Health Insurance : మీరు ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు అసలు చేయొద్దు.. ముందు ఈ స్టోరీ చదవండి..!
Health Insurance Online : ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటో పూర్తిగా చదివి తెలుసుకోండి.
Health Insurance
Health Insurance Online : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఆన్‌లైన్‌లో కొత్త హెల్త్ పాలసీ తీసుకుంటున్నారా? ఈ వార్త మీకోసమే.. ఆన్‌లైన్‌లో ఆరోగ్య బీమా కొనుగోలు చేయడం గతంలో కన్నా చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఇంటి నుంచే వివిధ కంపెనీల పాలసీలను కంపేర్ చేయొచ్చు.
నచ్చిన హెల్త్ పాలసీని తీసుకోవచ్చు. ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance Online) అనేది చాలా పారదర్శకంగా ఉంటుంది. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో హెల్త్ ప్లాన్‌లు పూర్తిగా పేపర్ లెస్ ఉంటుంది. పెద్దగా హైరానా పడాల్సిన పనిలేదు. ఒకే డాష్‌బోర్డ్‌లో ట్రాక్ చేయొచ్చు. అయితే, ఆన్‌లైన్ పాలసీల విషయంలో పూర్తి సమాచారాన్ని పొందలేరు.
అంటే.. ఏజెంట్ లేకుండా చాలా మంది పాలసీలను కొనుగోలు చేస్తుంటారు. పాలసీలో ఉన్న విషయాలను అర్థం చేసుకోలేకపోవడం వంటివి ఉంటాయి. పాలసీ తీసుకునేటప్పుడు ఏయే విషయాలు బహిర్గతం చేయాలి అనేది అవగాహన ఉండదు.
వెయింటింగ్ పీరియడ్ ఏంటి? ఎలా వర్తిస్తుంది? అనే ముఖ్యమైన వివరాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే మీరు కూడా ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునే ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను ఇప్పుడు వివరంంగా తెలుసుకుందాం..
ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ విషయంలో చేసే తప్పులివే :
మీరు ఆన్ లైన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు చాలామంది పాలసీదారులు మిస్టేక్స్ చేస్తుంటారు. అందులో రూం అద్దె, ఇతర చెల్లింపులు, వెయింటింగ్ పీరియడ్ వంటి ముఖ్యమైన అంశాలను విస్మరిస్తారు. తరచుగా ప్రీమియంపై మాత్రమే ఫోకస్ పెడతారు.
కవరేజ్ తమ అవసరాలను తీర్చకపోయినా చాలా మంది కస్టమర్లు తక్కువ ప్రీమియంల కారణంగా పాలసీలను తీసుకుంటారు. చాలామంది ఈ పాలసీ తమ రక్షణ కోసం కాకుండా కేవలం టాక్స్ సేవింగ్ కోసమనే భావిస్తారు.
తక్కువ ప్రీమియం ప్లాన్‌లలో తరచుగా రూం అద్దె పరిమితులు, ఇతర సౌకర్యాలపై పరిమితులు, అదనపు పేమెంట్లు ఉంటాయి. క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు వర్తిస్తాయి. అంతేకాదు.. అవసరమైన యాడ్-ఆన్ కవరేజీలను కూడా పెద్దగా పట్టించుకోరు.
పాలసీ తీసుకునే ముందు రిక్వెస్ట్ ఫారమ్‌లో కచ్చితమైన సమాచారాన్ని అందించకపోవడం.. గతంలో జరిగిన వైద్య పరీక్షలు, మందులు, అనారోగ్యాలు లేదా సర్జరీలను దాచిపెట్టవద్దు. చాలా క్లెయిమ్ తిరస్కరణలు తప్పుడు సమాచారం కారణంగా జరుగుతాయి.
ఏయే విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం?
రూం అద్దె :
మీ ఇన్సూరెన్స్ పాలసీలో సూచించిన రూమ్ కేటగిరీ కన్నా ఎక్కువ ధరకు రూం బుక్ చేసుకోవడం వల్ల మొత్తం బిల్లుపై మినహాయింపు లభించవచ్చు.
క్యాష్ లెస్ పేమెంట్ :
ఆస్పత్రికి వెళ్లే ముందు మీ ఇన్సూరెన్స్ పాలసీ అక్కడి నెట్‌వర్క్‌లో ఉందో లేదో చెక్ చేయండి.
టాప్-అప్ ప్లాన్‌లు :
టాప్ అప్ ప్లాన్లను తగ్గింపుతో తీసుకోవచ్చు. అయితే, ప్రైమరీ బేస్ పాలసీకి సరిగ్గా మ్యాచ్ అయితేనే ఈ ప్రయోజనం లభిస్తుందని గమనించాలి.
ముందస్తు అనుమతి :
సర్జరీకి 3 నుంచి 5 రోజుల ముందు ముందస్తు అనుమతి ప్రాసెస్ మొదలుపెట్టాలి.
OPD ఖర్చులు :
చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రత్యేక OPD కవర్‌ను అందించవు. మీకు అవసరమైతే OPDయాడ్-ఆన్ తీసుకోండి.
