Tim Cook : ఆపిల్‌కు కొత్త సీఈఓ ఇతడే.. 15 ఏళ్ల తర్వాత టిమ్ కుక్ రాజీనామా.. జాన్ టెర్నస్ ఎవరంటే?
Tim Cook : ప్రస్తుత ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ త్వరలో సీఈఓ పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన సెప్టెంబర్‌లో రాజీనామా తర్వాత జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
- Sreehari A
- Updated on- April 21, 2026 / 04:54 PM IST
Tim Cook
- ఆపిల్ కొత్త సీఈఓగా ఎవరు వస్తున్నారంటే?
- 15 ఏళ్ల తర్వాత సీఈఓ పదవికి టిమ్ కుక్ రాజీనామా
- కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న జాన్ టెర్నస్
Tim Cook : టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్‌కు కొత్త సీఈఓ రాబోతున్నారు. ఆపిల్ ప్రస్తుత సీఈఓ టిమ్ కుక్ 15ఏళ్ల తర్వాత తన పదవికి రాజీనామా చేయనున్నారు. చాలా కాలంగా కంపెనీ సీఈఓగా ఉన్న టిమ్ కుక్.. తన పదవి నుంచి వైదొలిగి ఆపిల్‌లో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పాత్రను చేపట్టనున్నారు. రాబోయే సెప్టెంబర్ నెలలో టిమ్ కుక్ సీఈఓ (Tim Cook) పదవికి రాజీనామా చేయనుండగా, ఆ తర్వాత జాన్ టెర్నస్ ఆపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు.
జాన్ టర్నర్ ఎవరంటే? :
టిమ్ కుక్ సెప్టెంబర్ 1, 2026న ఆపిల్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతారు. సెప్టెంబర్ 1 నుంచి జాన్ టర్నస్ ఆపిల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. కుక్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అవుతారు. జాన్ టర్నస్ 20 ఏళ్లకు పైగా ఆపిల్‌తో ఉన్నారు. కంపెనీ అనేక ప్రధాన ప్రొడక్టుల్లో కీలక పాత్ర పోషించారు.
సుమారు 50 ఏళ్ల వయస్సు ఉన్న జాన్ టర్నస్ 2001లో ఆపిల్‌లో చేరారు. ఆయన ప్రొడక్ట్ డిజైన్ బృందంలో ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2013లో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఆపై 2021లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు.
ప్రస్తుతం ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్‌తో సహా అన్ని ప్రధాన హార్డ్‌వేర్ ప్రొడక్టులను టర్నస్ పర్యవేక్షిస్తున్నారు. ఆపిల్ ప్రధాన ప్రొడక్టుల్లో జాన్ టర్నస్ కీలక పాత్ర పోషించారు. ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తుల్లో కీలకంగా వ్యవహరించారు.
అలాగే, ఐఫోన్ 17 సిరీస్, కొత్త మ్యాక్ డివైజ్‌లపై కూడా పనిచేశారు. ఆపిల్ మ్యాక్ కంప్యూటర్లను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆపిల్‌లో జాయిన్ అవ్వడానికి ముందు వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్‌లో పనిచేశాడు.
