PM Kisan 23rd Installment : రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 23వ వాయిదా వచ్చేస్తోంది.. రూ.2వేలు పడే తేదీ ఇదే..!
PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ యోజన కింద 22 విడతలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు రైతులు పీఎం కిసాన్ యోజన 23వ విడత కోసం చూస్తున్నారు. 23వ విడత ఎప్పుడు వస్తుంది? రైతులు ఈ పథకానికి ఎలా అప్లయ్ చేసుకోవాలో చూద్దాం..
PM Kisan 23rd Installment
- పీఎం కిసాన్ 23వ వాయిదాపై కీలక అప్ డేట్
- రూ. 2వేలు పడాలంటే రైతులు ఈ పనులు పూర్తి చేయాలి
- రాబోయే విడత వచ్చే జూలైలో విడుదల అయ్యే అవకాశం
PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 23వ వాయిదాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రూ. 2వేలు పొందాలంటే లబ్ధిదారు రైతులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసి ఉండాలి. లేదంటే పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో పడవు.
వాస్తవానికి, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను (PM Kisan 23rd Installment) అమలు చేస్తోంది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం బాగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటివరకు, ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 22 విడతలను విడుదల చేసింది. ఇప్పుడు, రైతులు పీఎం కిసాన్ పథకం 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే విడత జూలైలో విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
23వ వాయిదా ఎప్పుడు వస్తుంది? :
పీఎం కిసాన్ యోజన తర్వాత విడత అంటే.. 23వ విడత 2026 జూలైలో రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. సాధారణంగా, ఈ పథకం కింద ఫండ్స్ ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల్లో పంపిణీ చేస్తారు.
పీఎం కిసాన్ యోజన ఏంటి? :
పీఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం 3 విడతలలో నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది. 2026 మార్చి 13న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని గౌహతి నుంచి 22వ విడతను విడుదల చేశారు.
తద్వారా సుమారు 93.2 మిలియన్ల (9.32 లక్షల) మంది రైతుల ఖాతాలకు రూ.18,640 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు రైతులకు మొత్తం రూ.4.25 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేశారు.
ఏ రైతులకు ప్రయోజనమంటే? :
ఈ పథకం భారత పౌరులై, సాగుభూమిని కలిగిన రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, చిన్న సన్నకారు రైతులు మాత్రమే అర్హులు. ఆదాయపు పన్ను చెల్లించేవారు లేదా రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నవారు అర్హులు కాదు.
ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
మీరు ఈ పథకం కోసం ఇంకా అప్లయ్ చేసుకోకపోతే (pmkisan.gov.in)ను విజిట్ చేయడం ద్వారా కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్ (New Farmer Registration) ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఇ-కేవైసీ తప్పనిసరి :
రైతులు ఇ-కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. ఇ-కేవైసీ లేకుండా వాయిదాల నిలిచిపోవచ్చు. రైతులు ఓటీపీని ఉపయోగించి ఆన్లైన్లో ఇ-కెవైసిని పూర్తి చేయవచ్చు లేదా బయోమెట్రిక్ ధృవీకరణ కోసం తమ సమీపంలోని సిఎస్సి కేంద్రాన్ని సందర్శించవచ్చు.
స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
రైతులు తమ వాయిదాల స్టేటస్ ఆన్లైన్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం, అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ (pmkisan.gov.in)ను విజిట్ చేసి (Know Your Status) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
