Most Powerful Scooters
Most Powerful Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారతీయ మార్కెట్లో బైకులకు మించిన అద్భుతమైన ఫీచర్లతో స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, బైకులు, స్కూటర్ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా పవర్ ఫీచర్.. సాధారణంగా స్కూటర్లు బైక్‌ల కన్నా తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి కొన్ని స్కూటర్లు మార్కెట్లో కూడా అమ్ముడవుతాయి. పవర్ పరంగా బెస్ట్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేయొచ్చు.
ఇందులో బీఎండబ్ల్యూ, కీవే వంటి కంపెనీల నుంచి యమహా హీరో మోటోకార్ప్ వరకు స్కూటర్లు ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ సింపుల్ ఎనర్జీ వంటి కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అత్యంత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో టాప్ 10 అత్యంత పవర్‌ఫుల్ స్కూటర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. BMW CE 04 పవర్‌ఫుల్ స్కూటర్ :
బీఎండబ్ల్యూ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ CE-04 ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన స్కూటర్. రూ. 15.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన ఈ స్కూటర్ 41.5bhp, 62Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
2.BMW C 400 GT లగ్జరీ స్కూటర్ :
బీఎండబ్ల్యూ సీ400 జీటీ అనేది 350cc, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అయ్యే ప్రీమియం మ్యాక్సీ-స్కూటర్. 33.5bhp, 35Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.83 లక్షలు.
3. కీవే సిక్స్టీస్ 300i రెట్రో లుక్ :
కీవే సిక్స్టీస్ 300i అనేది 278.2cc ఇంజిన్‌తో రన్ అయ్యే రెట్రో-లుకింగ్ స్కూటర్. 18.7bhp, 23.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.13 లక్షలు.
4. కీవే వీస్టే 300 అర్బన్ మ్యాక్సీ స్కూటర్ :
కీవే వీస్టే 300 అనేది షార్ప్‌గా రూపొందించిన మ్యాక్సీ స్కూటర్. 18.7bhp, 23.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 278.2cc ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. ఈ కీవే స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.02 లక్షలు.
5. ఓలా S1 ప్రో+ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ :
ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో ప్లస్ స్కూటర్ మోడల్ భారత మార్కెట్లో బాగా పాపులర్ పొందింది. మూడో జనరేషన్ వెర్షన్ 17.4bhp పవర్ 58Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రూ.1.55 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో అత్యంత వేగవంతమైన హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి.
6. యమహా ఏరోక్స్ 155 స్కూటర్ :
యమహా ఏరోక్స్ పవర్‌ఫుల్ మ్యాక్సీ-స్కూటర్. కంపెనీ పాపులర్ R15 మాదిరిగానే ఇంజిన్ కలిగి ఉంది. 155cc ఇంజిన్ 14.7bhp, 13.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.41 లక్షలు.
7. హీరో జూమ్ 160 పవర్‌ఫుల్ స్కూటర్ :
హీరో జూమ్ 160 అనేది 156cc ఇంజిన్‌తో రన్ అయ్యే అడ్వెంచర్ మ్యాక్సీ-స్కూటర్. 14.6bhp, 14Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ధర రూ. 1.36 లక్షలు (ఎక్స్-షోరూమ్).
8. బీఎండబ్ల్యూ CE 02 :
బీఎండబ్ల్యూ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్, సీఈ 02, యువత పట్టణ రైడర్లను లక్ష్యంగా చేసుకుంది. 14.5bhp, 55Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.49 లక్షలు.
9. సింపుల్ వన్ 1.5 :
సింపుల్ వన్ 1.5 స్కూటర్ కేటగిరీలో అత్యధిక టార్క్ 72Nm కలిగి ఉంది. ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 11.3bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.71 లక్షలు.
10. ఏథర్ 450 అపెక్స్ :
ఈ సిరీస్‌లో ఏథర్ 450 అపెక్స్ అత్యంత వేగవంతమైన మోడల్. ఈ ప్రీమియం వేరియంట్ 9.3bhp, 26Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.85 లక్షలు.