girl rape case imprisonment
Girl Rape Case : ఉత్తరప్రదేశ్‌లో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులకు శిక్ష పడింది. బాలిక అత్యాచార కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుల్లో ఒక్కొక్కరికి రూ.31వేల జరిమానా కూడా విధించింది. అయితే, అత్యాచారానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆ ముగ్గురు నిందితులు షకీల్, కలీమ్, అలీమ్‌గా గుర్తించారు.
ప్రభుత్వ అడ్వకేట్ సంజయ్ సింగ్..ముగ్గురి పేర్లను ప్రకటించారు. జూన్ 2010లో రేప్ కేసు నమోదు అయ్యింది. బాధిత బాలిక తండ్రి ఊరిలో లేని సమయంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. దీంతో అమ్మాయి తనకు తాను నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
Minors Gang Rape Girl : దారుణం.. 11ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్
నెల రోజు నుంచి తనను ఆ ముగ్గురు సోదరులు అత్యాచారం చేస్తున్నట్లు చావడానికి ముందు ఆ బాలిక తండ్రికి చెప్పింది. అంతేకాకుండా తనను వ్యభిచారంలోకి నెట్టివేస్తామని బెదిరించినట్లు కూడా అమ్మాయి పేర్కొంది.