×
Ad

Toll Plazas Rules : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. టోల్ ప్లాజాలలో ఇకపై నో క్యాష్ పేమెంట్స్.. ఈ 3 విషయాల్లో బిగ్ రిలీఫ్..!

Toll Plazas Rules : ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాలు క్యాష్‌లెస్‌గా మారనున్నాయి. ఫాస్ట్‌ట్యాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

Toll Plazas Rules (Image Credit To Original Source)

  • ఏప్రిల్ 1 నుంచి అన్ని టోల్ ప్లాజాలలో క్యాష్ లెస్ పేమెంట్ తప్పనిసరి
  • టోల్ టాక్స్ కోసం FASTag లేదా UPI ద్వారా పేమెంట్ చేయండి.
  • ట్రాఫిక్ జామ్‌ ఉండదు, ఇంధన ఆదాతో పాటు ప్రయాణం వేగవంతం

Toll Plazas Rules : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి హైవేలపై టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఇకపై మీరు హైవేలపై ప్రయాణిస్తే.. టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించే పద్ధతి పూర్తిగా మారిపోనుంది. లాంగ్ క్యూలు, క్యాష్ పేమెంట్ ఇష్యూ, టోల్ బూత్‌ల వద్ద వాహనం ఆపాల్సిన అవసరం ఇకపై ఉండనే ఉండవు. ఏప్రిల్ 1 నుంచి దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు క్యాష్ లెస్‌గా మారనున్నాయి.

టోల్ టాక్స్ అనేది ఫాస్ట్ ట్యాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి. ఉమాశంకర్ ప్రకారం.. టోల్ ప్లాజాలలో క్యాష్ పేమెంట్లను దశలవారీగా పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొన్నారు. టోల్ రద్దీని నివారించడమే దీని లక్ష్యంగా తెలిపారు.

25 టోల్ ప్లాజాలలో ట్రయల్ :

కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానం అమలుపై ట్రయల్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 25 టోల్ ప్లాజాలలో ‘నో-స్టాప్’ క్యాష్ లెస్ సిస్టమ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అధికారిక నోటిఫికేషన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఈ రూల్ ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందనే సంకేతాలు ఉన్నాయి.

ట్రాఫిక్ జామ్, సమయం వృధా కాదు:
ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అయినప్పటికీ, అనేక టోల్ ప్లాజాలు ఇప్పటికీ క్యాష్ పేమెంట్లను అనుమతిస్తున్నాయి. డిజిటల్ పేమెంట్ మెథడ్స్ లేని వాహనాల కారణంగా క్యూలు, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతాయి. క్యాష్ నివారించడం ద్వారా వాహనాలు టోల్ బూత్‌ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. తద్వారా ప్రయాణంలో ఆలస్యం ఉండదు.

Toll Plazas Rules (Image Credit To Original Source)

ఈ 3 విషయాల్లో వాహనదారులకు రిలీఫ్ :
ఈ కొత్త మార్పు ద్వారా కేంద్రం డిజిటల్ పేమెంట్లను మాత్రమే కాకుండా ఈ మూడు అంశాలపై ఫోకస్ పెట్టింది..
ఫ్యూయిల్ సేవింగ్ : టోల్ ప్లాజాల వద్ద ఆగి వెళ్లడం వల్ల పెట్రోల్, డీజిల్ వృధా అవుతుంది. క్యాష్ లెస్ సిస్టమ్ ద్వారా ఈ సమస్య తగ్గుతుంది.
పారదర్శకత : ప్రతి లావాదేవీ డిజిటల్‌గా ఉంటుంది. టోల్ వసూలులో అవకతవకలు లేదా మోసాలకు అవకాశం ఉండదు.
వేగవంతమైన ప్రయాణం : నగదు, రసీదుల అవసరం ఉండదు. టైమ్ సేవ్ అవుతుంది.

Read Also : Realme 16 5G : 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో రియల్‌మి 16 5G వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

భవిష్యత్తులో నో టోల్ బూత్ :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) సిస్టమ్ ద్వారా క్యాష్ పేమెంట్స్ పూర్తిగా ఎత్తేయనుంది. భవిష్యత్తులో, హైవేలలో ఫిజికల్ టోల్ బూత్‌లు ఉండవు. కెమెరాలు, సెన్సార్లు వాహనాలను గుర్తిస్తాయి. టోల్ ఆపకుండా ఆటో డెబ్ట్ అయ్యేలా ఉంటుంది.

డ్రైవర్లకు సూచనలివే :
ఏప్రిల్ 1కి ముందు మీ FASTag బ్యాలెన్స్‌ను చెక్ చేయండి. మీ అకౌంంట్ యాక్టివ్‌గా ఉంచుకోండి. మీకు FASTag లేకపోతే.. మీ మొబైల్‌లో యూపీఐ పేమెంట్లు ఎనేబుల్ చేసుకోండి. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాక డిజిటల్ పేమెంట్ మెథడ్ లేకుండా టోల్ ప్లాజాకు వద్దకు వెళ్తే పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు.