మీ అకౌంట్ చెక్ చేసుకోండి : Paytm వాడుతున్నారా? మీకు మెసేజ్ ఇలా వచ్చిందా?

  • Publish Date - January 15, 2020 / 04:31 AM IST

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త. మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి. మీ పేటీఎం KYC పూర్తి చేసుకోవాలని, లేదంటే నగదు ఫ్రీజ్ అవుతుందని, మొత్తానికే పేటీఎం అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వస్తే తొందరపడి వివరాలు ఇవ్వకండి. షార్ట్ URL లింకులపై క్లిక్ చేయండి. హ్యాకర్లు, సైబర్ మోసగాళ్ల చేతుల్లోకి మీ వివరాలు వెళ్లిపోతాయి. 

క్షణాల వ్యవధిలో మీ అకౌంట్లలో డబ్బులు కాజేస్తారు. నిజానికి మీ ఫోన్లకు వచ్చే KYC అప్‌డేట్ అనే మెసేజ్ లు దాదాపు పేటీఎం కంపెనీ పంపించేవి కాదని గుర్తించండి. పేటీఎం కంపెనీ అధికారులెవ్వరూ మీకు KYC పూర్తి చేసుకోవాలని, బ్లాక్ అవుతుందంటూ ఫోన్ కాల్ లేదా మెసేజ్ లు పంపరు. ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నుంచి KYC మెసేజ్ రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై పేటీఎం తమ యూజర్లను ఎప్పటికప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది. 

ఇలాంటి ఫేక్ మెసేజ్ లను ఎవరూ నమ్మొద్దని పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ ట్విట్టర్ వేదికగా యూజర్లను అలర్ట్ చేస్తున్నారు. తమ కంపెనీ పేరుతో ఫేక్ మెసేజ్ లు సర్క్యూలేట్ అవుతున్నాయని ఆయన అన్నారు. వీటి విషయంలో యూజర్ల జర జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ‘మీ పేటీఎం అకౌంట్ బ్లాక్ అవుతుందని వెంటనే KYC చేసుకోవాలంటూ వచ్చిన SMSలను దయచేసి ఎవరూ నమ్మవద్దు. 

మీ పేటీఎం అకౌంట్లో నగదు కాజేసేందుకు సైబర్ మోసగాళ్లు చేస్తున్న ప్రయత్నాలివి. KYC స్కామ్ మెసేజ్ లను పేటీఎం కంపెనీ పేరుతో సర్క్యూలేట్ చేస్తున్నారు. KYC పూర్తి చేయడం కోసం ఎలాంటి యాప్స్ డౌన్ లోడ్ చేయమని యూజర్లు పేటీఎం SMSలు పంపించదు’ అని కంపెనీ చీఫ్ ట్విట్టర్లో యూజర్లకు పలు సూచనలు చేశారు. కొన్ని రోజులుగా కొన్ని SMSలతో లక్కీ డ్రా అంటూ యూజర్ల వివరాలను తస్కరించేందుకు మోసగాళ్లు ప్రయత్ని స్తున్నారని, వారి ట్రాప్ లో పడొద్దని మరో ట్వీట్ చేశారు. 

ఇటీవల చాలామంది పేటీఎం యూజర్లు కంపెనీ సైబర్ సెల్, ఆర్బీఐ అంబూడ్స్‌మేన్ ఫిర్యాదులు వస్తున్నాయి. అప్పటినుంచి పేటీఎం తమ యూజర్లను ఇలాంటి ఫేక్ మెసేజ్ లపై అలర్ట్ చేస్తూ వస్తోంది. అందిన రిపోర్టుల ప్రకారం.. సైబర్ మోసగాళ్లు.. ఫేక్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని.. యూజర్లను KYC వివరాలు పూర్తి చేసుకోవాలని ప్రేరేపిస్తారు.

ఈ యాప్స్ ద్వారా పిన్ జనరేట్ కాగానే యూజర్ల డివైజ్ ను యాక్సస్ చేసుకుంటారు. పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుని పేటీఎం మొబైల్ వ్యాలెట్ తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్లలోని నగదు కాజేస్తారు. మీ డబ్బులకు మీరే బాధ్యులు అని మరవద్దు.