Upcoming Cars in July 2026 : కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఆగండి.. జూలైలో వస్తున్న ఈ కార్లు చూసాకే డిసైడ్ అవ్వండి!

Upcoming Cars in July 2026 : ఈ జూలైలో మారుతి, రెనాల్ట్, నిస్సాన్ ఎంజీ నుంచి సరికొత్త మోడల్ కార్లు లాంచ్ కానున్నాయి. ఇందులో కొత్త మోడళ్లలో టర్బో-పెట్రోల్ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్, రెనాల్ట్ క్విడ్ నిస్సాన్ టెక్టన్ ఎస్‌యూవీ ఉన్నాయి.

Upcoming Cars in July 2026

  • జూలై 2026లో లాంచ్ కానున్న సరికొత్త కార్లు ఇవే
  • మార్కెట్లో నేరుగా పోటీ పడుతున్న 3 కంపెనీలు
  • జూలై నెలాఖరులోగా మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్

Upcoming Cars in July 2026 : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వచ్చే జూలైలో అతి త్వరలోనే బ్రహ్మాండమైన ఫీచర్లతో సరికొత్త కార్లు రాబోతున్నాయి. అందులో మారుతి సుజుకి, రెనాల్ట్, నిస్సాన్, ఎంజీ కంపెనీలు బ్యాక్ టు బ్యాక్ కొత్త, అప్‌డేట్ మోడళ్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.

ఈ కొత్త కార్లతో భారతీయ ఆటోమొబైల్ షోరూమ్‌లు సందడిగా మారనున్నాయి. మీరు కొత్త కారు కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. రాబోయే కార్లలో కనీసం 3 కంపెనీలు నేరుగా పోటీ పడుతున్నాయి. మీ బడ్జెట్‌ ధరలో కొత్త కారు కోసం చూస్తుంటే ఈ జూలైలో రాబోయే కార్లపై ఓ కన్నేసి ఉంచండి..

మారుతి సుజుకి బ్రెజ్జా ఫీచర్లు ఇవేనా? :
జూలై నెలాఖరులోగా మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది. మారుతి సుజుకి చివరిగా టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ అందించనుంది. బహుశా ఫ్రాంక్స్ మాదిరిగా 1.0-లీటర్ బూస్టర్‌జెట్ యూనిట్‌ను ఇందులో అమర్చవచ్చు.

సుమారు 99bhp 147.6Nm పవర్ జనరేట్ చేస్తుంది. ఇప్పటికే ఉన్న 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కూడా ఉంటుందని అంచనా. మారుతి ఇప్పటికే విక్టోరిస్‌ CNG వెర్షన్‌లో ప్రస్తుత బూట్-మౌంటెడ్ సెటప్‌కు బదులుగా అండర్‌బాడీ-మౌంటెడ్ ట్యాంక్‌ను అమర్చనున్నట్లు సమాచారం.

Read Also : WhatsApp Username : వాట్సాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇక ఫోన్ నంబర్ అక్కర్లేదు.. మీ యూజర్‌నేమ్‌ను ముందే రిజర్వ్ చేసుకోండి!

10.1-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉంటాయని అంచనా. ప్రస్తుతానికి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, మే నెలలో బ్రెజ్జా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 14శాతం తగ్గాయి. దాంతో ఇప్పటికే టర్బో ఇంజిన్‌లతో దూసుకుపోతున్న నెక్సాన్, వెన్యూ వంటి పోటీదారులతో మళ్లీ మార్కెట్‌లో పుంజుకునేందుకు మారుతి సుజుకి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

క్విడ్, టెక్టాన్ :
రెనాల్ట్ అప్‌డేటెడ్ క్విడ్ జూలై 3న లాంచ్ కానుంది. నివేదికల ప్రకారం.. స్టైలింగ్ డాసియా స్ప్రింగ్ మాదిరిగా ఉంటుంది. ప్రస్తుత 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను మార్చలేదు. ఇదే నెలలో 6 రోజుల తర్వాత జూలై 9న నిస్సాన్ కొత్త టెక్టన్ మిడ్‌సైజ్ SUV లాంచ్ చేయనుంది.

రెనాల్ట్ డస్టర్‌తో 1.0-లీటర్, 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లతో భారీ నిస్సాన్ పెట్రోల్ తరహాలో స్టైలింగ్‌ అందిస్తుంది. అదే రోజున ఎంజీ చైనా-స్పెక్ వులింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా కొత్త ఎనర్జీ కారును ఆవిష్కరించనుంది. ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను 20.5kWh బ్యాటరీతో మొత్తం 197bhp పవర్ జనరేట్ చేస్తుంది.

ఇప్పుడే కొనాలా? లేదా ఆగాలా? :
మీరు ప్రత్యేకించి కాంపాక్ట్ SUV లేదంటే హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో చూస్తుంటే ఈ కొత్త కార్లు లాంచ్ అయ్యే వరకు ఆగడమే బెటర్. ఎందుకంటే.. బ్రెజ్జా, క్విడ్ ధరలు ప్రస్తుతానికి మార్కెట్ వాల్యూ ఉన్నా కొద్దిరోజులకు మారే అవకాశం ఉంది. మిడ్‌సైజ్ SUV కొనుగోలుదారుల కోసం జూలై 9న టెక్టాన్ రాబోతుంది. క్రెటా, సెల్టోస్‌లలో ఏదైనా ఎంచుకునే ముందు కంపేర్ చేసి తీసుకోవచ్చు.