1 GB డేటా రూ.35 చేయండి, కాల్ చార్జీలు 8రెట్లు పెంచండి.. ప్రభుత్వాన్ని కోరిన ప్రముఖ టెలికాం కంపెనీ

ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(vodafone idea) షాకింగ్ ప్రతిపాదనలు చేసింది. డేటా, కాల్ ఛార్జీలు(call rates, data prices0 భారీగా పెంచాలంటోంది. ఏకంగా 8

  • Publish Date - February 28, 2020 / 06:26 PM IST

ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(vodafone idea) షాకింగ్ ప్రతిపాదనలు చేసింది. డేటా, కాల్ ఛార్జీలు(call rates, data prices0 భారీగా పెంచాలంటోంది. ఏకంగా 8

ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(vodafone idea) షాకింగ్ ప్రతిపాదనలు చేసింది. డేటా, కాల్ ఛార్జీలు(call rates, data prices0 భారీగా పెంచాలంటోంది. ఏకంగా 8 రెట్లు పెంచాలని అడిగింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాంకి(dot), టెలికాం రెగులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కు వొడాఫోన్ ఐడియా లేఖ రాసింది. వొడాఫోన్ ప్రతిపాదనలు చూస్తే.. ప్రస్తుతం రూ.4-5 మధ్యనున్న 1 జీబీ మొబైల్ డేటా ధరను కనీసం రూ.35కు పెంచాలంది. కాల్స్ ధరను నిమిషానికి 6 పైసలుగా నిర్ణయించాలంది. దీన్ని ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి తీసుకురావాలంది.

ఇలా ధరలను 8 రెట్లు పెంచితేనే.. తాను చెల్లించవలసిన ఏజీఆర్(Adjusted Gross Revenue) బకాయిలను చెల్లించగలనని వొడాఫోన్ స్పష్టం చేసింది. వొడాఫోన్ ఐడియా తనకు వస్తున్న భారీ నష్టాలను గత కొన్ని వారాలుగా మెల్లమెల్లగా ప్రకటిస్తోంది. దీనికితోడు మార్కెట్ షేర్ కూడా పడిపోతూ ఉంది. అలాగే ప్రభుత్వానికి భారీగా ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. 

రూ.53వేల కోట్ల బకాయిలు:
వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం ఏజీఆర్ బకాయిల సంక్షోభంలో ఉంది. ప్రభుత్వానికి భారీ మొత్తంలో రూ.53వేల కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. కంపెనీ ఏమో నష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఛార్జీలు పెంచడం మినహా మరో దారి లేదని వాపోయింది. ఏజీఆర్ బకాయిల చెల్లించేందుకు తమకు 18 సంవత్సరాల సమయం కావాలని.. అలాగే మూడేళ్ల పాటు వడ్డీ, జరిమానా నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరింది.

1 GB డేటా రూ.35, అవుట్ గోయింగ్ కాల్స్ చార్జీ 6 పైసలు:
1 జీబీ డేటా ధర ప్రస్తుతం రూ.4-5 మధ్య ఉంది. దాన్ని రూ.35కు పెంచాలని, నెలవారి కనిష్ట మొబైల్ కనెక్షన్ చార్జీని రూ.50 చేయాలని వొడాఫోన్ కోరింది. వీటిని 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు అవుట్ గోయింగ్ కాల్స్ చార్జీలను కూడా 6 పైసలుగా నిర్ణయించాలని కోరినట్లు తెలుస్తోంది. 3 నెలల క్రితమే వొడాఫోన్ ఐడియా టారిఫ్ లను 50 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. అప్పుడు వొడాఫోన్ తో పాటే ఎయిర్ టెల్, జియో కూడా టారిఫ్ లను పెంచాయి. ఇప్పుడు మళ్లీ వొడాఫోన్ కాల్, ఇంటర్నెట్ చార్జీలను పెంచాలని కోరుతోంది.

దీనిపై ట్రాయ్ నుంచి స్పందన రావాల్సి ఉంది. మరి ట్రాయ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి. ఒకవేళ వొడాఫోన్ ఐడియా కోరినట్టు ట్రాయ్ పర్మిషన్ ఇస్తే కనుక.. వినియోగదారుల జేబుకు భారీగా చిల్లు పడటం ఖాయం. 

ట్రెండింగ్ వార్తలు