Longest-Range Electric Cars : రేంజ్‌లో రారాజు ఎవరు? ఒక్క ఛార్జ్‌తో 792 కి.మీ.. 2026లో టాప్ 15 లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Longest-Range Electric Cars : 2026లో భారత్‌లో అత్యధిక క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తున్న టాప్ 15 ఎలక్ట్రిక్ కార్ల ఫుల్ లిస్టు ఇదే.. మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ నుంచి మహీంద్రా బీఈ 6, టాటా సియెరా ఈవీ వరకు రేంజ్, టెస్ట్ మోడల్, ప్రారంభ ధర వివరాలివే..
- Sreehari A
- Published on- August 18, 2026 / 10:03 PM IST
Longest Range EVs India 2026
2026లో దూసుకెళ్తున్న టాప్ 15 ఎలక్ట్రిక్ కార్లు
భారత్‌లో టాప్ 15 లాంగ్-రేంజ్ ఈవీ కార్లు
600 కి.మీ రేంజ్ కల కాదు.. బెస్ట్ లాంగ్-రేంజ్ ఈవీలు
Longest-Range Electric Cars : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా మారుతోంది. ఒకప్పుడు రేంజ్ విషయంలో వెనుకబడిన ఈవీలు ఇప్పుడు ఇప్పుడు 600 కి.మీ.కుపైగా క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తున్నాయి.
ప్రీమియం మోడళ్ల నుంచి అందుబాటు ధరలో అనేక భారతీయ ఈవీ కార్ల మోడల్స్ లభిస్తున్నాయి. 2026లో లాంగ్ డ్రైవ్ కోరుకునే కొనుగోలుదారులకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి.. ఇందులో మీ బెస్ట్ అండ్ ఫేవరెట్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కారు ఏంటో ఎంచుకోండి..
1. మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ :
మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ 792 కి.మీ WLTP రేంజ్‌తో ఈ లిస్టులో నంబర్ వన్‌గా నిలిచింది. MMA ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ మోడల్ అడ్వాన్స్ బ్యాటరీ టెక్నాలజీ, ఏరోడైనమిక్ సామర్థ్యంతో ఆకట్టుకుంటుంది. ప్రారంభ ధర రూ. 55 లక్షల నుంచి రూ. 59 లక్షలు ఉంటుంది.
2. మహీంద్రా బీఈ 6 :
మహీంద్రా బీఈ 6 ఏఆర్ఏఐ ప్రకారం 682 కి.మీ. రేంజ్ అందిస్తుంది. INGLO ప్లాట్‌ఫామ్, హై-డెన్సిటీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ADAS ఈ కారు స్పెషాలిటీ.. ధర రూ. 23.50 లక్షలు మాత్రమే
3. టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ :
టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ 681 కి.మీ WLTP రేంజ్‌తో 3వ స్థానంలో ఉంది. భారీ బ్యాటరీ, అడ్వాన్స్ థర్మల్ మేనేజ్‌మెంట్, ఫాస్ట్ ఛార్జింగ్ దీని స్పెషాలిటీ.. ప్రారంభ ధర రూ. 61.99 లక్షలు.
4. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 :
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 ఈ ఎలక్ట్రిక్ కారు 677 కి.మీ WLTP రేంజ్ అందిస్తుంది. లగ్జరీతో పాటు సుదూర ప్రయాణాలకు సరిపోయే ఎలక్ట్రిక్ సామార్థ్యాన్ని అందిస్తుంది. ధర రూ. 1.30 కోట్లు
5. టాటా సియెరా ఈవీ :
టాటా సియెరా ఈవీ 665 కి.మీ MIDC రేంజ్‌తో టాప్-5లో చోటు దక్కించుకుంది. దూర ప్రయాణాలకు బెస్ట్ ఎస్‌యూవీ కాగా ప్రారంభ ధర రూ. 18.79 లక్షలు.
6. కియా ఈవీ6 :
కియా ఈవీ6 ఏఆర్ఏఐ ప్రకారం.. 663 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది. కియా లైనప్‌లో అత్యధిక రేంజ్ మోడళ్లలో ఒకటి. ప్రారంభ ధర రూ. 65.90 లక్షలు.
Read Also : Apple iPhone 17e : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఈ ఐఫోన్ 17e భారీగా తగ్గిందోచ్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
7. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇ :
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇ కారు 656 కి.మీ ఏఆర్ఏఐ రేంజ్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన లాంగ్-రేంజ్ ఈవీ కారు కూడా INGLO ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. ప్రారంభ ధర రూ. 26.50 లక్షలు.
8. బీవైడీ సీల్ :
బీవైడీ సీల్ 650 కి.మీ NEDC రేంజ్‌తో 8వ స్థానంలో ఉంది. భారీ బ్యాటరీ, థర్మల్ మేనేజ్‌మెంట్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి స్పెషాలిటీగా చెప్పొచ్చు. ధర రూ. 43 నుంచి రూ. 56 లక్షల మధ్య ఉంది.
9. బీఎండబ్ల్యూ iX xDrive50 :
బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్50 635 కి.మీ WLTP రేంజ్‌ను అందిస్తుంది. ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో సుదూర ప్రయాణాలకు బెటర్ ఆప్షన్. ప్రారంభ ధర రూ. 1.40 కోట్లు.
10. హ్యుందాయ్ ఐనాక్ 5 :
హ్యుందాయ్ ఐనాక్ 5 ఏఆర్ఏఐ ప్రకారం 631 కి.మీ. రేంజ్ అందిస్తుంది. 600 కి.మీ.కుపైగా రేంజ్ గ్లోబల్ ఈవీలలో ఇదొకటి. ప్రారంభ ధర రూ. 46 లక్షలు ఉంటుంది.
11. టాటా హారియర్ ఈవీ :
టాటా హారియర్ ఈవీ కారు 627 కి.మీ MIDC రేంజ్‌తో టాప్-15లో ఉంది. SUV ప్రాక్టికాలిటీతో పాటు లాంగ్-డ్రైవ్ కెపాసిటీ అందిస్తుంది. ప్రారంభ ధర రూ. 21.50 లక్షలు.
12. కియా కరెన్స్ క్లావీస్ ఈవీ :
కియా కరెన్స్ క్లావీస్ ఈవీ 530 కి.మీ MIDC రేంజ్‌తో ఫ్యామిలీ కస్టమర్లకు అద్భుతమైన ఈవీ కారు. కియా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ లైనప్‌లో కీలక మోడల్. ప్రారంభ ధర రూ. 18.50 లక్షలు
13. కియా సైరోస్ ఈవీ :
కియా సైరోస్ ఈవీ 526 కి.మీ. MIDC రేంజ్ అందిస్తుంది. లెవల్ 2 అడాస్, వి2ఎల్, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్, BaaS వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు. ధర రూ. 13.49 లక్షల నుంచి ఉంటుంది.
14. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ :
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 510 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఏఆర్ఏఐ రేంజ్‌తో లిస్టులో 14వ స్థానంలో ఉంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లాంగ్-రేంజ్ ఆప్షన్ అందిస్తుంది. ప్రారంభ ధర రూ. 18 లక్షలు.
15. ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో :
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో 449 కి.మీ. MIDC రేంజ్‌తో టాప్-15 లిస్టును పూర్తి చేస్తుంది. ఈ లిస్టులో 500 కి.మీ కన్నా తక్కువ క్లెయిమ్డ్ రేంజ్ ఏకైక మోడల్. ప్రారంభ ధర రూ. 17.50 లక్షలు.
రియల్-వరల్డ్‌లో రేంజ్ ఎంత? :
WLTP, ARAI, MIDC, NEDC వంటి టెస్ట్ సైకిళ్ల ఆధారంగా రేంజ్ గణాంకాలు మారుతాయి. రియల్ డ్రైవింగ్‌లో ట్రాఫిక్, స్పీడ్, వాతావరణం, ఏసీ వినియోగం, రోడ్డు పరిస్థితులు, ప్రయాణికుల బరువు వంటి అంశాల కారణంగా సర్టిఫైడ్ రేంజ్ కన్నా సాధారణంగా 15 శాతం నుంచి 30శాతం తక్కువ రేంజ్ రావచ్చు.
ఆటో పండిట్జ్ టేక్ :
2026లో 600 కి.మీకు పైగా క్లెయిమ్డ్ రేంజ్ ఇక లగ్జరీ ఈవీలకు మాత్రమే కాదు. మహీంద్రా, టాటా వంటి భారతీయ బ్రాండ్లు కూడా అందుబాటు ధరల్లో లాంగ్-రేంజ్ ఈవీలను తీసుకువస్తున్నాయి. కియా కూడా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఇకపై ఈవీ పోటీ కేవలం రేంజ్‌పైనే కాకుండా ఛార్జింగ్ స్పీడ్, బ్యాటరీ మన్నిక, సాఫ్ట్‌వేర్, ఓనర్‌షిప్ ఎక్స్ పీరియన్స్ వంటి అంశాలు కూడా చూడాలి..
