Top Upcoming Cars : మేలో ఎలక్ట్రిక్ కార్ల జాతరే జాతర! కొత్త EVలు వచ్చేస్తున్నాయ్.. రేంజ్ చూసి షాక్ అవ్వాల్సిందే!
Top Upcoming Cars : ఎంజీ మెజెస్టర్, టాటా సియెర్రా ఈవీ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ హోండా జెడ్ఆర్-వి మే 2026లో విడుదల కానున్నాయి. విస్తృత శ్రేణిలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ నవీకరించబడిన కార్లు అందుబాటులో ఉంటాయి.
- Sreehari A
- Published on- May 2, 2026 / 06:52 PM IST
Top Upcoming Cars
- 2026 మే నెలలో కొత్త ఈవీ కార్లు రాబోతున్నాయి
- రూ. 12 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్య ఉండొచ్చు
- ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ టెక్నాలజీ కార్లు లాంచ్ అయ్యే ఛాన్స్
Top Upcoming Cars : కారు లవర్స్ మీకోసమే.. 2026 మే నెలలో భారత మార్కెట్లో అనేక కొత్త కార్లు రాబోతున్నాయి. ఇందులో ఎంజీ మ్యాజెస్టర్, టాటా సియెర్రా ఈవీ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్, హోండా జెడ్ఆర్-వి ఉన్నాయి.
ఈసారి స్పెషాలిటీ ఏమిటంటే.. రాబోయే కార్లలో సరికొత్త ఫీచర్లతో కొన్ని ఎలక్ట్రిక్ కార్లు కాగా, కొన్ని హైబ్రిడ్ టెక్నాలజీతో (Top Upcoming Cars) రానున్నాయి. మరికొన్ని కొత్త ఫీచర్లతో మోడళ్లుగా రాబోతున్నాయి. ఈ కార్ల ధర రూ. 12 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్య ఉంటుందని అంచనా. అన్ని బడ్జెట్‌ల వారికి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ప్రీమియం ఎస్‌యూవీ ట్రెండ్ :
ఈ నెలలో ఏ ఒక్క కారూ ప్రత్యేకంగా ఉండకపోవచ్చు. కొత్త కార్లు మరిన్ని ఆప్షన్లలో లభిస్తాయి. ముఖ్యంగా, ఎలక్ట్రిక్ కార్లు, ప్రీమియం SUV ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. అంటే.. కొత్త టెక్నాలజీ అద్భుతమైన ఫీచర్లు ఉన్న కార్ల కోసమే ఎక్కువగా చూస్తున్నారని చెప్పొచ్చు.
ఎంజీ మేజెస్టర్ టాటా సియెర్రా ఈవీ :
ఎంజీ మేజెస్టర్ ఫుల్-సైజ్ SUV సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తుందని అంచనా. ఈ మోడల్ ధర రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. 6 నుంచి 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ పవర్ అందిస్తుంది.
Read Also : Legal Guide : తల్లిదండ్రుల ప్రతి ఆస్తిపై పిల్లలకు పూర్తి హక్కులు ఉంటాయా? అసలు చట్టం ఏం చెబుతుందంటే?
సుమారుగా 215bhp, 478Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందిస్తుంది. ఇందులో 12.23-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్ డిఫరెన్షియల్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అదనంగా, టాటా సియెర్రా ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా లభ్యం కానుంది. దీని అంచనా ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుంది. రియర్-వీల్ డ్రైవ్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లలో అందించే అవకాశం ఉంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ అబెల్లా :
టయోటా అర్బన్ క్రూయిజర్ అబెల్లా ధర సుమారు రూ. 16 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా. ఈ లైనప్‌లోని అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలుస్తుంది. మారుతి ఇవిటారాతో ఒకే ప్లాట్‌ఫామ్‌ను షేర్ చేస్తుంది. అనేక వేరియంట్లు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో వస్తాయి.
మరోవైపు.. హోండా ఒకేసారి రెండు సెగ్మెంట్లను లక్ష్యంగా చేసుకుంది. మే 22వ తేదీన రానున్న సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్‌లను కొనసాగిస్తూనే బంపర్లు కొత్త అల్లాయ్ వీల్స్ వంటి కాస్మెటిక్ అప్‌డేట్‌లు, భారీ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు 360-డిగ్రీ కెమెరా వంటి కొత్త ఫీచర్లు ఉంటాయి.
ఈ హోండా ZR-V ప్రీమియం ఎస్‌యూవీగా భావిస్తున్నారు. ఇందులో హైబ్రిడ్ సెటప్ సుమారు 181bhp, 315Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సుమారు రూ. 40 లక్షల ధరతో రానున్న ఈ ఎస్‌యూవీ టిగువాన్ కోడియాక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
