చైనాలోని షాన్దేంగ్ ప్రావిన్స్‌లోని జినాన్ సిటీలో ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘనటలో 10 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
చైనాలోని ఫ్యాక్టరీల్లో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు నెలల్లో నాలుగుసార్లు భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఏడాది మార్చి 31న చైనాలోని జివాంగ్‌సూ ప్రావిన్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మార్చి 30న షాన్దేంగ్‌లోని ఓ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు.
మార్చి 22న చైనాలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యాంచెంగ్‌లోని పారిశ్రామిక వాడలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 78 మంది మృతి చెందారు. మరో 600 మంది గాయపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా కెమికల్ ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించాలని చైనా ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.