Helmet Buying Guide : హెల్మెట్ కొంటున్నారా..? సేఫ్టీ కోసం ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!
Helmet Buying Guide : హెల్మెట్లు కేవలం జరిమానాలను తప్పించుకునేందుకు కాదు.. ప్రాణాలను కాపాడే ఆయుధం కూడా.. హెల్మెట్లు కొనేటప్పుడు ISI మార్క్, IS 4151 స్టాండర్డ్ ఉన్నాయో లేదో తప్పకుండా చెక్ చేయండి. సరైన సైజు, ఫిట్ కూడా ముఖ్యమే..
- Sreehari A
- Published on- June 21, 2026 / 07:30 PM IST
Helmet Buying Guide
- కొత్త హెల్మెట్ కొనేవారు తప్పక తెలుసుకోండి
- హెల్మెట్ కొనేటప్పుడు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
- పాత హెల్మెట్, చౌక ధరకే లభించేవి వాడటం ఆపేయండి
Helmet Buying Guide : టూవీలర్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీరు బైక్ లేదా స్కూటర్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ వాడుతున్నారా? చాలామంది హెల్మెట్ అంటే భద్రత కోసమో లేదా ట్రాఫిక్ పోలీసుల జరిమానాలను తప్పించుకునేందుకే అని భావిస్తుంటారు.
కొంతమంది ఏదో ఒకటిలే అని తక్కువ ధరకే వస్తుంది కదా హెల్మెట్ తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మీరు కూడా (Helmet Buying Guide) కొత్త హెల్మెట్ కొనాలని చూస్తుంటే కొన్ని విషయాల్లో అసలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. హెల్మెట్ కొనేవారు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ఫస్ట్ ISI మార్కును చెక్ చేయండి :
హెల్మెట్ కొనేటప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఒక్కటే.. ISI మార్క్ ఉందో లేదో చూడాలి. ఈ మార్క్ కేవలం లేబుల్ మాత్రమే కాదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్దేశించిన స్ట్రాంగ్ సేఫ్టీ టెస్టింగ్‌లో హెల్మెట్ పాసైందనే ప్రూఫ్ అనమాట.
స్టాండర్డ్ కోడ్‌ను చెక్ చేయండి :
భారత మార్కెట్లో హెల్మెట్‌ల కోసం IS4151 స్టాండర్డ్ తప్పనిసరి. మీరు కొనే హెల్మెట్ పై ఈ కోడ్ ఉందో లేదో తప్పకుండా చెక్ చేయండి. ఈ రోజుల్లో, ఫేక్ ఐసీఐ స్టిక్కర్లతో సరసమైన హెల్మెట్‌లు రోడ్డు సైడ్ అమ్మే మార్కెట్ పెరిగిపోయింది. ఒరిజినల్ హెల్మెట్‌కు స్పెషల్ లైసెన్స్ నంబరే గుర్తు. మీరు అధికారిక బీఐఎస్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను విజిట్ చేసి ఆ హెల్మెట్ వివరాలను వెరిఫై చేయొచ్చు.
సైజు చాలా ముఖ్యం :
చాలాసార్లు, వాహనదారులు ఖరీదైన, బ్రాండెడ్ హెల్మెట్‌లను కొంటారు. కానీ, ఒక చిన్న తప్పు చేస్తారు. తమ తలకు సరిపోయే హెల్మెట్ కాకుండా రాంగ్ సైజును ఎంచుకుంటారు. దాంతో ఆ హెల్మెట్ మీకు ఏమాత్రం ఉపయోగపడదు.
ఫిట్టింగ్ ఎలా చెక్ చేయాలి? :
హెల్మెట్‌ను మీ తలపై పెట్టుకుని ట్రై చేయండి. కొద్దిగా ఎడమకు లేదా కుడికి లేదా పైకి, కిందికి ఊపండి. అది మీ తలపై ఈజీగా మూవ్ అయితే అది పెద్ద సైజు అని అర్థం. అది మీ తలకు ఇరువైపులా నుదుటిపైనా కచ్చితంగా సెట్ అవ్వాలి.
ఈ తప్పులను అసలు చేయొద్దు :
హెల్మెట్‌లను కొనడం లేదా వాడేటప్పుడు తరచుగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అదే మన సేఫ్టీకి ముప్పు అని గుర్తించరు. ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా వాడేసిన లేదా పాత హెల్మెట్‌ను కొనొద్దు.
కొంతమంది డబ్బు సేవింగ్ కోసం ఎవరో వాడిన హెల్మెట్‌ను కొంటారు. ఇది చాలా డేంజర్. ఒకవేళ హెల్మెట్ చిన్న ప్రమాదానికి గురైనా ప్రొటెక్ట్ చేయలేదు. బయటకు చూసేందుకు బాగానే కనిపిస్తుంది.. కానీ, లోపల ఉండే ప్రొటెక్షన్ లేయర్ దెబ్బతింటుంది.
కెమికల్స్, ఆయిల్స్‌కు దూరం :
మీ హెల్మెట్‌ను పాలిష్ చేయాలంటే.. గ్యాసోలిన్, డీజిల్ ఫ్యూయల్, థిన్నర్ లేదా ఏవైనా కఠినమైన కెమికల్ క్లీనర్‌లను ఎప్పుడూ వాడొద్దు. ఈ ప్రొడక్టులు హెల్మెట్ ప్లాస్టిక్ లేదా ఫైబర్ బయటి లేయర్ దెబ్బతీస్తాయి. క్లీనింగ్ కోసం మామూలు నీళ్లు, కొద్దిగా సబ్బు ఉంటే చాలు..
ఎక్స్‌పెయిరీ డేట్ చూశారా? :
హెల్మెట్‌లకు కూడా ఎక్స్ పెయిరీ ఉంటుందని తెలుసా? ఎండ, చెమట వాతావరణ ప్రభావం కారణంగా హెల్మెట్ లోపల కాలక్రమేణా దెబ్బతింటుంది. అందుకే ఐదేళ్ల కన్నా పాతదైన ఏ హెల్మెట్‌నైనా వాడొద్దు. అది కొత్తగా కనిపించినా కూడా వెంటనే మార్చేయాలని నిపుణులు చెబుతున్నారు.
