Xiaomi Mijia AC : కొత్త ఏసీ కొంటున్నారా? షావోమీ కొత్త AC భలే ఉందిగా.. జస్ట్ 15 సెకన్లలో ఇల్లంతా కూలింగ్.. ధర కూడా తక్కువే!

Xiaomi Mijia AC : షావోమీ మిజియా స్ట్రాంగ్ ఎయిర్ ఏసీని లాంచ్ చేసింది. కేవలం 15 సెకన్లలో గదిని కూలింగ్ చేయగలదు. 30 సెకన్లలో హీట్ కూడా జనరేట్ చేయగలదు. పూర్తి వివరాలివే..

Xiaomi Mijia AC

  • షావోమీ ఏసీ 15 సెకన్లలో కూలింగ్, 30 సెకన్లలో హీట్ జనరేట్ చేయగలదు
  • 900m³/h ఎయిర్ ఫ్లో, ఏఐ స్మార్ట్ కంట్రోల్ ఫీచర్లను అందిస్తుంది
  • 55 డిగ్రీల సెల్సియస్ లో-టెంపరేచర్ కూడా పనిచేస్తుంది.

Xiaomi Mijia AC : బాబోయ్.. సమ్మర్.. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాసేపు కూలర్, ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి. చాలామంది ఎండల వేడిని తట్టుకునేందుకు కొత్త ఏసీలు కొనేందుకు చూస్తుంటారు.

మీరు కూడా కొత్త ఏసీ కొనాలని చూస్తుంటే షావోమీ కొత్త మిజియా స్ట్రాంగ్ ఎయిర్ సూపర్ 1.5 హెచ్‌పీ ఎయిర్ కండిషనర్‌ను చైనాలో లాంచ్ చేసింది. కంపెనీ ప్రకారం.. ఈ ఎయిర్ కండిషనర్ కేవలం 15 సెకన్లలో మీ ఇంటి గదిని కూల్ చేస్తుంది. 30 సెకన్లలో హీట్ జనరేట్ చేయగలదు. ఇందులో డ్యూయల్-సిలిండర్ కంప్రెసర్, 900m³/h ఎయిర్ ప్లో, ఏఐ ఆధారిత స్మార్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

షావోమీ స్ట్రాంగ్ ఎయిర్ సూపర్ 1.5HP ఏసీ ధర 2,699 యువాన్లు (సుమారుగా రూ. 36,900). ఏప్రిల్ 28 నుంచి (JD.com)లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ లేదా ఇండియా లాంచ్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

Read Also : SSY Scheme : మీకు ఆడపిల్ల ఉందా? ఈ ప్రభుత్వ పథకంలో రూ. 1. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ఎన్ని ఏళ్లలో రూ. 72 లక్షలు చేతికి అందుతాయంటే?

స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. :
ఈ ఏసీలో 13CC డ్యూయల్-సిలిండర్ కంప్రెసర్ ఉంది. లో-ఫ్రీక్వెన్సీ స్టేబిలిటీ 30 శాతం సౌండ్ 5 శాతం తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో డ్యూయల్-రో కాపర్ ఎవాపరేటర్, కండెన్సర్ ఉన్నాయి. కండెన్సర్‌కు 75 శాతం పెరిగిన హీట్ ఎక్స్చేంజ్ ఏరియా ఉంది.

కంపెనీ ప్రకారం.. ఇందులో భారీ 118mm ఫ్యాన్, డ్యూయల్ ఎయిర్ డిఫ్లెక్టర్లు ఉన్నాయి. గంటకు 900m³ వరకు ఎయిర్ ఫ్లో జనరేట్ చేయగలవు. ఈ ఏసీ ఒక రూమ్ కేవలం 15 సెకన్లలో కూలింగ్ చేయగలదు. 30 సెకన్లలో వేడి చేయగలదు. ఇందులో నేరుగా ఎయిర్ నుంచి ప్రొటెక్షన్ కానోపీ-స్టయిల్ కూలింగ్, కార్పెట్-స్టయిల్ హీటింగ్ సౌకర్యం ఉన్నాయి.

ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
స్మార్ట్ ఫీచర్లలో హైపర్‌ఓఎస్ కనెక్ట్ ఉంది. ఏఐ మాడ్యూల్, ఓటీఏ అప్‌డేట్‌లు, క్లౌడ్ ఆధారిత డయాగ్నోస్టిక్స్ సపోర్ట్‌ను అందిస్తుంది. షావోమీ స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్‌తో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. వాయిస్ కమాండ్‌లకు సపోర్టు ఇస్తుంది. ఇందులో వర్టికల్, హారిజాంటల్ స్వింగ్, సెల్ఫ్-క్లీనింగ్, 58°C వరకు హై టెంపరేచర్ స్టెరిలైజేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఏసీ అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా వేగంగా పనిచేసేలా కంపెనీ రూపొందించింది. కంపెనీ ప్రకారం.. 55 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపచర్ కూలింగ్‌, -15 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్‌లో హీటింగ్‌ను అందిస్తుంది. పవర్ సామర్థ్యం పరంగా సూపర్ లెవెల్ 1 ఎనర్జీ రేటింగ్, 6.01 ఏపీఎఫ్ ఉన్నాయి. లింగ్‌యున్ ఎనర్జీ-సేవింగ్ అల్గారిథమ్ సాయంతో ఏడాదికి 344kWh వరకు విద్యుత్‌ ఆదా చేయగలదని షావోమీ పేర్కొంది.