×
Ad

Vijay Sales Holi Sale 2026 : విజయ్ సేల్స్‌లో హోలీ సేల్ ఆఫర్లు.. AC, స్మార్ట్‌ఫోన్లపై 65 శాతం డిస్కౌంట్లు, మరెన్నో బ్యాంకు డిస్కౌంట్లు

Vijay Sales Holi Sale 2026 : హోలీ సేల్ ఇయర్‌బడ్‌లు, ప్లేస్టేషన్ గేమ్‌లు, బ్యాంక్ ఆఫర్‌లపై అద్భుతమైన డీల్‌లను అందిస్తోంది. MyVS లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా అదనపు సేవింగ్స్ అందిస్తుంది.

Vijay Sales Holi Sale 2026 (Image Source: AI generated/ Google Gemini)

  • విజయ్ సేల్స్ హోలీ సేల్ ఆఫర్లే ఆఫర్లు
  • ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్‌పై 65శాతం డిస్కౌంట్
  • బ్యాంకు కార్డులపై రూ. 25వేలు, ఈఎంఐలపై రూ. 15వేల వరకు డిస్కౌంట్
  • కస్టమర్లు 0.75 శాతం వరకు లాయల్టీ పాయింట్లు పొందొచ్చు

Vijay Sales Holi Sale 2026 : ఈ హోలీ పండగకు కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? సమ్మర్ కూడా వచ్చేస్తోంది కొత్త ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రంగుల పండుగ హోలీకి ముందు విజయ్ సేల్స్ హోలీ సేల్‌ను ప్రకటించింది. వైడ్ రేంజ్ ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్‌పై 65శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

రాబోయే హోలీ ఉత్సవాల్లో భాగంగా విజయ్ సేల్స్ రూ.3,599 నుంచి ప్రారంభమయ్యే పార్టీ స్పీకర్లు, రూ.6,399 నుంచి ప్రారంభమయ్యే స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తున్నట్లు తెలిపింది. మీరు కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కొనాలని చూస్తుంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ చైన్ రూ.599కి విక్రయిస్తోంది.

సమ్మర్ దగ్గర పడుతున్న నేపథ్యంలో విజయ్ సేల్స్ ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లపై వరుసగా రూ.24,299, రూ.9,800 నుంచి డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త ప్లేస్టేషన్ గేమ్ కొనాలనుకుంటే రూ.1,599 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Read Also : AC Buying Guide : సమ్మర్‌లో కొత్త AC కొనేముందు జాగ్రత్త, ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. 90% మంది ఇదే చేస్తారు!

విజయ్ సేల్స్ హోలీ కార్డ్ ఆఫర్లు :
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 7,500 లేదా అంతకంటే ఎక్కువ ఈఎంఐ లావాదేవీపై రూ. 7,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ. 25వేలు లేదా అంతకంటే ఎక్కువ ఈఎంఐ లావాదేవీపై రూ. 15వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఈఎంఐ లావాదేవీలపై రూ. 12,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈఎంఐ లావాదేవీలపై రూ.15వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. శని, ఆదివారాల్లో రూ.25వేల వరకు తగ్గింపు పొందవచ్చు. విజయ్ సేల్స్ వన్‌కార్డ్ హోల్డర్లకు రూ.15వేలు లేదా అంతకంటే ఎక్కువ ఈఎంఐ లావాదేవీలపై రూ.20వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

HSBC, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యశ్ బ్యాంక్, BOBCARD, PNB, DBS కార్డ్ హోల్డర్లకు ఈఎంఐ, నాన్-ఈఎంఐ లావాదేవీలపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. విజయ్ సేల్స్ ‘MyVS ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు 0.75 శాతం వరకు లాయల్టీ పాయింట్లను కూడా సంపాదించవచ్చు.