Gen Z House Buying : సొంతింటి కలకు గుడ్‌బై.. అద్దె జీవితానికే ‘జెన్‌జెడ్’ ఓటు..! రియల్ ఎస్టేట్‌కు కొత్త సవాల్!

Gen Z House Buying : భారత రియల్ మార్కెట్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోతున్న వేళ జెన్‌జెడ్, యువ మిలీనియల్స్ సొంతింటి కన్నా అద్దె జీవితానికే మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు భారత రియల్ ఎస్టేట్, హౌసింగ్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడనుందంటే?

What If Gen Z Never Buys a House ( Image Credit : AI )

  • సొంత ఇల్లు కాదు.. అద్దె ఇల్లే బెస్ట్.. జెన్‌జెడ్ కొత్త ఆలోచన
  • ఇళ్లు కొనే రోజులు పోయాయా..? జెన్‌జెడ్ మారుతున్న ఆలోచనలు
  • జెన్‌జెడ్ చేతుల్లో మారనున్న హౌసింగ్ మార్కెట్.. అసలు కారణం ఇదే
  • ఇల్లు కొనడం కాదు.. ఇంట్లో ఉండే అవకాశమే ముఖ్యం అంటున్న కొత్త తరం

Gen Z House Buying : సొంతిల్లు.. ఈ కల ఇప్పుడు నిజంగా కలే.. సొంతిల్లు కన్నా అద్దె ఇల్లే బెటర్ అంటోంది నేటి తరం.. ఒకప్పుడు సొంత ఇల్లు కొనడమే ప్రతి ఫ్యామిలీ జీవిత లక్ష్యంగా ఉండేది. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ముఖ్యంగా జెన్‌జెడ్ (Gen Z), యువ మిలీనియల్స్‌ ఆలోచనలు పూర్తిగా మారిపోతున్నాయి.

సొంత ఇల్లు కొనడం కన్నా మంచి ఇంటిలో అద్దెకు ఉండడమే బెటర్ అంటున్నారు. దీనికి ఇళ్ల ధరలు భారీగా (Gen Z House Buying) పెరగడం, అధిక గృహ రుణ భారం, మారుతున్న జీవనశైలితో యువత ఆలోచనా విధానం పూర్తిగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అందని ద్రాక్షగా సొంతిల్లు :

ఒకప్పుడు రొట్టె, బట్ట, ఇల్లు అనే 3 ప్రధాన అవసరాలతో కలిసి ఇంటి కలగా ఉండేది. కానీ, ఇప్పుడు అదే ఇల్లు సాధారణ మధ్యతరగతి యువతకు అందని ద్రాక్షగా మారింది. మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో చాలామంది యువత తమ తల్లిదండ్రులతోనే ఉండడం లేదంటే అద్దె ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, బ్లాక్ మనీ ప్రభావం, ప్రతిష్ఠ కోసం ఇళ్లు కొనడం వంటి కారణాలతో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా ఫస్ట్ టైమ్ ఇల్లు కొనాలనుకునే యువతకు అవకాశాలు తగ్గిపోతున్నాయి.

జెన్‌జెడ్ లైఫ్ స్టయిల్ విషయంలో కూడా భారీ మార్పు కనిపిస్తోంది. మ్యూజిక్, సినిమాలు స్ట్రీమింగ్‌లో చూడడం, క్యాబ్‌లను అద్దెకు వినియోగించడం, కో-వర్కింగ్ స్పేస్‌లు, ఫర్నిచర్, హోం అప్లియన్సెస్ కూడా రెంట్ తీసుకోవడం వంటి అలవాట్లు పెరిగాయి. అంటే.. వస్తువులను సొంతంగా చేయడం కన్నా అవసరమైనప్పుడు వాటిని వాడుకునేందుకు ఈ జనరేషన్ ఎక్కువ ప్రాయారిటీ ఇస్తోంది.

Read Also : Vehicles V2V Communication : ఇక వాహనాలే మాట్లాడుకుంటాయి..! V2V టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలకు చెక్.. కేంద్రం మాస్టర్ ప్లాన్!

అద్దె ఇళ్లపైనే ఎక్కువ ఆసక్తి :
ఈ ఆలోచన ఇళ్ల కొనుగోలు విషయంలో కూడా కొనసాగితే.. భవిష్యత్తులో సొంత ఇల్లు కొనడం కన్నా నాణ్యమైన అద్దె గృహాల్లో నివసించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే కో-లివింగ్ స్పేస్‌లు, ప్రొఫెషనల్‌ అద్దె గృహాలకు నగరాల్లో ఫుల్ డిమాండ్ పెరిగిపోతోంది.

భారీగా తగ్గుతున్న జననాల రేటు :

మరోవైపు.. పట్టణ ప్రాంతాల్లో జననాల రేటు కూడా భారీగా తగ్గుతోంది. అసలు పిల్లల్నే కనేందుకు ఇష్టపడటం లేదు. తక్కువ మంది పిల్లలు కనడం లేదంటే అసలు పిల్లలు లేకుండానే జీవించాలని భావించే జంటలు పెరిగిపోతున్నాయి. ఈ ధోరణితో వారికి పెద్ద ఇళ్ల అవసరం కూడా తగ్గనుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో గృహాల కొనుగోలు డిమాండ్‌పైనా దీని ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నారు.

భవిష్యత్తులో రియల్ రంగానికి కొత్త సవాళ్లు :

అయితే, ఈ మార్పు అనేది కేవలం ఒక్కరోజులో జరిగేది కాదు. కానీ, సామాన్యులకు అందుబాటు ధరల్లో ఇళ్లు దొరక్కపోతే.. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొత్త సవాళ్లను ఎదుర్కొక తప్పదని మార్కెట్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

ఒకప్పుడు ‘సొంత ఇల్లు’ అనేది లైఫ్‌లో అతిపెద్ద కల.. కానీ, కొత్త తరానికి మాత్రం కంపర్ట్ ఇళ్లే బెటర్ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే.. భారత హౌసింగ్ మార్కెట్‌లో రాబోయే సంవత్సరాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకోవచ్చు.