Tamilnadu Girl Raped
14 years Tamilnadu girl raped,12 Men arrested : తమిళనాడులో ఘోరం జరిగింది. 14 ఏళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి రెండేళ్లుగా కొంతమంది అత్యాచారం చేస్తున్నారు వారిలో 12 మందిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
నమక్కల్ జిల్లాలోని కుమారపాళ్యంలో నివసించే 14 ఏళ్ళ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన కేసులో బీఎస్ఎన్ లో ఇంజనీరుతో సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరుగుతోందని తెలిసి ఫిర్యాదు అందిన తర్వాత మంగళవారం సాయంత్రానికి 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలింపు చేపట్టారు.
4వతరగతి వరకు చదివిన 14 ఏళ్ల బాలిక తన తల్లితండ్రులు, సోదరితో కలిసి కుమారపాళ్యంలో నివసిస్తోంది. తండ్రి అనారోగ్యం కారణంగా మంచాన పడ్డాడు. తల్లి కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. బాధితురాలి సమీపంలోని ఇళ్లల్లో సహాయకురాలిగా పనిచేస్తోంది.
ఇటీవల అక్కా,చెల్లెళ్లు ఇద్దరూ గొడవ పడినప్పుడు చెల్లెలు ఈవిషయం బయట పెట్టింది. వెంటనే తల్లితండ్రులు ఈవిషయాన్ని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారికి తెలిపారు. వెంటనే ఆయన బాధిత బాలికను నమ్మక్కల్ లోని ప్రభుత్వ రక్షణ గృహానికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికకు మాయ మాటలు చెప్పి, తప్పుడు ఆశలు కల్పించి, మొదటిసారి ఆమె బావ లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది. అనంతరం ఆమె స్నేహితులు, ఆమె పనిచేసే ఇంటి యజమానులు దాదాపు 13 మంది ఆమెపై గత రెండేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నట్లు పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు ఇచ్చిన వివరాలతో 12 మందిని మంగళవారం సాయత్రానికి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరోక నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.