LPG Gas Cylinder : గ్యాస్ అయిపోయిందా? ఇలా బుక్ చేశారంటే జస్ట్ 2 గంటల్లోపే ఇంటికి సిలిండర్.. ఫాస్ట్ డెలివరీ ట్రిక్స్!

Fast Gas Cylinder Delivery Tips : గ్యాస్ సిలిండర్ అయిపోయిన వెంటనే బుకింగ్ చేస్తే కేవలం 2 గంటల వ్యవధిలోనే సిలిండర్ డెలివరీ అవుతుందని తెలుసా? గ్యాస్ వినియోగదారులు ఏం చేయాలంటే?

Fast Gas Cylinder Delivery Tips

  • గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయగానే ఇంటికి డెలివరీ అవుతుందా?
  • కేవలం 2 గంటల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవచ్చు
  • గ్యాస్ డెలివరీ కోసం డేట్, టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు

Fast Gas Delivery Tips : మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కంగారు పడకండి.. గ్యాస్ కొరత ఉన్నప్పటికీ అర్జెంట్‌గా సిలిండర్ కావాలంటే తెప్పించుకోవచ్చు. మీరు కానీ ఇలా బుక్ గ్యాస్ బుకింగ్ చేశారంటే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన వెంటనే డెలివరీ కాదు. ఒకటి నుంచి రెండు లేదా మూడు రోజుల సమయం పడుతుంది. ప్రస్తుత వంట గ్యాస్ షార్టేజ్ పరిస్థితుల్లో బుకింగ్ చేసినా వెంటనే సిలిండర్ ఇంటికి వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎక్కువ సమయం పట్టొచ్చు.

అదే మీకు గ్యాస్ బుకింగ్ చేసిన వెంటనే ఫాస్ట్ డెలివరీ కావాలంటే ఈ కింది విధంగా మీరు ట్రై చేయాలి. గ్యాస్ కంపెనీలు బుకింగ్ చేశాక 24 గంటల నుంచి 48 గంటల్లో సిలిండర్ ఇంటికి డెలివరీ చేస్తాయి. కానీ, ఇప్పుడు కొన్ని ఈజీ మార్గాల్లో సిలిండర్ వెంటనే ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇలా చేశారంటే ఫాస్ట్ బుకింగ్ చేయడమే కాకుండా అర్జెంట్ గ్యాస్ సిలిండర్ డెలివరీ కూడా పొందవచ్చు.

మీరు ముందుగా అధికారిక యాప్స్, వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయాలి. ఉదాహరణకు.. ఇండియన్ ఆయిల్ వన్ (ఇండేన్ కస్టమర్లు), HP Pay (HP గ్యాస్ కస్టమర్లు), భారత్ గ్యాస్ (Bharatgas App) వంటి అధికారిక యాప్స్‌లో కొన్ని సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయొచ్చు.

అలాగే ఇండేన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు వాట్సాప్ లేదా మిస్డ్ కాల్ ద్వారా కూడా క్విక్ బుకింగ్ నంబర్ అందిస్తున్నాయి. ఇలా బుక్ చేశారంటే సాధారణంగా ఒకటి నుంచి రెండు రోజుల్లో గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి డెలివరీ అవుతుంది.

Read Also : Best Induction Cookers : వంట గ్యాస్ దొరకట్లేదా? డోంట్ వర్రీ.. అందరూ కొనేస్తున్న టాప్ 6 బెస్ట్ ఇండక్షన్ కుక్కర్లు ఇవే!

కేవలం 2 గంటల్లోనే ఇంటికి సిలిండర్ :
అయితే, మీకు నిజంగా గ్యాస్ సిలిండర్ అవసరం ఉందా? అయితే కొన్ని ప్రాంతాల్లో తత్కాల్ లేదా (Priority Delivery) అనే స్పెషల్ సర్వీసు అందుబాటులో ఉంది. ఉదాహరణకు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందించే ‘Tatkal’సర్వీసు ద్వారా సిలిండర్‌ను కేవలం 2 గంటల్లోనే ఇంటికి డెలివరీ చేసే అవకాశం ఉంటుంది.

ఈ సౌకర్యం అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుందని గమనించాలి. ఈ సర్వీసుకు సాధారణంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల లోకల్ డిస్ట్రిబ్యూటర్లు కూడా క్విక్ డెలివరీ కోసం అదనంగా డబ్బులు ఛార్జ్ చేయొచ్చు.

డెలివరీ టైమ్, డేట్ ఎంచుకోవచ్చు :

మరో అద్భుతమైన ఫీచర్ కూడా ఉంది. చాలా యాప్స్‌లో డెలివరీ రోజు లేదంటే ఏదైనా సమయం ఎంచుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఉదాహరణకు.. మీరు ఇంట్లో ఉండే రోజు లేదా వీకెండ్ రోజును సెలెక్ట్ చేయొచ్చు. ఆ రోజునే మీ ఇంటికి సిలిండర్ పంపేలా డిస్ట్రిబ్యూటర్ ప్లాన్ చేస్తుంది. ఎక్కువగా ఆఫీసులకు ఏదైనా పని మీద ఊరు వెళ్లేవారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

రిజిస్టర్ మొబైల్‌తో గ్యాస్ కనెక్షన్ :
ముఖ్యంగా ఈ విషయం గుర్తుంచుకోండి.. మీ మొబైల్ నంబర్ గ్యాస్ కనెక్షన్‌తో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ఎందుకంటే డెలివరీ సమయంలో మీకు OTP (DAC కోడ్) వస్తుంది. ఇది డెలివరీ చేసే వ్యక్తికి చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం సాధారణంగా 25 రోజుల గ్యాప్ తర్వాతే కొత్త సిలిండర్ బుకింగ్ చేసుకునే వీలుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే అధికారిక గ్యాస్ ఏజెన్సీ యాప్ లేదా వాట్సాప్ ద్వారా వెంటనే బుక్ చేయొచ్చు. అవసరమైతే తత్కాల్ సర్వీసును వాడుకోండి. అప్పుడు గ్యాస్ సిలిండర్ త్వరగా మీ ఇంటికి డెలివరీ అవుతుంది.