Xiaomi 2026 TV FX Mini LED : సూపర్ స్మార్ట్‌టీవీలు గురూ.. మినీ LEDలో షావోమీ మాస్టర్ స్ట్రోక్.. థియేటర్ ఫీలింగ్ ఇంట్లోనే!

Xiaomi 2026 TV FX Mini LED : షావోమీ ఇండియా కొత్త FX మినీ LED టీవీ సిరీస్‌ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ టీవీ సిరీస్‌లో 75 అంగుళాల వరకు భారీ స్క్రీన్‌లు ఉన్నాయి. ఈ టీవీల కొనుగోలుపై కంపెనీ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Xiaomi 2026 TV FX Mini LED

Xiaomi 2026 TV FX Mini LED : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? షావోమీ ఇండియా కొత్త మినీ ఎల్ఈడి టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ మినీ ఎల్ఈడీ టీవీ సిరీస్ 43 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు స్క్రీన్ సైజులలో లభిస్తుంది.

షావోమీ కొత్త మినీ ఎల్ఈడి టీవీ సిరీస్ అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్‌ఫామ్‌కు సపోర్టు చేస్తుంది. ఈ టీవీలలో (Xiaomi 2026 TV FX Mini LED) డాల్బీ విజన్, హెచ్‌డీఆర్+, 120Hz గేమింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంటుంది.

షావోమీ టీవీ ఎఫ్ఎక్స్ మినీ ఎల్ఈడీ సిరీస్ ధర :
షావోమీ కొత్త మినీ ఎల్ఈడీ టీవీ సిరీస్ భారత మార్కెట్లో రూ. 32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. 55-అంగుళాల, 65-అంగుళాల, 75-అంగుళాల మోడళ్ల ధరలు వరుసగా రూ. 44,999, రూ. 64,999, రూ.84,999గా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై కంపెనీ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ప్రారంభ 43-అంగుళాల మోడల్‌ను రూ. 29,999కి సొంతం చేసుకోవచ్చు.

ఇతర మోడళ్ల ధరలు వరుసగా రూ. 39,999, రూ. 59,999, రూ. 79,999గా ఉన్నాయి. షావోమీకి చెందిన ఈ స్మార్ట్ టీవీ సిరీస్ జూన్ 11 నుంచి భారత మార్కెట్లో అమ్మకానికి వస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లతో పాటు, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ Mi.com నుంచి కూడా కొనేసుకోవచ్చు.

Read Also : WWDC 2026 : ఆపిల్ మెగా షో టైమ్.. WWDC 2026 లైవ్ ఎలా చూడాలి? iOS 27, ఏఐ సిరిపై అందరి చూపు!

షావోవీ టీవీ ఎఫ్ఎక్స్ మినీ ఎల్ఈడీ సిరీస్ ఫీచర్లు :
ఈ సిరీస్‌లోని అన్ని మోడల్స్ 4K రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తాయి. డిస్‌ప్లే రిజల్యూషన్ 3840×2160 పిక్సెల్స్ ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డిస్‌ప్లేలో లోకల్ డిమ్మింగ్ మినీ ఎల్ఈడీ బ్యాక్‌లైటింగ్ ఫీచర్ ఉంది. కాంట్రాస్ట్‌ను అప్‌గ్రేడ్ చేసి బ్రైట్‌నెస్‌ను పెంచుతుంది. ఈ స్మార్ట్ టీవీ స్క్రీన్ HDR10, HDR10+కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు.. కంపెనీ ఇందులో ఫిల్మ్‌మేకర్ మోడ్‌ను కూడా చేర్చింది.

ఈ షావోమీ స్మార్ట్ టీవీ సిరీస్‌లోని 43-అంగుళాల మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. 55,65,75-అంగుళాల మోడళ్లు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ సిరీస్‌లో MEMC టెక్నాలజీ, ఆటో లో లేటెన్సీ మోడ్, ఐకేర్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కార్టెక్స్ A55 క్వాడ్-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇంటర్నల్ అలెక్సాకు కూడా సపోర్టు ఇస్తుంది.

ఈ షావోమీ మినీఎల్ఈడీ స్మార్ట్ టీవీ సిరీస్‌లో 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉన్నాయి. అమెజాన్ ఫైర్ టీవీపై రన్ అయ్యే ఈ స్మార్ట్ టీవీ సిరీస్, 12వేలకు పైగా ఓటీటీ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్‌లలో WiFi, బ్లూటూత్, HDMI, USB ఉన్నాయి.