Railway Station Shop : టీ కొట్టు నుంచి బుక్ స్టాల్ వరకు.. రైల్వే స్టేషన్‌లో షాప్ మీరూ పెట్టొచ్చు! ఇలా అప్లై చేయండి!

Railway station Shop : రైల్వే స్టేషన్లలో షాపు బిజినెస్ ప్రారంభించాలని చూస్తున్నవారికి అద్భతమైన అవకాశం.. టీ కొట్టు నుంచి బుక్ స్టాల్ వరకు ఏదైనా బిజెనెస్ రన్ చేయొచ్చు. అయితే, రైల్వే నిబంధనల ప్రకారమే చేయాలి? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published on- September 15, 2026 / 04:55 PM IST

Railway station Shop

  • రైల్వే స్టేషన్‌లో షాప్ పెట్టాలా? ఇలా చేస్తే మీ సొంతం
  • రైల్వే స్టేషన్‌లో షాప్ పెట్టేందుకు ఛాన్స్.. ఎవరికి ఇస్తారంటే?
  • స్టేషన్‌లో షాప్ కావాలా? ఇలా అప్లై చేయండి

Railway station Shop : రైల్వే స్టేషన్‌లో షాప్ పెట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. రైల్వే స్టేషన్లలో ఎవరైనా షాపు పెట్టుకోవచ్చు. అయితే, దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
రైల్వే స్టేషన్లలోని ఏదైనా ఖాళీగా ఉన్న కమర్షియల్ స్థలాలను రైల్వే శాఖ వేలం ద్వారా వ్యాపారులకు కేటాయిస్తోంది.

టీ స్టాల్, ఫుడ్ షాప్, బుక్ స్టాల్ వంటి వ్యాపారాలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే, ఇందుకోసం నిర్దిష్ట నిబంధనలు, టెండర్ ప్రాసెస్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అసలు షాప్ ఎలా పొందాలి? ఎవరు అర్హులు? దరఖాస్తు ఎలా చేయాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరం, లైసెన్స్ ఎంతకాలం ఉంటుంది? ఫీజులు ఎంత కట్టాలి? ఒక స్టాల్ ఓపెన్ చేస్తే ఎంతవరకు ఖర్చు అవుతుంది? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టెండర్ ఎలా వేస్తారంటే? :

రైల్వే స్టేషన్‌లో టీ, ఫుడ్ లేదా బుక్ స్టాల్ ఓపెన్ చేయాలంటే సాధారణ షాప్ అప్లికేషన్ ద్వారా కాకుండా రెగ్యులర్ టెండర్లు లేదా ఇ-వేలం ద్వారా ఈ ఛాన్స్ పొందవచ్చు. IRCTC జోనల్ రైల్వే పోర్టల్స్ ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు. తద్వారా అర్హులైన ప్రైవేట్ ఆపరేటర్లు ఈజీగా ఈ వేలంలో తమ పేరును నమోదు చేసుకోవచ్చు.

లైసెన్స్ విండో :
లైసెన్స్ టెన్యూర్ ఏళ్ల పాటు ఉండొచ్చు కానీ, అది అవుట్‌లెట్ టైప్ బట్టి ఉంటుంది. ఫుడ్ ప్లాజా లైసెన్స్ 9 ఏళ్ల పాటు వ్యాలిడిటీ ఉండగా సంబంధిత నివేదికల ప్రకారం.. నిబంధనలు అనేవి ఆహారం, పానీయాలు, క్యాటరింగ్ యూనిట్లు సాధారణంగా 5 ఏళ్ల పాటు లైసెన్స్‌లను పొందే అవకాశం ఉంటుంది.

Read Also : ChatGPT Astra : IRCTCలో నా కోసం ట్రైన్ టికెట్ బుక్ చేయి.. GPT-6 Astra ఏం చేసిందో చూడండి!

బిడ్ కోసం గట్టి పోటీ :
రైల్వే స్టేషన్‌లో ఏదైనా స్టోర్ పొందడం అంటే అంత ఈజీ కాదు.. కేవలం అవసరమైన డబ్బులు కట్టేసి స్టేషన్ లోపల షాపు పెట్టుకోవడమంటే కుదరదు. దరఖాస్తుదారులు సంబంధిత టెండర్‌ను ముందుగా కనుగొని తమ డాక్యుమెంట్లను సమర్పించాలి.

అవసరమైన సెక్యూరిటీ మొత్తాన్ని చెల్లించాలి. బిడ్డింగ్ ప్రాసెస్‌లో ఇతరులతో పోటీ పడాలి. రద్దీగా ఉండే స్టేషన్లపై హైయెస్ట్ బిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది.

ఫస్ట్ కావాల్సిన డాక్యుమెంట్లు :

బిడ్ వేయడానికి ముందుగా కాబోయే ఆపరేటర్లు తమ డాక్యుమెంట్లను రెడీగా పెట్టుకోవాలి. అందులో ప్రధానంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఫోటోగ్రాఫ్‌లు ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరం పడొచ్చు. అదే సమయంలో ఫుడ్ బిజినెస్ సంబంధిత లైసెన్స్ వర్తించే చోట జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా అవసరం పడుతుంది.

రూ. 3 లక్షల వరకు ఖర్చు :
మీరు షాపు పెట్టాలనుకునే రైల్వే స్టేషన్ బట్టి రేటు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అవుట్‌లెట్ ప్రదేశాన్ని బట్టి ఖర్చు భారీగా ఉండొచ్చు. ఈ సమాచారం ప్రకారం.. చెల్లించాల్సిన రుసుములు రూ. 40వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటాయి. అయితే, ఎక్కువ రద్దీగా ఉండే స్టేషన్లు షాపు కోసం బిడ్డింగ్ ప్రాసెస్ కూడా చాలా హైగా ఉంటుంది. దానికి తగ్గ పోటీ కూడా ఉంటుంది.