Xiaomi Holi Sale : షావోమీ హోలీ సేల్ ఆఫర్లు.. ఈ రెడ్‌మి 5జీ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. తక్కువ ధరకే కొనేసుకోండి!

Xiaomi Holi Sale : షావోమీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక హోలీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్‌తో రెడ్‌‌మి మిడ్-రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Holi Sale

Xiaomi Holi Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? హోలీ పండుగ సందర్భంగా షావోమీ అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 14 ఫోన్ నుంచి రెడ్‌మి నోట్ 13 ప్రో వరకు 200MP కెమెరాతో అనేక రకాల స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

Read Also : LIC Scheme : ఎల్ఐసీలో అదిరే స్కీమ్.. రోజుకు కేవలం రూ. 200 డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు మీ సొంతం..!

ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ ఫోన్ కోసం చూస్తుంటే.. షావోమీ హోలీ సేల్‌ అద్భుతమైన అవకాశం అందిస్తోంది. ఈ ప్రమోషన్ సమయంలో రెడ్‌మి 13సీ 4జీ వంటి సరసమైన మోడళ్లపై కూడా కంపెనీ అనేక డీల్‌లను విస్తరిస్తోంది. హోలీకి షావోమీ అందిస్తున్న డిస్కౌంట్‌లను ఓసారి నిశితంగా పరిశీలిద్దాం.

రెడ్‌మి నోట్ 14 5జీ :
రెడ్‌మి సిరీస్ లేటెస్ట్ మోడల్‌ తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అసలు ధర రూ.18,999 నుంచి తగ్గింది. రెడ్‌మి నోట్ 14 5జీ ఫోన్ 6జీబీ + 128జీబీ వేరియంట్ ఇప్పుడు రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో వస్తుంది. తద్వారా కేవలం రూ.17,999కే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఇతర డిస్కౌంట్‌లతో మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 13సీ 4జీ :
ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ అసలు ఫోన్ ధర రూ.7,999 ఉండగా రూ.7,499కు అందిస్తోంది. ఈ ఫోన్ హోలీకి రూ.500 తగ్గింపుతో వస్తోంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన పెద్ద 6.74-అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ :
ఈ హోలీ సేల్ సమయంలో 200MP కెమెరాతో కూడిన రెడ్‌మి నోట్ 13 ప్రో చాలా తక్కువ ధరకు పొందవచ్చు. 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ అమెజాన్‌లో కేవలం రూ. 18,659కి లభిస్తుంది. అంతేకాదు.. రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వేరియంట్ రూ. 21,999కి జాబితా అయింది. ఎక్స్ఛేంజ్ ఆప్షన్లతో సహా ఇతర ఆఫర్‌లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Read Also : PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు కొత్త అప్‌డేట్.. 20వ విడత డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి పడేది ఎప్పుడంటే?

రెడ్‌మి నోట్ 13 సిరీస్ ధరలు కూడా తగ్గాయి. రూ. 31,999కు లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ ఇప్పుడు రూ. 28,999కు అందుబాటులో ఉంది. రెడ్‌మి నోట్ 13 5జీ, రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ వరుసగా రూ. 17,999 రూ. 25,999 ధరలకు లాంచ్ కాగా, డిస్కౌంట్ ద్వారా రూ. 16,499, రూ. 22,999కు అమ్ముడవుతున్నాయి.

ధర తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు షావోమీ స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్ డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. షావోమీ ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్, ఈఎంఐ లావాదేవీలపై రూ. 5వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.