PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ బిగ్ అప్‌డేట్.. 22వ విడత వచ్చేది ఎప్పుడో తెలిసిందోచ్.. ఈ రైతులకు రూ. 2వేలు పడవు.. ఎందుకంటే?
PM Kisan 22nd Installment : ప్రధానమంత్రి కిసాన్ యోజన 21వ విడత తర్వాత రైతులు ఇప్పుడు 22వ విడత కోసం చూస్తున్నారు. ఈసారి రూ. 2వేలు 2026లో ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం..
PM Kisan 22nd Installment
PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో పీఎం కిసాన్ 22వ వాయిదా రాబోతుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) లబ్ధి పొందిన రైతులు ఇప్పుడు 22వ విడత తేదీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకం 21వ విడతను నవంబర్ 19, 2025న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ పథకం కింద సుమారు 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 18వేల కోట్లు బదిలీ అయ్యాయియ. ఆగస్టు 2025లో 20వ విడత, ఫిబ్రవరి 2025లో 19వ విడత విడుదల అయింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి మొత్తం రూ. 6వేలు అందుకుంటారు. ఈ మొత్తం ప్రతి 4 నెలలకు మూడు వాయిదాలలో రూ. 2వేలు చొప్పున నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో బదిలీ అవుతుంది. 2025 ఏడాదికి సంబంధించిన 3 విడతలు కూడా విడుదలయ్యాయి.
ఇప్పటివరకు ఎన్ని వాయిదాలు వచ్చాయి? :
2025లో పీఎం కిసాన్ యోజన కింద 22వ విడత విడుదల కావాల్సి ఉంది. కానీ, మొత్తం 21 విడతలు ఇప్పటికే విడుదలయ్యాయి. గత 21వ విడత నవంబర్ 19న విడుదలైంది. ఎప్పటిలాగే ఈ విడతను పీఎం నరేంద్ర మోదీ స్వయంగా విడుదల చేశారు.
21వ విడత ద్వారా 9 కోట్లకు పైగా అర్హత కలిగిన రైతులు ప్రయోజనం పొందారు. మొదటి విడత ఫిబ్రవరిలో, రెండవ విడత ఆగస్టులో, మూడవ విడత నవంబర్‌లో విడుదలయ్యాయి. మొత్తం మీద 21వ విడతలు విడుదల కాగా 22వ విడత, 2026లో మొదటి విడతగా విడుదల కానుంది.
22వ విడత ఎప్పుడు వస్తుంది? :
పీఎం కిసాన్ 22వ వాయిదా రాబోతుంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రతి విడత దాదాపు ప్రతి 4 నెలలకు విడుదల అవుతుంది. మునుపటి వాయిదాలు అదే క్రమంలో విడుదల అయ్యాయి. పీఎం కిసాన్ 22వ విడత కోసం 4 నెలల సమయం ఇప్పుడు ఫిబ్రవరి 2026లో ఉంది. ఫిబ్రవరిలో 22వ విడత విడుదల కావచ్చని అంచనా. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
పోర్టల్‌లో ఫూర్తి సమాచారం :
మీరు కూడా పీఎం కిసాన్ యోజనలో సభ్యులైతే పథకానికి సంబంధించిన ప్రతి వివరాలు, అప్ డేట్స్, వాయిదాల విడుదల తేదీలు, ప్రయోజనాలను పొందిన రైతుల సంఖ్యతో సహా పథకం అధికారిక పోర్టల్ (pmkisan.gov.in)లో చూడవచ్చు. మీరు అధికారిక పీఎం కిసాన్ యాప్‌ను కూడా ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కిసాన్ ఇ-మిత్రా చాట్‌బాట్‌ను కూడా ఉపయోగించవచ్చు.
ఇవి జాగ్రత్తగా పూర్తి చేయండి :
పీఎం కిసాన్ యోజన కింద వాయిదా డబ్బులు పొందాలంటే మీరు కొన్ని పనులను పూర్తి చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఈ పనులు పూర్తి చేయడంలో విఫలమైతే మీకు రావాల్సిన వాయిదా ఆలస్యం కావచ్చు. మొదటి దశలో e-KYC,రెండవది భూమి ధృవీకరణ, మూడవది ఆధార్ లింకింగ్ ఉంటుంది.
ఏ రైతులు అనర్హులంటే? :
పీఎం కిసాన్ యోజన కింద కొన్ని వర్గాల రైతులు అనర్హులు. వీరిలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది పెన్షనర్లు, అనేక ఇతర వర్గాలు ఉన్నాయి. పూర్తి అర్హత సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అర్హులైన రైతులకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా చూడడమే ప్రభుత్వం లక్ష్యం. రైతులు తమ డాక్యుమెంట్లు, బ్యాంక్ వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి.
