Vivo Y6e 5G : 6,500mAh బ్యాటరీతో కొత్త వివో Y6e 5G వచ్చేసింది.. ఫీచర్ల అదుర్స్, ధర కూడా తక్కువే!
Vivo Y6e 5G Launch : వివో ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. 6500mAh బ్యాటరీతో కొత్త వివో Y6e 5జీ ఫోన్ వచ్చేసింది. ధర, స్పెషిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- June 18, 2026 / 09:03 PM IST
Vivo Y6e 5G Launch
- వివో Y6ఇ 5జీ ఫోన్ 13MP రియర్ కెమెరా సెటప్
- సింగిల్ స్టోరేజ్ ఆప్షన్, వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు
- వివో ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్
Vivo Y6e 5G Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో వివో Y6e 5జీ ఫోన్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ వివో 5జీ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త ఫోన్ ప్రస్తుతం దేశంలో 3 కలర్ ఆప్షన్లలో అమ్మకానికి ఉంది. వివో Y6e 5జీ ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
ఈ లేటెస్ట్ వివో వై సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ, 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇందులో (Vivo Y6e 5G) బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా సిస్టమ్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. వివో Y6e 5జీ ఫోన్ 8.39mm మందంతో, సుమారు 209 గ్రాముల బరువు ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్ కూడా అందిస్తుంది.
వివో Y6e 5G ధర, లభ్యత :
చైనాలో వివో Y6e 5జీ ఫోన్ సింగిల్ వేరియంట్ ధర CNY 1,599 (సుమారుగా రూ. 22వేలు) ఉంటుంది. ఇందులో 6GB ర్యామ్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం వివో చైనా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లోయింగ్ క్లౌడ్స్ వైట్, సన్‌సెట్ బ్లూ ట్వైలైట్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వివో Y6e 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో Y6e 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 6.74-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ అందిస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 16.7 మిలియన్ కలర్ ఆప్షన్లు, 260ppi పిక్సెల్ డెన్సిటీ, 83 శాతం NTSC కవరేజ్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ 90.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వివో ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది.
Read Also : OnePlus 15R Price : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 15R మీ బడ్జెట్‌లోనే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
వివో కొత్త వై సిరీస్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ 4nm ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 1.95GHz క్లాక్ స్పీడ్‌తో 6 ఎఫిషియెన్సీ కోర్లు, 2.2GHz టాప్ క్లాక్ స్పీడ్‌ను అందించే 2 పెర్ఫార్మెన్స్ కోర్లు ఉన్నాయి. వివో Y6e 5జీతో పాటు అడ్రినో 613 జీపీయూ, 6GB LPDDR4x ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది.
కెమెరాల విషయానికొస్తే..
వివో Y6e 5జీ బ్యాక్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP సింగిల్ కెమెరాతో వస్తుంది. 10x వరకు డిజిటల్ జూమ్ ఆటోఫోకస్ అందిస్తుంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్ 2ఎక్స్ డిజిటల్ జూమ్‌తో 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 1080p వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు.
వివో Y6e 5జీలో 6,500mAh బ్యాటరీ ఉంది. 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ కోసం 5G, 4G ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, జీపీఎస్, GLONASS, BeiDou, QZSS, Galileo కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇందులోని సెన్సార్ల లిస్టులో గ్రావిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. కొలతలు 167.4×77.1×8.39mm బరువు, సుమారు 209 గ్రాములు ఉంటుంది.
