Compact Electric Scooters
Compact Electric Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? 2025 డిసెంబర్ నెలతో ఏడాది ముగుస్తోంది. ఈ నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ప్రత్యేకించి మహిళల కోసం మార్కెట్లో అత్యంత సౌకర్యవంతమైన స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది మహిళా రైడర్లు కాంపాక్ట్ ఇ-స్కూటర్‌లను ఇష్టపడతారు. మీరు కూడా స్టైలిష్, తేలికైన, సౌకర్యవంతమైన బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.
ఎందుకంటే.. మహిళలు ఈజీగా స్కూటర్లను (Compact Electric Scooters) నడపొచ్చు. కేవలం రూ. 100,000 కన్నా తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రోజువారీ ప్రయాణ ఖర్చులను తగ్గించడమే కాదు.. రిమూవబుల్ బ్యాటరీలు, కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ లాక్‌లు, కంపర్ట్ సీటింగ్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉన్నాయి. సిటీ రైడింగ్‌కు సరిగ్గా సరిపోతాయి. మహిళల కోసం రూ. లక్ష కన్నా తక్కువ ధరలో బెస్ట్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఈవీ స్కూటర్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
1. జాలియో లిటిల్ గ్రేసీ ఇ-స్కూటర్ (రూ. 55వేల నుంచి రూ.60వేలు)
జెలియో లిటిల్ గ్రేసీ అనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తేలికగా ఉంటుంది. సరసమైన ధర, ఆకర్షణీయమైన డిజైన్, తేలికైన బరువుతో బాగా పాపులర్ అయింది. కేవలం 80 కిలోల బరువుతో భారీ ట్రాఫిక్‌లో కూడా ఈజీగా నడపొచ్చు. ఈ స్కూటర్ 1.5 యూనిట్ల పవర్ 60 కి.మీ నుంచి 90 కి.మీ రేంజ్ అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుంది.
సెంటర్ లాక్ యాంటీ-థెఫ్ట్ అలారం, USB ఛార్జింగ్, కీలెస్ డ్రైవ్, హైడ్రాలిక్ సస్పెన్షన్ స్టైలిష్ కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది. వర్షంలో కూడా సేఫ్‌గా డ్రైవ్ చేయొచ్చు. అతిపెద్ద బెనిఫిట్ ఏమిటంటే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు లైసెన్స్ అవసరం లేదు. 2 ఏళ్ల వారంటీతో మహిళా రైడర్ల సిటీ ప్రయాణికులకు అద్భుతంగా ఉంటుంది.
2 : హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX 2.0 (85వేల నుంచి రూ. 90 వేలు) :
హీరో ఆప్టిమా CX 2.0 అనేది మహిళలకు అత్యంత సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్. కేవలం 72.5 కిలోల నుంచి 83 కిలోల బరువు ఉంటుంది. ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 89 కి.మీ రేంజ్ అందిస్తుంది. సేఫ్టీ ఫీచర్లలో ఎల్ఈడీ డీఆర్ఎల్, రీజనరేటివ్ బ్రేకింగ్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్, ఇంట్లో ఛార్జ్ చేయగల పోర్టబుల్ బ్యాటరీ ఉన్నాయి. నగర ప్రయాణాలకు సరసమైన స్కూటర్.
ఒకినావా లైట్ అనేది రోజువారీ సిటీ రైడర్ల కోసం రూపొందించిన లైట్ కాంపాక్ట్ ఇ-స్కూటర్. 1.25kWh లిథియం-అయాన్ రిమూవబుల్ బ్యాటరీతో పవర్ అందిస్తుంది. కేవలం 4 గంటల నుంచి 5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 60 కి.మీ రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. స్వల్ప దూర ప్రయాణాలకు సేఫ్‌గా ఉంటుంది.
ఎల్ఈడీ లైట్లు, అల్లాయ్ వీల్స్, పుష్-బటన్ స్టార్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, యాంటీ-థెఫ్ట్ లాక్, ఆటో హ్యాండిల్ లాక్, హజార్డ్ లాంప్ E-ABS వంటి ఫీచర్లు ఉన్నాయి. లో సీటు ఎత్తు (740 మి.మీ) మహిళలకు కూర్చొనేందుకు ఈజీగా ఉంటుంది. ఈ స్కూటర్ మోటారు బ్యాటరీ 3 ఏళ్ల వారంటీతో వస్తుంది.
4 : ఆంపియర్ మాగ్నస్ EX (రూ. 67,999 నుంచి రూ. 94,900) :
ఆంపియర్ మాగ్నస్ EX అనేది అత్యంత సరసమైన సిటీ ఎలక్ట్రిక్ స్కూటర్. కేవలం 82 కిలోల బరువుతో బ్యాలెన్స్ చేయడం చాలా ఈజీ. ARAI-సర్టిఫైడ్ రేంజ్ 121 కి.మీ వరకు 80 కి.మీ నుంచి 100 కి.మీ అందిస్తుంది. 2.1 kW BLDC మోటార్ ద్వారా పవర్ పొందుతుంది. గరిష్టంగా గంటకు 50 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
ఎకో, సిటీ రివర్స్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ డిస్‌ప్లే, USB ఛార్జింగ్, స్టోరేజీ, ఎల్ఈడీ డీఆర్ఎల్ యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు ఉన్నాయి. లింప్ హోమ్ ఫీచర్ లో బ్యాటరీ లైఫ్‌తో కూడా కొంత దూరం ప్రయాణించగలదు.
5 : కోమాకి SE ఎకో (రూ. 97,256 ఎక్స్-షోరూమ్) :
కోమాకి ఎస్ఈ (Komaki SE Eco) ఎకో అనేది రోజువారీ సిటీ ప్రయాణాల కోసం తయారైన స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్. 2kW LiPo బ్యాటరీతో రన్ అయ్యే ఈ స్కూటర్ 100 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. 82 కిలోల బరువున్న ఈ స్కూటర్ మహిళలు ఈజీగా నడపొచ్చు. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. యాంటీ-థెఫ్ట్ లాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, యాంటీ-స్కిడ్ టైర్లు, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఈ స్మార్ట్ డిజిటల్ డాష్‌బోర్డ్ వైడ్ బూట్ స్పేస్ అడ్వాన్స్ ఫీచర్లు కలిగి ఉంది.