×
Ad

Top 3 Electric Scooters : 2025లో ఫ్యామిలీ, యూత్ అందరూ మెచ్చిన టాప్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఛార్జింగ్ టైమ్, సిటీ రైడర్లకు పర్‌ఫెక్ట్..!

Top 3 Electric Scooters 2025 : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. 2025లో అత్యంత పాపులర్ అయిన టాప్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్లను ఓసారి పరిశీలిద్దాం.. ధర, రేంజ్ వివరాలివే..

1/5
Top 3 Electric Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? భారతీయ మార్కెట్లో అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయొచ్చు. 2025లో లాంచ్ అయిన టాప్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఓసారి లుక్కేయండి. ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా పాపులారిటీ పొందాయి. పెట్రోల్ ధరల పరంగా ఛార్జింగ్ ఆప్షన్లను అందిస్తుంది. ఈవీలు, రోజువారీ పనులకు అద్భుంగా ఉంటాయి. ముఖ్యంగా నగర వినియోగదారులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఏడాదిలో లాంచ్ అయిన కొత్త జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆఫీసు, స్కూల్ ప్రయాణం లేదా షాపింగ్ కోసం ఈ స్కూటర్లను వినియోగించేవారి సంఖ్య పెరిగింది. మీరు కూడా 2025 చివరిలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర కొనాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి..
2/5
ఓలా S1Xప్లస్ 2025 : తక్కువ బడ్జెట్‌లో కావాలనుకునే వారికి ఓలా S1X ప్లస్ 2025 ఎలక్ట్రిక్ బైక్ అద్భుతంగా ఉంటుంది. డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ, టెక్నో గూడీస్‌తో సెటప్ కలిగి ఉంది. రియల్ వరల్డ్ రేంజ్ సిటీ వినియోగానికి సరిపోతుంది. ప్రతిరోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. రాత్రిపూట మాత్రమే ఛార్జ్ చేయాలి.. అంటే ఉదయం వరకు ఛార్జ్ చేయాలి. తద్వారా ఛార్జింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బరువు కూడా చాలా తేలికగా ఉంటుంది. నగర ట్రాఫిక్ మధ్య ప్రయాణాలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
3/5
టీవీఎస్ ఐక్యూబ్ ST 2025 : అత్యంత సౌకర్యం కోరుకునే కస్టమర్లకు టీవీఎస్ iQube ST 2025 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. రోడ్ల పరిస్థితులను బట్టి రైడ్ క్వాలిటీ చాలావరకు బాగుంటుంది. టీవీఎస్ బ్యాటరీ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. స్టేబుల్ రేంజ్ అందిస్తుంది. లాంగ్ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ సమయంలో హీటింగ్ వంటివి ఉండవు. కనెక్టివిటీ ఫీచర్లతో పాటు భారీ డిజిటల్ డిస్‌ప్లే, ఫ్యామిలీ యూజర్లకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
4/5
ఏథర్ రిజ్టా 2025 : ఫ్యామిలీలు, రోజువారీ ప్రయాణికులకు స్పెషల్ స్కూటర్. సీటు, ఫుట్‌బోర్డ్ స్పేస్ పరంగా అద్భుతంగా ఉంటుంది. సుదూర ప్రాంతాలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. నగర ట్రాఫిక్‌లో ప్రయాణించేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏథర్ ఛార్జింగ్ నెట్‌వర్క్ యాప్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముఖ్యంగా పెట్రోల్ స్కూటర్ కన్నా ఆకర్షణయమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
5/5
2025లో లాంచ్ అయిన ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు విభిన్న యూజర్ల కోసం మార్కెట్లోకి వచ్చాయి. కొందరు అడ్వాన్స్ టెక్నాలజీని ఇష్టపడితే మరికొందరు సౌకర్యాన్ని ఇష్టపడతారు. ఇంకొందరు పవర్‌తో నడిచే స్కూటర్ల టాప్ పర్ఫార్మెన్స్ కోరుకుంటారు. అద్భుతమైన విషయం ఏమిటంటే.. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇకపై కేవలం ఒక ఫ్యాషన్ కాదు.. నగర జీవితంలో ఒక నిత్యావసరంగా మారాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే ముందు రైడింగ్ స్టయిల్, వ్యక్తిగత అవసరాలు, అలాగే బ్రాండ్ పేర్లను బట్టి ఎంచుకోవడం ఎంతైనా మంచిది.