×
Ad

Top Electric SUV Cars : మంచి ఫ్యామిలీ కారు కావాలా? 2025లో టాప్ మోస్ట్ 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV మోడల్స్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Top Electric SUV Cars : 2025లో భారత మార్కెట్లో టాప్ 7 సీటింగ్ ఎలక్ట్రిక్ SUV కార్లు ఇలా ఉన్నాయి. ఫ్యామిలీ కస్టమర్లు తప్పక కొనాల్సిన ఈవీ మోడల్స్ ఇవే.. ఓసారి లుక్కేయండి.

Top Electric SUV Cars

Top Electric SUV Cars : కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. భారతీయ మార్కెట్లో ప్రత్యేకించి ఫ్యామిలీ కస్టమర్ల కోసం 7 సీటింగ్ ఎలక్ట్రిక్ SUV కార్లు అందుబాటులో ఉన్నాయి. పెద్ద ఫ్యామిలీ కలిగిన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ 7-సీట్ల SUV కార్ల కోసం వెతుకుతున్నారు.

ఈ అడ్వాన్స్ వెహికల్స్, సామర్థ్యం, ​​సౌకర్యంతో పాటు(Top Electric SUV Cars) మోడ్రాన్ డిజైన్లను కలిగి ఉన్నాయి. అప్‌గ్రేడ్ టెక్నాలజీతో లాంగ్ డ్రైవ్ చేసే వారికి అద్భుతంగా ఉంటాయి. భారతీయ రోడ్లపై ఈ 7-సీట్ల ఈవీ SUV కార్లలో మీకు నచ్చిన కారు ఎంచుకుని కొనేసుకోవచ్చు.

టాటా సఫారీ ఎలక్ట్రిక్ :
టాటా 2025లో అత్యంత పాపులర్ సఫారీ ఎలక్ట్రిక్ వెర్షన్‌ అందిస్తుంది. స్ట్రాంగ్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంటుంది. దాదాపు 500 కి.మీ రేంజ్ అందిస్తుంది. లోపల అద్భుతమైన నిర్మాణ క్వాలిటీతో పాటు ఫీచర్లలో భారీ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు ADAS 2.0 ఫీచర్లు ఉంటాయి. పెద్ద ఫ్యామిలీలకు సీటు స్పేసింగ్ పరంగా బాగుంటుంది. ఈ టాటా సఫారీ ఎలక్ట్రిక్ సుమారు ధర రూ. 32 లక్షలు ఉంటుంది.

Read Also : Best Camera Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఫొటో క్వాలిటీ కేక బ్రదర్..!

మహీంద్రా XUV700 :
మహీంద్రా XUV700 ఈవీ కారు మహీంద్రా XUV e8కు అప్‌గ్రేడ్ వెర్షన్. మహీంద్రా XUV700కు ఎలక్ట్రిక్ వెర్షన్ కానుంది. 7 సీట్ల కాన్ఫిగరేషన్ ఫ్యూచరిస్టిక్ డాష్‌బోర్డ్, డ్యూయల్ స్క్రీన్‌లు, లాంగ్-రేంజ్‌తో రూపొందింది.అయితే, మహీంద్రా కారు హై-పర్ఫార్మెన్స్ సౌకర్యవంతమైన సస్పెన్షన్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మహీంద్రా కారు ధర రూ. 34 లక్షల నుంచి 36 లక్షల వరకు ఉంటుంది.

హ్యుందాయ్ అయోనిక్ 7 :
ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా పేరొందిన హ్యుందాయ్ అయోనిక్ 7 అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. స్పేస్, సౌకర్యం, టెక్నాలజీతో 3 అదిరిపోయే ఫీచర్లు కలిగి ఉంది. ఈ కారులో ఏడుగురు అడల్ట్స్ కూర్చొనేలా సీటింగ్ ఉంటుంది. 600 కి.మీ వరకు రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అద్భుతమైన స్పీడ్ ఛార్జింగ్ ADAS సేఫ్టీ టెక్నీలజీని కలిగి ఉంది. టెక్నాలజీ పరంగా పెద్ద ఫ్యామిలీలకు అనువైన ప్రీమియం ఈవీ కారుగా చెప్పవచ్చు. ఈ కారు ధర
సుమారు 60 లక్షలు ఉంటుంది.

కియా EV9 :
ఎలక్ట్రిక్ SUV కార్లలో సైజు పోటీలో కియా ముందుకు దూసుకెళ్తోంది. భారత మార్కెట్లోకి అడ్వాన్స్ క్యాబిన్ స్పేస్, లగ్జరీ ఇంటీరియర్స్, అద్భుతమైన బ్యాటరీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. దీని ప్రకారం.. ఈ ఫ్యూచర్ SUV హైవే సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ధర రూ. 65 లక్షల నుంచి ఉంటుంది.