TVS iQube S : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాస్ రేంజ్, క్లాస్ ఫీచర్స్.. సింగిల్ ఛార్జ్‌పై 175 కి.మీ దూసుకెళ్తుంది.. ధర జస్ట్..!
TVS iQube S Launch : టీవీఎస్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఐక్యూబ్ ఎస్ 4.7kwh బ్యాటరీతో భారత మార్కెట్లో మీ బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 175 కి.మీ రేంజ్ అందిస్తుంది.
- Sreehari A
- Updated on- May 6, 2026 / 06:46 PM IST
TVS iQube S
- టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది
- గంటకు 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అందుకోగలదు
- కేవలం 4.3 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ వేగం
TVS iQube S Launch : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. టీవీఎస్ మోటార్ భారత మార్కెట్లో కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రూ. 1.37 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కొత్త ఇ-స్కూటర్‌లో ఇప్పుడు మోస్ట్ పవర్ ఫుల్ భారీ బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 175 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది.
గంటకు 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 32-లీటర్ల వైడ్ బూట్ స్పేస్ 118కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో (TVS iQube S) ఈ స్కూటర్ డిజైన్, పర్ఫార్మెన్స్, స్మార్ట్‌నెస్ అనే 3 అంశాలలోనూ అద్భుతంగా రాణిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని ఫీచర్లతో పాటు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ (EV) మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ ఆధిపత్యం పెరుగుతూనే ఉంది. సుమారు 24.36శాతం మార్కెట్ వాటాతో టీవీఎస్ దేశంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీగా అవతరించింది.
టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ కంపెనీ ఐక్యూబ్ లైనప్‌లో కొత్త పవర్‌ఫుల్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. అదే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7kWh అందిస్తుంది. టీవీఎస్ నుంచి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బ్యాటరీ, రేంజ్, ధర :
ఈ కొత్త టీవీఎస్ మోడల్ పాత ఐక్యూబ్ ఎస్ 3.5kWh వేరియంట్ స్థానంలో వచ్చింది. ఇందులో పవర్ ఫుల్ 4.7 kWh బ్యాటరీని అమర్చారు. ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా పదేపదే ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 175 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ వస్తుందని కంపెనీ పేర్కొంది.
ధర విషయానికి వస్తే.. రూ. 137,142 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో వస్తుంది. టీవీఎస్ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో ఈ కొత్త వేరియంట్ బేస్ ఐక్యూబ్ మోడల్ కన్నా పైన మరింత ఖరీదైన ‘ఐక్యూబ్ ఎస్‌టీ’ వేరియంట్ కన్నా దిగువన స్థానంలో ఉంది.
పర్ఫార్మెన్స్, స్పీడ్ :
పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. ఈ స్కూటర్‌లో 3.0kW టాప్ పవర్ (సుమారు 4bhp), 33Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే హబ్ మోటార్ ఉంది. సిటీ రహదారులపై చాలా స్మూత్‌గా వెళ్తుంది. యాక్సిలరేషన్ విషయంలో కూడా గంటకు 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అందుకోగలదు. పికప్ కూడా ఆకట్టుకుంటుంది. కేవలం 4.3 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందిస్తుంది.
ఛార్జింగ్, హార్డ్‌వేర్ :
ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్‌తో పాటు ఇంటర్నల్ ఛార్జర్ రాదు. ఆఫ్‌బోర్డ్ ఛార్జర్ సాయంతో బ్యాటరీని కేవలం 4 గంటల్లో 0 నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అదే సమయంలో, రైడింగ్ సేఫ్ కంట్రోల్ కోసం టీవీఎస్ ఇందులో పవర్‌ఫుల్ హార్డ్‌వేర్‌ను ఉపయోగించింది. ఫ్రంట్ వీల్ 220mm డిస్క్ బ్రేక్ బ్యాక్ వీల్ 130mm డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంది. అలాగే, మెరుగైన గ్రిప్ కోసం 90/90-12 సైజు ట్యూబ్‌లెస్ టైర్లతో 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించింది.
ఫీచర్లు, స్మార్ట్ టెక్నాలజీ :
స్మార్ట్ ఫీచర్ల పరంగా ఈ స్కూటర్ చాలా అడ్వాన్స్. 7-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. టచ్‌స్క్రీన్ కాకపోయినా హ్యాండిల్‌బార్‌పై జాయ్‌స్టిక్‌తో ఈజీగా నావిగేట్ చేయవచ్చు. ఈ డిస్‌ప్లే బ్లూటూత్ కనెక్టివిటీ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో వస్తుంది. 118కి పైగా స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ పరంగా టీవీఎస్ రివర్స్ మోడ్, క్రాష్ అలర్ట్, ఫాల్ అలర్ట్ యాంటీ-థెఫ్ట్ అలర్ట్ వంటి అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది.
కఠినమైన భూభాగం, వర్షం వంటి ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రికల్ కాంపోనెంట్లు IP67 రేటింగ్ అందిస్తుంది. సౌకర్యం పరంగా డ్యూయల్-టోన్ సీటు పిలియన్ బ్యాక్‌రెస్ట్ అందిస్తుంది. సీటు కింద 32-లీటర్ల భారీ స్టోరేజ్ ఉంది. ఇందులో 2 హెల్మెట్‌లను సులభంగా ఉంచవచ్చని కంపెనీ పేర్కొంది.
కలర్ ఆప్షన్లు :
ఈ TVS స్కూటర్ టైటానియం గ్రే, హార్లెకిన్ బ్లూ బీజ్, మాగ్నిఫిసెన్స్ పర్పుల్ బీజ్ అనే 3 కొత్త ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో విడుదల అయింది. స్కూటర్ స్ట్రక్షర్, సైజు విషయానికి వస్తే.. మొత్తం బరువు 128.8 కేజీలు ఉంటుంది. సీటు ఎత్తు 770 మిమీ ఉంటుంది. అన్ని ఎత్తుల రైడర్‌లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అద్భుతమైన 157 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, కఠినమైన రోడ్లు, భారీ స్పీడ్ బ్రేకర్లపై కూడా స్కూటర్ స్మూత్ గా వెళ్లగలదు.
