Karnataka: మొబైల్ ఫోన్ల కోసం వెతికితే కండోంలు, గర్భనిరోధకాలు కనిపించాయి.. హైస్కూలు విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేస్తూ షాకైన అధికారులు

ఈ విషయమై కర్ణాటక ప్రైమరీ, సకండరీ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్ మాట్లాడుతూ ‘‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు (ఐ పిల్) లభించాయి. మరొక విద్యార్థి బ్యాగులోని వాటర్ బాటిలులో మధ్యం ఉంది’’ అని తెలిపారు. విద్యార్థుల మానసిక ప్రవర్తనలో వచ్చిన మార్పుల ఆధారంగా తమకు అనుమానం వచ్చి ఈ తనిఖీ చేపట్టినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

Surprise school bag checks yield condoms, cigarettes in Bengaluru

Karnataka: హైస్కూల్స్ విద్యార్థులు మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారన్న ఫిర్యాదులతో వారి బ్యాగులు తనిఖీ చేయగా కండోంలు, గర్భనిరోధకాలు, సిగరెట్లు, లైటర్లు బయట పడ్డాయి. ఆకస్మిక తనిఖీ చేపట్టిన అధికారులు.. ఇవన్నీ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఓ పాఠశాలలో వెలుగు చూసిందీ దారుణం. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా షాక్ తిన్నారు. ఈ విద్యార్థులంతా 8, 9, 10వ తరగతి చదివే వారు. బెంగళూరులోని నగరభావి పాఠశాలలో వీరంతా చదువుతున్నారు. అయితే వీరు పాఠశాలకు మొబైల్ ఫోన్స్ తీసుకువస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో తాజాగా అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సమయంలోనే కండోంలు, గర్భనిరోధకాలు, సిగరెట్లు, లైటర్లు బయట పడ్డాయి.

Afghanistan Taliban: బడిలో ఉగ్రవాదుల దాడి.. 16 మంది చిన్నారుల మృతి.. 24 మందికి గాయాలు

ఈ విషయమై కర్ణాటక ప్రైమరీ, సకండరీ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్ మాట్లాడుతూ ‘‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు (ఐ పిల్) లభించాయి. మరొక విద్యార్థి బ్యాగులోని వాటర్ బాటిలులో మధ్యం ఉంది’’ అని తెలిపారు. విద్యార్థుల మానసిక ప్రవర్తనలో వచ్చిన మార్పుల ఆధారంగా తమకు అనుమానం వచ్చి ఈ తనిఖీ చేపట్టినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితి నుంచి విద్యార్థులను బయట పడేసేందుకు వారికి మానసిక చికిత్స అందించేందుకు వారికి 10 రోజుల పాటు సెలవులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Delhi liquor scam: ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు