Term Insurance : టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు.. లేదంటే భారీగా నష్టపోతారు..
Term Insurance : మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం టర్మ్ ప్లాన్ తీసుకుంటున్నారా? అయితే, సరైన పాలసీని ఎలా ఎంచుకోవాలి? ఎంత కవరేజీని అందించాలి? క్లెయిమ్ ఎలా చెల్లించాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- May 16, 2026 / 04:05 PM IST
Term Insurance ( Image Credit : Gemini AI )
- టర్మ్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా?
- టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు
- ఈ 3 విషయాలు తెలియకపోతే భారీగా నష్టపోతారు
Term Insurance Planning : మీకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదా? ఒకవేళ తీసుకుంటే ఈ విషయం అసలు మర్చిపోద్దు. సాధారణంగా టర్మ్ పాలసీదారు మరణానంతరం వారి కుటుంబానికి ఆర్థిక భరోసాను అందిస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే.. మీరు మరణిస్తే.. బీమా కంపెనీ మీ కుటుంబానికి పాలసీ ఆధారంగా (Term Insurance) డబ్బులను ఇస్తుంది. నిపుణుడు వరుణ్ అగర్వాల్ ప్రకారం.. పాలసీని తీసుకునేటప్పుడు కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో తప్పకుండా చెక్ చేయాలి. ఆ కంపెనీ గతంలో ఎంత మందికి చెల్లింపులు చేసిందో సూచిస్తుంది.
ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉండాలి? ఎప్పుడు తీసుకోవాలి? :
హామీ మొత్తం మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 15 రెట్లు ఉండాలి. ఉదాహరణకు.. మీరు సంవత్సరానికి రూ. 5లక్షలు సంపాదిస్తే కనీస హామీ మొత్తం రూ. 5 లక్షల నుంచి రూ. 750,000 వరకు ఉంటుంది.
అన్నింటికన్నా ముఖ్యంగా 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు మధ్య పాలసీని తీసుకోండి. మీ వయస్సు ఎంత తక్కువగా ఉంటే ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. మీ జీవితాంతం అది అలాగే ఉంటుంది. ఆఫ్‌లైన్ పాలసీలతో పోలిస్తే ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేయడం 7 నుంచి 11శాతం చౌకగా ఉంటుంది.
ఈ స్పెషల్ ఫీచర్లు తప్పక తెలుసుకోండి :
ప్రాథమిక జీవిత బీమా ఒక్కటే సరిపోదు. మీ పాలసీలో ఈ 3 విషయాలను తప్పకుండా ఉండాలి.
తీవ్ర అనారోగ్య కవరేజ్ : క్యాన్సర్ లేదా గుండెపోటు వంటి అనారోగ్యాల చికిత్స కోసం డబ్బు పొందవచ్చు.
ప్రమాద కవరేజ్ : ప్రమాదం కారణంగా మరణం సంభవిస్తే ఆ ఫ్యామిలీకి అదనపు డబ్బు లభిస్తుంది.
ప్రీమియం మాఫీ : అనారోగ్యం లేదా శారీరక సమస్య కారణంగా మీరు చెల్లించలేకపోతే తదుపరి ప్రీమియంలు మాఫీ అవుతాయి. బీమా కొనసాగుతుంది.
క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది? టాక్స్ బెనిఫిట్స్ ఏంటి? :
చాలామంది పాలసీ తీసుకునే సమయంలో తమ అనారోగ్య సమస్యలను దాచిపెడతారు. దాంతో ఇన్సూరెన్స్ కంపెనీలు తర్వాత క్లెయిమ్‌లను రిజెక్ట్ చేయొచ్చు. మీ ఫ్యామిలీ రీయింబర్స్ మెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండాలంటే మీ సమాచారాన్ని నిజాయితీగా ఇవ్వండి. మీరు చెల్లించే ప్రీమియంలపై ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇన్సూరెన్స్ అందించే క్లెయిమ్ డబ్బుపై కూడా ఎలాంటి టాక్స్ ఉండదు.
