Post Office : పోస్టాఫీస్‌లో అద్భుతమైన పథకం.. మీ ఇంటి నుంచే నెలకు రూ. 20,500 సంపాదించుకోవచ్చు.. పూర్తి లెక్కలు ఇవే!
Post Office : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేవారికి అద్భుతమైన న్యూస్.. ఈ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ. 20వేలపైనే సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఈ పథకం ఏంటి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయింటే?
Post Office Best Investment Scheme
Post Office : పోస్టాఫీసులో పెట్టుబడి పెడుతున్నారా? లేదా పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో ఎంతో కొంత సేవ్ చేసుకుని పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు. అది కూడా మంచి రాబడిని అందించే పెట్టుబడి పథకాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తమ రిటైర్మెంట్ విషయంలో భారీ మొత్తంలో డబ్బును సంపాదించుకోవచ్చు. ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీస్ పొదుపు పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ఒకటి. ఈ పథకంలో పెట్టుబడులపై అందించే వడ్డీ రేట్లు బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కన్నా అధికంగా ఉంటాయి.
బ్యాంకుల్లో కన్నా అధిక వడ్డీ రేట్లు :
ప్రభుత్వం ఈ పోస్టాఫీసులోపెట్టుబడులపై భద్రతా హామీని కూడా అందిస్తుంది. పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు రూ. 20వేలకు పైగా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడిని కేవలం రూ. 1000తో ప్రారంభించవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్‌లో వడ్డీ రేటు జనవరి 1, 2024 నుంచి పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం 8.2శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
సురక్షితమైన పెట్టుబడి పరంగా మాత్రమే కాకుండా ఈ పోస్టాఫీస్ పథకం పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ స్కీమ్‌లో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షలుగా ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత ఆదాయాన్ని పొందడానికి ఈ పోస్టాఫీస్ పథకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో, 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తితోనైనా లేదా జీవిత భాగస్వామితోనైనా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
ఈ పథకం కింద కొన్ని సందర్భాల్లో వయో పరిమితులు కూడా సడలింపు ఉంటుంది. ఉదాహరణకు.. VRS తీసుకున్న వ్యక్తి అయితే అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో 55 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉండవచ్చు 60 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉండవచ్చు. 50 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న 60 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న రిటైర్డ్ రక్షణ సిబ్బంది కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి.
మెచ్యూరిటీకి ముందే అకౌంట్ క్లోజ్ చేయొద్దు :
పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు. అంటే ఈ పథకం పూర్తి ప్రయోజనాలను పొందాలంటే మీరు 5 ఏళ్లు క్రమంతప్పకుండా పెట్టుబడి పెట్టాలి. అయితే, ఈ కాలానికి ముందు ఈ అకౌంట్ క్లోజ్ చేస్తే నిబంధనల ప్రకారం.. ఖాతాదారుడు జరిమానా చెల్లించాలి. సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లడం ద్వారా మీ SCSS అకౌంట్ సులభంగా ఓపెన్ చేయొచ్చు. POSCSSలో పెట్టుబడి పెట్టే వ్యక్తికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం రూ. 1.5 లక్షల వరకు వార్షిక పన్ను మినహాయింపు పొందవచ్చు.
నెలకు రూ. 20 వేలు సంపాదన :
పెట్టుబడిదారులు ఈ ప్రభుత్వ పథకంలో కేవలం రూ. 1,000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లు 1,000 గుణిజాలలో నిర్ణయిస్తారు. ఇప్పుడు, ఈ పథకం ద్వారా నెలకు రూ. 20వేల సంపాదనగా లెక్కిస్తే.. 8.2శాతం వడ్డీ రేటుతో ఒక వ్యక్తి సుమారు రూ. 30 లక్షలు పెట్టుబడితో వార్షిక వడ్డీ రూ. 2.46 లక్షలు పొందుతారు. నెలవారీ ప్రాతిపదికన లెక్కించిన ఈ వడ్డీ రేటు నెలకు సుమారు రూ. 20,500 అవుతుంది.
ఈ పోస్టాఫీస్ పథకంలో త్రైమాసిక వడ్డీని అందిస్తుంది. ప్రతి ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి మొదటి తేదీన వడ్డీ చెల్లిస్తుంది. ఖాతాదారుడు మెచ్యూరిటీ కాలానికి ముందే మరణిస్తే.. అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఆ మొత్తం డబ్బులు డాక్యుమెంట్లలో పేర్కొన్న నామినీకి బదిలీ అవుతుంది.
