Top Electric Cars 2026 : రూ. 12 లక్షల నుంచి రూ. 20 లక్షల్లో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. 543 కి.మీ రేంజ్ ఇచ్చే టాప్ కారు ఇదే..!

Top Electric Cars : రూ.20 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల కోసం చూస్తున్నారా? మారుతి ఈవిటారా నుంచి టాటా నెక్సాన్ ఈవీ వరకు ధరలు, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ప్రత్యేక ఫీచర్ల వివరాలివే..

Top Electric Cars 2026

  • కొత్త కారు కొనాలనుకుంటున్నారా?
  • రూ.20 లక్షల్లో అదిరిపోయే ఈవీ ఎస్‌యూవీలు ఇవే
  • రూ.12 లక్షల నుంచే ఎలక్ట్రిక్ కార్లు.. ధర, రేంజ్, ఫీచర్లు

Top Electric Cars 2026 : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న కొద్దీ చాలామంది కారు కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. రోజువారీ ప్రయాణాల్లో ఇంధన ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మోడ్రాన్ ఫీచర్లు, మంచి డ్రైవింగ్ రేంజ్ కావాలని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో రూ.20 లక్షల లోపు బడ్జెట్‌లో లభించే ఎలక్ట్రిక్ కార్లు బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి ఈవిటారా, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు ఏంటి? రేంజ్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మారుతి సుజుకి ఈవిటారా :
ఎక్కువ రేంజ్ కోరుకునే వారికి ఈ కారు అద్భుతమైన ఆప్షన్. ఈ కారు ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.16.19 లక్షలు. 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. వేరియంట్‌ను బట్టి 440 నుంచి 543 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. లెవల్-2 ఏడీఏఎస్ వంటి అడ్వాన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Read Also : 5 Best Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ.12వేల లోపు ధరకే టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

టాటా కర్వ్ ఈవీ :
కూపే ఎస్‌యూవీ డిజైన్ ఇష్టపడేవారికి ఇది చాలా బాగుంటుంది. ప్రారంభ ధర రూ.17.19 లక్షలు కాగా, 45 kWh, 55 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. భారీ బ్యాటరీ వేరియంట్ 502 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

ఎంజీ విండ్సర్ ఈవీ :
క్యాబిన్ స్పేస్, సౌకర్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారికి ఈ కారు చాలా బెస్ట్.. ప్రారంభ ధర రూ.14.85 లక్షలు మాత్రమే.. 38 kWh, 52.9 kWh బ్యాటరీలతో వస్తుంది. గరిష్ఠంగా 449 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 604 లీటర్ల బూట్ స్పేస్ ఆకర్షణీయమైన ఫీచర్లుగా చెప్పొచ్చు..

టాటా నెక్సాన్ ఈవీ :
తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ కారు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ప్రారంభ ధర రూ.12.49 లక్షలు. 30kWh, 45kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. వేరియంట్‌ను బట్టి 275 నుంచి 489 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. మీ బడ్జెట్, రోజువారీ ప్రయాణం, ఛార్జింగ్ అవసరాలను బట్టి సరైన ఈవీ కారును ఎంచుకోవచ్చు..