Gold Rate : గోల్డ్ రేటు ఢమాల్.. ఈ నెలాఖరుకు భారీగా తగ్గనున్న ధరలు.. నేడు ఏపీ, తెలంగాణలో 10గ్రాముల బంగారం ధర ఎంతంటే.?
బంగారం ధరలు (Gold Rate) తగ్గుముఖం పట్టాయి. గత పది రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది. 10గ్రాముల బంగారంపై సుమారు..
- Harishth Thanniru
- Published On : August 18, 2025 / 11:08 AM IST
gold rate
Gold Rate: బంగారం ధర (Gold Rate) లు తగ్గుముఖం పట్టాయి. గత పది రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది. 10గ్రాముల బంగారంపై సుమారు రూ. 3వేలు వరకు తగ్గింది.
అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో బంగారం ధర క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర (Gold Rate) ల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు భారీగానే పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 22 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,355 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, ఇవాళ వెండి ధర భారీ పెరిగింది. కిలో వెండిపై రూ.800 పెరిగింది.
ఇవాళ ప్రారంభంలో బంగారం, వెండి ధరలు కాస్త పెరిగాయి. కానీ, అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంకు డిమాండ్ తగ్గింది. దీంతో రెండు వారాల కనిష్ఠ స్థాయికి దగ్గరగా గోల్డ్ రేట్లు ఉన్నాయని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వీపీ రాహుల్ కలాంత్రి అన్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే ఈనెలాఖరు వరకు గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.92,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,01,180 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,330 వద్ద కొనసాగుతుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.92,750 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,01,180కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ కిలో వెండిపై రూ.800 పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,27,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,17,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,27,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
Also Read: Gold Reserves: మరోసారి జాక్‌పాట్.. భారత్‌లో 20 టన్నుల బంగారు గనుల గుర్తింపు
