్తే జియో అత్యధిక కస్టమర్లతో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ఇటీవల ట్రాయ్ విడుదల చేసిన టెలికాం సబ్‌స్ర్కైబర్ల గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియోలో 2024ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కలిపి మొత్తంగా 1.56 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు కొత్తగా చేరారు.

భారీగా కస్టమర్లను కోల్పోయిన ఇతర టెలికం దిగ్గజాలు :
ట్రాయ్ (TARI) గణాంకాల ప్రకారం.. గత ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా 1,56,296 మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లను చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య ఏప్రిల్ నెలాఖరకు 3.29 కోట్లకు చేరుకుంది. ఈ ఏప్రిల్‌లోనే మరో టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌లో 55 వేల మంది కొత్త మొబైల్ సబ్‌స్ర్కైబర్లు వచ్చి చేరారు. మరోవైపు.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL)లో 2.57 లక్షల మంది కస్టమర్లను భారీగా కోల్పోయింది. అతిపెద్ద టెలికం నెట్‌వర్క్ అయిన వోడాఫోన్ ఐడియా కూడా 23,456 మంది కస్టమర్లను భారీగా కోల్పోయింది.

గత ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. జియోలో 26.8 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు చేరారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మొత్తంగా జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరింది. ఇందులో కొత్తగా 7.52 లక్షల కస్టమర్లు చేరగా, 26.75 కోట్ల మొత్తం యూజర్లతో ఎయిర్‌టెల్ తర్వాత స్థానంలో నిలిచింది. మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య ఏప్రిల్ నాటికి 120 కోట్లను దాటేసింది.

Read Also : Jio Data Booster Plans : మీ రోజువారీ ఇంటర్నెట్ డేటా లిమిట్ దాటిందా? జియో మొబైల్ డేటా బూస్టర్ ప్లాన్లు ఇదిగో.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు