Jammu and Kashmir: మంచు చరియలు విరిగిపడి ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి

ముగ్గురుకి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించినట్లు కుప్వారాలోని మిలిటరీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ముగ్గురు సైనికుల మరణంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ జవాన్ల మరణాల్ని దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని అన్నారు

Jammu and Kashmir: మంచు చరియలు విరిగి పడడంతో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించారు. జమ్మూ కశ్మీర్‭లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది ఈ దారుణం. 56 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్ల బృందం పెట్రోలింగ్‌కు వెళ్లింది. మచిల్ సెక్టార్‭లో నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా, ప్రమాదవశాత్తు మంచుచరియలు విరిగిపడ్డాయి. ఇద్దరు సైనికులు హిమపాతంలోనే చిక్కుకు పోయారు. ఆ ఇద్దరు సైనికులను రక్షించి కుప్వారాలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఇద్దరితో పాటు పెట్రోలింగ్‭లో ఉన్న మరో సైనికుడు హైపోథర్మియా(అత్యంత తక్కువకు శరీర ఉష్ణోగ్రత పడిపోవడం)కు గురయ్యారు.

ముగ్గురుకి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించినట్లు కుప్వారాలోని మిలిటరీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ముగ్గురు సైనికుల మరణంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ జవాన్ల మరణాల్ని దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. కాగా, మృతిచెందిన జవాన్లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అక్టోబరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఉత్తరాఖండ్‭లో సంభవించిన హిమపాతం కారణంగా 27 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు.

Guwahati High Court: బుల్డోజర్ల కూల్చివేతలపై హైకోర్టు సీరియస్.. ఇదేం సంస్కృతి అంటూ ప్రభుత్వానికి తలంటు

ట్రెండింగ్ వార్తలు