Yamaha Blue Square: హైదరాబాద్‌లో మరో రెండు బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌లను తెరిచిన యమహా

నూతనంగా ప్రారంభించిన ఔట్‌లెట్లతో యమహా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎనిమిది బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్లకు చేరుకుంది. మొత్తం మ్మీద భారతదేశంలో 180 బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లు అయ్యాయి.

Yamaha Blue Square: ఇండియా యమహా మోటర్‌ (ఐవైఎం) ప్రైవేట్‌ లిమిటెడ్‌ మంగళవారం హైదరాబాద్‌లో నూతన బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌లను ప్రారంభించింది. ఈ బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లను అత్తాపూర్‌లో ఏస్‌ మోటర్స్‌ పేరుతో (2700 చదరపు అడుగుల విస్తీర్ణం); ఆర్‌సీపురంలో రాఘవేంద్ర మోటర్స్‌ (1475 చదరపు అడుగులు) పేరిట సమగ్రమైన సేల్స్‌, సేవలు, స్పేర్స్‌ మద్దతు అందించే రీతిలో ప్రారంభించారు.

Ola Electric Sales : ఓలా ఎలక్ట్రిక్ రికార్డు విక్రయాలు.. ఏప్రిల్‌లో 30వేలకు పైగా యూనిట్లు.. 40శాతం వాటా కైవసం..!

భారతదేశవ్యాప్తంగా బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లను ఏర్పాటుచేయడానికి ప్రధాన కారణం, కంపెనీ విలువలతో వినియోగదారులు అనుసంధానించబడేందుకు ఓ వేదికను అందించడమని తెలిపారు. అలాగే బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడాన్ని వారు గర్వంగా భావించేలా అనుభూతులనూ కలిగించడం. ప్రతి బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌నూ బ్లూ తో అంతర్జాతీయ గ్లోబల్‌ మోటర్‌స్పోర్ట్స్‌లో యమహా పోషించిన వాసరత్వాన్ని నిర్వచించే రీతిలో తీర్చిదిద్దాలన్ని లక్ష్యం. ఈ బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లు బ్లూ స్ట్రీక్స్‌ రైడర్‌ కమ్యూనిటీకి వేదికగా కూడా నిలుస్తుంది. ఇది వినియోగదారులు ఇతర యమహా రైడర్లను కలుసుకునేందుకు వీలుగా ఉంటుంది.

Innova Crysta: ఇన్నోవా క్రిస్టా టాప్‌ గ్రేడ్స్‌ ధరలను ప్రకటించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌

నూతనంగా ప్రారంభించిన ఔట్‌లెట్లతో యమహా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎనిమిది బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్లకు చేరుకుంది. మొత్తం మ్మీద భారతదేశంలో 180 బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లు అయ్యాయి. తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిషా, అస్సాం, ఛత్తీస్‌ఘడ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ లతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి.